ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ గతేడాది సృష్టించిన సంచలనం 'కోహ్రా'. ఇప్పుడు ఈ ఓటీటీ సిరీస్ కోహ్రా సీజన్ 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో లవ్లీన్ అనే కీలక పాత్రలో నటించిన మోడల్ కమ్ యాక్ట్రెస్ నీరు సెహగల్ తన నటనతో మంచి మార్కులు కొట్టేస్తున్నారు.
అమెరికాలో పెరిగినా వీడని పంజాబీ బంధం

2026 సంవత్సరం తనకి ఎంతో ప్రత్యేకం అని, ఒక నటిగా తను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని నీరు సెహగల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీరు సెహగల్ పెరిగింది అమెరికాలోనైనా, తన పంజాబీ మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదని చెబుతారు. ఆమె కుటుంబం పంజాబీ సంస్కృతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందట.
నటనలోకి రాకముందు నీరు సెహగల్ ఒక బ్యూటీ పేజెంట్ క్వీన్. అందాల పోటీలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని, అయితే కథలు చెప్పడం అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని ఆమె అంటారు. అందుకే మోడలింగ్ నుంచి నటన వైపు సహజంగానే అడుగులు వేశానని నీరూ వివరించారు.
'కోహ్రా 2'లోకి లవ్లీన్ ప్రవేశం
కోహ్రా ఓటీటీ సిరీస్‌లో సామ్ (రణ్‌విజయ్ సింఘా) ప్రేయసిగా, ఒక హత్య కేసులో చిక్కుకున్న వ్యక్తికి అండగా నిలిచే లవ్లీన్ పాత్రలో నీరు సెహగల్ కనిపించారు. ఈ పాత్ర కోసం ఆమె స్వయంగా కాస్టింగ్ డైరెక్టర్‌ను సంప్రదించి ఆడిషన్ ఇచ్చారట. పంజాబీలో తన ఇంట్రో వీడియో పంపిన తర్వాత, సెల్ఫ్ టేప్ ద్వారా ఈ అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ పాత్రకు వస్తున్న స్పందన చూసి నీరు సెహగల్ మురిసిపోతున్నారు.
మహేశ్ బాబుతో షూటింగ్ అనుభవం
అయితే, నీరు సెహగల్ గతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఒక ప్రకటన (యాడ్)లో నటించారు. ఆ అనుభవం గురించి అడిగినప్పుడు నీరు సెహగల్ కళ్లు మెరిశాయి.
{{/usCountry}}అయితే, నీరు సెహగల్ గతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఒక ప్రకటన (యాడ్)లో నటించారు. ఆ అనుభవం గురించి అడిగినప్పుడు నీరు సెహగల్ కళ్లు మెరిశాయి.
{{/usCountry}}"మహేశ్ బాబు అంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఎంతో వినయంగా ఉంటారు. సెట్‌లో ఆయన చూపించే క్రమశిక్షణ, పని పట్ల ఆయనకున్న ఏకాగ్రత చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనతో పనిచేయడం నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది" అని నీరు సెహగల్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి కథలు దొరికితే సౌత్ సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమని నీరు సెహగల్ స్పష్టం చేశారు.
లోతైన కథలతో 'కోహ్రా'
ఇకపోతే సుదీప్ శర్మ దర్శకత్వంలో వచ్చిన 'కోహ్రా' కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. పంజాబ్‌లోని కుల వివక్ష, లింగ వివక్ష వంటి సామాజిక అంశాలను కూడా ఇది చర్చిస్తుంది. గందరగోళ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడే లవ్లీన్ వంటి పాత్రను పోషించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నీరు సెహగల్ ముగించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కోహ్రా సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.