Bold Romantic OTT Series Emily In Paris End With Season 6: డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్, రొమాంటిక్ డ్రామాతో అలరించిన నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ ఓటీటీ వెబ్ సిరీస్ ‘ఎమిలీ ఇన్ పారిస్’ (Emily in Paris) వీక్షకులకు ఒక చేదు వార్త. ఈ బోల్డ్, రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్‌కు ఆరో సీజన్‌తో ఎండ్ కార్డ్ వేస్తున్నట్లు చెప్పి హీరోయిన్ లిల్లీ కొలిన్స్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.
ఓటీటీ యాజమాన్యం స్పష్టం

ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాజమాన్యం స్పష్టం చేసింది. గ్రీస్‌లో ఈ కొత్త సీజన్ షూటింగ్ ప్రారంభమైన తరుణంలోనే ఈ అనూహ్య ప్రకటన వెలువడటం ఈ ఓటీటీ సిరీస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. భారతదేశంలోని మెట్రో నగరాల్లో, ముఖ్యంగా యువతలో ఈ హాలీవుడ్ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. విదేశీ ప్రయాణాలు, గ్లోబల్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడే తెలుగు ఓటీటీ ప్రియులు కూడా ఈ షోను అమితంగా ఆదరిస్తున్నారు.
అయితే, కేవలం ఎమిలీ కథ మాత్రమే కాదు.. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న ‘ది లింకన్ లాయర్’ (The Lincoln Lawyer), ‘ది నైట్ ఏజెంట్’ (The Night Agent) వంటి మరికొన్ని పాపులర్ ఓటీటీ ఒరిజినల్స్ కూడా తదుపరి సీజన్లతో ముగియనున్నట్లు మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
ఆరో సీజన్‌తో ఎమిలీ ప్రయాణానికి ముగింపు
ఈ ఏడాది జనవరిలోనే నెట్‌ఫ్లిక్స్ ఈ ఓటీటీ సిరీస్ ఎమిలీ ఇన్ పారిస్ ఆరో సీజన్‌ను ఖరారు చేసింది. ఐదో సీజన్ ముగింపులో హీరోయిన్ ఎమిలీ కూపర్ (లిల్లీ కొలిన్స్) జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. తన మార్కెటింగ్ ఏజెన్సీ కోసం రోమ్ ఆఫీస్ ప్రారంభించడంలో సహాయం చేసిన ఎమిలీ, చివరకు మళ్లీ పారిస్‌కే తిరిగి రావాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ప్రేమ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను గత సీజన్ చివరి ఎపిసోడ్‌లలో ఆసక్తికరంగా చూపించారు.
"ఎమిలీ హృదయం ఎప్పుడూ పారిస్‌లోనే ఉంది. తను అక్కడే జీవించాలని బలంగా అనుకుంటోంది. ఇది తాత్కాలిక నిర్ణయం కాదు" అని ఎమిలీ ఇన్ పారిస్ ఓటీటీ సిరీస్ సృష్టికర్త డారెన్ స్టార్ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికా నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయి, పారిస్ సంస్కృతికి అలవాటు పడి అక్కడి జీవనశైలితో ఎలా మమేకమైందనేదే ఈ కథాంశం.
భావోద్వేగ వీడ్కోలు పలికిన దర్శకుడు, నటి
{{/usCountry}}"ఎమిలీ హృదయం ఎప్పుడూ పారిస్‌లోనే ఉంది. తను అక్కడే జీవించాలని బలంగా అనుకుంటోంది. ఇది తాత్కాలిక నిర్ణయం కాదు" అని ఎమిలీ ఇన్ పారిస్ ఓటీటీ సిరీస్ సృష్టికర్త డారెన్ స్టార్ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికా నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయి, పారిస్ సంస్కృతికి అలవాటు పడి అక్కడి జీవనశైలితో ఎలా మమేకమైందనేదే ఈ కథాంశం.
భావోద్వేగ వీడ్కోలు పలికిన దర్శకుడు, నటి
{{/usCountry}}ఎమిలీ ఇన్ పారిస్ ఓటీటీ సిరీస్ ముగింపుపై డారెన్ స్టార్ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయడం తన జీవితంలో మరచిపోలేని ప్రయాణమని కొనియాడారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన నెట్‌ఫ్లిక్స్, పారామౌంట్ సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పారిస్ నగరంపై ప్రేమను, ప్రయాణాలపై ఆసక్తిని పెంచిన ఈ ఆఖరి చాప్టర్‌ను త్వరలోనే వీక్షకుల ముందుకు తెస్తామని చెప్పారు. మరోవైపు ఓటీటీ హీరోయిన్ లిల్లీ కొలిన్స్ కూడా అభిమానుల కోసం ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకుంది.
"ఆరో సీజన్ మీ అందరినీ అలరిస్తుంది. ఎమిలీ జీవిత సాహసయాత్రలో ఇదే చివరి ఘట్టం. ఈ వీడ్కోలు సీజన్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా మార్చడానికి మా చిత్ర బృందం రాత్రింబగళ్లు శ్రమిస్తోంది" అని లిల్లీ కొలిన్స్ పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ
వీక్షణల పరంగా ఈ ఓటీటీ సిరీస్ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత వరుసగా ఐదు వారాల పాటు గ్లోబల్ టాప్ 10 ఇంగ్లీష్ సిరీస్ జాబితాలో నిలిచింది. అంతేకాదు, గత రెండేళ్ల కాలంలోనే ఈ ఓటీటీ షో ఏకంగా 25 కోట్ల (250 మిలియన్) వ్యూస్ సొంతం చేసుకుంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
పారామౌంట్ టెలివిజన్ స్టూడియోస్, జాక్స్ మీడియాతో కలిసి డారెన్ స్టార్ ప్రొడక్షన్స్ ఈ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండటంతో, వచ్చే ఏడాది ప్రథమార్థంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 6 ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.