నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అఖండ 2 తాండవం. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి విలన్‌గా అట్రాక్ట్ చేయనున్నాడు. అలాగే, బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది.
అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్

డిసెంబర్ 5న గ్రాండ్‌గా అఖండ 2 థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ మాట్లాడుతూ.. "సనాతన ధర్మం మనదే. భారతదేశానికి మూలాలు. ఆనాడు చత్రపతి శివాజీ గారి సైన్యంలో కూడా అఘోరాలు ఉండేవారు. గొప్ప పోరాటం చేసేవారు. నా సినిమా ఉగాది పచ్చడి లాంటిది. అన్ని రసాలు ఉండాలి. ఈ సినిమాలో సంయుక్త గారు చేసిన పాట కూడా చాలా మంచి సందర్భంలో వస్తుంది" అని అన్నారు.
వాళ్ల నాన్నతో కూడా చేశా
"ఆది పినిశెట్టి చాలా చక్కని పాత్ర చేశారు. నేను వాళ్ల నాన్న గారితో కూడా సినిమాలు చేశాను. సంగీతం రోగాలను నయం చేస్తుంది. సంగీతం బాగుంటే ఆ సినిమా హిట్ అయినట్టే. ఈ సినిమా హిట్ కాదు పేలిపోతున్నాయ్. తమన్ అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇదంతా ఒక సమిష్టి కృషి. తమన్‌తో చేసిన నాలుగు సినిమాలు వరుసగా హిట్లు. ఇప్పుడు అఖండ 2 కూడా అద్భుతమైన విజయం సాధించబోతోంది" అని బాలయ్య జోస్యం చెప్పారు.
"మురళీమోహన్ గారు ఇందులో చాలా అద్భుతమైన పాత్ర చేశారు. ఆకృత్యాలు మీరితే మనిషే ఆ దైవాన్ని తనలో ఆవహించుకుంటాడు అనేదే ఈ సినిమా. అఖండ 2 అద్భుతంగా వచ్చింది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ చాలా అద్భుతమైన పోరాటాలు సమకూర్చారు" అని బాలకృష్ణ తెలిపారు.
పొంగిపోలేదు-కృంగిపోలేదు
{{/usCountry}}"మురళీమోహన్ గారు ఇందులో చాలా అద్భుతమైన పాత్ర చేశారు. ఆకృత్యాలు మీరితే మనిషే ఆ దైవాన్ని తనలో ఆవహించుకుంటాడు అనేదే ఈ సినిమా. అఖండ 2 అద్భుతంగా వచ్చింది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ చాలా అద్భుతమైన పోరాటాలు సమకూర్చారు" అని బాలకృష్ణ తెలిపారు.
పొంగిపోలేదు-కృంగిపోలేదు
{{/usCountry}}"నిర్మాతలు రామ్, గోపి గారు లెజెండ్‌తో మా ప్రయాణం మొదలైంది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా వారి బ్యానర్‌లో చేయడం జరిగింది. మేము మారలేదు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు అపజయాలకు కృంగిపోలేదు. నా అభిమానులు కూడా అంతే" అని బాలయ్య చెప్పుకొచ్చారు.
"అఖండ 2లో గెటప్ వేసుకోవడానికి రెండు గంటలు, తీయడానికి గంట పట్టేది. మేకప్ అమ్మాయి విధి, కాస్ట్యూమర్ సంచారికి థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాని జార్జియాలో చాలా చలి ప్రదేశాల్లో, ఎన్నో అద్భుతమైన లొకేషన్స్‌లో షూట్ చేశాం. మా నాన్నగారు క్రమశిక్షణ నేర్పారు. సినిమా అనుకునే సమయంలో పూర్తి చేయాలి. నేను అదే చేస్తున్నాను. పరిశ్రమ కూడా దాన్ని పాటించాలని కోరుకుంటున్నాను" అని బాలకృష్ణ కోరారు.
హిందీలో డబ్బింగ్ కూడా
"ఈ సినిమాకి హిందీలో డబ్బింగ్ కూడా నేనే చెప్పాను. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు. ఈ వేడుక వచ్చిన అభిమానులందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాను. జైహింద్" అని నందమూరి బాలకృష్ణ తన స్పీచ్ ముగించారు.