థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంటాయి సినిమాలు. కొన్ని థియేటర్లలో ఫ్లాప్ అయినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అవుతాయి. అయితే, థియేటర్లలో సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఓటీటీలో మరింతగా క్రేజ్ సంపాదించుకుంటాయి.
ఓటీటీ రిలీజ్‌పై క్యూరియాసిటీ

థియేటర్లలో ఆడియెన్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఆ సినిమాల ఓటీటీ రిలీజ్‌పై మంచి క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఓటీటీలోకి వచ్చేసింది తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా నారీ నారీ నడుమ మురారి.
బ్యూటిఫుల్ హీరోయిన్స్
యంగ్ హీరో శర్వానంద్, బ్యూటిఫుల్ హీరోయిన్స్ సంయుక్త మీనన్, సాక్షి వైద్య కలిసి నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాకు సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. సామజవరగమన సినిమాలాగే మంచి కామెడీ మూవీ అంటూ అదిరిపోయే టాక్ తెచ్చుకుంది నారీ నారీ నడుమ మురారి చిత్రం.
సంక్రాంతి సినిమాగా
ఈ ఏడాది సంక్రాంతి ఐదు సినిమాల వరకు పోటీ పడ్డాయి. వాటిలో ప్రభాస్, చిరంజీవి వంటి పెద్ద హీరోల సినిమాలు సైతం ఉన్నాయి. వీటన్నింటికంటే చివరిగా వచ్చిన ఈ సంక్రాంతి మూవీ అన్నిటికి మించి బెస్ట్ టాక్ తెచ్చుకుంది. జనవరి 14న సాయంత్రం నుంచి థియేటర్లలో ప్రీమియర్ పడిన నారీ నారీ నడుమ మురారి సినిమాకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
ఐఎమ్‌డీబీలో 7.7 రేటింగ్
నటీనటుల యాక్టింగ్, కామెడీ, లవ్ ట్రాక్ అన్నింటా మంచి పేరు తెచ్చుకుంది నారీ నారీ నడుమ మురారి సినిమా. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో పదికి 7.7 రేటింగ్ సైతం దక్కించుకుంది ఈ మూవీ. అలాంటి నారీ నారీ నడుమ మురారి ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.
5 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}నటీనటుల యాక్టింగ్, కామెడీ, లవ్ ట్రాక్ అన్నింటా మంచి పేరు తెచ్చుకుంది నారీ నారీ నడుమ మురారి సినిమా. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో పదికి 7.7 రేటింగ్ సైతం దక్కించుకుంది ఈ మూవీ. అలాంటి నారీ నారీ నడుమ మురారి ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.
5 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో నారీ నారీ నడుమ మురారి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాలం, కన్నడ వంటి ఐదు భాషల్లో నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రిలీజ్ అయింది. డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చి రాగానే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోయింది నారీ నారీ నడుమ మురారి చిత్రం.
ఓటీటీ ట్రెండింగ్
ఓటీటీ రిలీజ్ రోజు నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా గత నాలుగు రోజులుగా అదే బాట కొనసాగిస్తోంది. గత 4 రోజులుగా ఓటీటీ ట్రెండింగ్‌లో కొనసాగుతోన్న నారీ నారీ నడుమ మురారి సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 1 ప్లేసులో దూసుకుపోతోంది.
అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 1గా
అమెజాన్ ప్రైమ్‌లో ఇండియాలో టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్ మూవీగా నారీ నారీ నడుమ మురారి సినిమా నిలిచింది. దీన్ని బట్టి థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా నారీ నారీ నడుమ మురారి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని అర్థం చేసుకోవచ్చు.