Missing Meghana Review And Rating In Telugu: తెలుగు తెరపై సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అయితే, కథలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని మలుపులు ఉన్నప్పుడే ప్రేక్షకుడు సీటు అంచున కూర్చుని చూస్తాడు.
తెలుగు మిస్టరీ థ్రిల్లర్‌గా మిస్సింగ్ మేఘన

ఇక తెలుగులో ఎప్పుడు సస్పెన్స్, మర్డర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జోనర్లలో సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 18) థియేటర్లలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ క్రైమ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'మిస్సింగ్ మేఘన' .
ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో అంకిత్ కొయ్య కీ రోల్ పోషించారు. మిస్సింగ్ మేఘన మూవీకి డైరెక్టర్ జొన్నలగడ్డ వాచస్పతి దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో నేటి మిస్సింగ్ మేఘన రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
మేఘన (అమ్ము అభిరామి) అనే యువతి ఒకరోజు హఠాత్తుగా అదృశ్యమవుతుంది. అసలు మేఘన ఎలా మాయమైంది? ఆమె అదృశ్యానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఈ కేసుకు, ఆమె తండ్రి శ్రీనివాసరావు (గోపరాజు రమణ), కాబోయే భర్త ఏసీపీ అర్జున్ (కౌశిక్), బైక్ రైడర్ కార్తీక్ (రామ్ కార్తీక్), ఆద్య (వైదిక సెంజలియా)లకు ఉన్న సంబంధం ఏంటి? అసలు మేఘన ఏం చేస్తుంటుంది? ఈ కథలో ఆకాష్ (అంకిత్ కొయ్య) పాత్ర ఏంటీ? ఇన్వెస్టిగేషన్‌లో బయటపడిన సంచలన నిజాలు ఏంటి? అనే అంశాల మిశ్రమే మిస్సింగ్ మేఘన.
కథనం ఎలా ఉందంటే?
ఒక అమ్మాయి మిస్సింగ్ కేస్, దాని చుట్టూ సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఆటోమేటిక్‌గా ఆసక్తి పెరుగుతుంది. దర్శకుడు వాచస్పతి కూడా సినిమా ప్రారంభంలోనే అసలు కథలోకి నేరుగా తీసుకెళ్లి మంచి ఉత్కంఠను కలిగించే ప్రయత్నం చేశారు.
{{/usCountry}}ఒక అమ్మాయి మిస్సింగ్ కేస్, దాని చుట్టూ సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఆటోమేటిక్‌గా ఆసక్తి పెరుగుతుంది. దర్శకుడు వాచస్పతి కూడా సినిమా ప్రారంభంలోనే అసలు కథలోకి నేరుగా తీసుకెళ్లి మంచి ఉత్కంఠను కలిగించే ప్రయత్నం చేశారు.
{{/usCountry}}ఇద్దరు పోలీసు అధికారుల మధ్య వచ్చే విభేదాలు, అనుమానితులను విచారించే సన్నివేశాలతో ఫస్టాఫ్ వేగంగానే సాగుతుంది. మొదటి భాగం ముగింపులో వచ్చే ట్విస్టులు సెకండాఫ్‌లో ఆసక్తిని మరిత పెంచుతాయి. అయితే, ద్వితీయార్థంలో కథ డ్రగ్స్, వరుస హత్యల వైపు అడుగులు వేస్తుంది.
ప్రథమార్థంలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ కోసం పెట్టిన పాట థ్రిల్లింగ్‌గా సాగుతున్న కథకు బ్రేక్ వేసినట్లుగా అనిపిస్తుంది. మెయిన్ విలన్ ఎవరనేది ఫస్టాఫ్ పూర్తికాకముందే సగటు ప్రేక్షకుడు సులభంగా ఊహించగలిగేలా ఉండటంతో కథలోని అసలు థ్రిల్ కొరవడింది. కార్తీక్ లవ్ బ్రేకప్ ట్రాక్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది.
నటీనటులు, సాంకేతిక ప్రతిభ
టాలీవుడ్ బ్యూటీ అమ్ము అభిరామి తన నటనతో చాలా బాగా ఆకట్టుకుంది. తెరపై ఆమె కనిపించే సమయం తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో మెప్పించింది. సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా కౌశిక్, ప్రేమలో విఫలమైన యువకుడిగా రామ్ కార్తీక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. తండ్రి పాత్రలో గోపరాజు రమణ మరోసారి మంచి నటన కనబరిచారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ కొన్ని సన్నివేశాల్లో బాగుంది. అయితే కొన్ని చోట్ల కలర్ గ్రేడింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆర్ఆర్ ధ్రువన్ అందించిన పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. బసవ ఎడిటింగ్ ఇంకాస్తా గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగానే చక్కగా కుదిరాయి.
చివరికీ చెప్పేదంటంటే?
ఒక మంచి సస్పెన్స్ పాయింట్‌ను ఎంచుకున్న డైరెక్టర్ వాచస్పతి తన టేకింగ్‌తో పర్వాలేదనిపించారు. అయితే, గెస్ చేసేలా విలన్ పాత్ర, సాగదీత సన్నివేశాలు కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు పెద్దగా అంచనాలు లేకుండా ఈ మిస్సింగ్ మేఘన సినిమాను ఓసారి చూసేయొచ్చు.