Netflix OTT Release Movies To Watch This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు సినీ ప్రియులు ఓటీటీ వేదికల వైపు దృష్టి సారిస్తారు. వారి అభిరుచులకు తగినట్లే ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు

థ్రిల్లర్, యాక్షన్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, కామెడీ.. ఇలా ప్రతి ఒక్కరినీ అలరించే విభిన్న కథాంశాలతో రూపొందిన ఇంట్రెస్టింగ్ సినిమాలను ఇప్పుడు నెట్‌ఫ్సిక్స్ ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ, రేపటి వీకెండ్‌ను ఎంజాయ్ చేయడానికి మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోదగ్గ 7 అత్యుత్తమ సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేయండి.
1. అక్క (Akka) – లేడీ గ్యాంగ్‌స్టర్ల క్రైమ్ థ్రిల్లర్ (IMDb: 4.9)
నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్, రాధికా ఆప్టే, అన్షుమన్ పుష్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ క్రైమ్ ఓటీటీ సిరీస్ 'అక్క'. 1980ల నాటి పెర్నూరు అనే ఊహాజనిత దక్షణాది గ్రామం నేపథ్యంలో ఈ కథ రూపుదిద్దుకుంది. పురుషాధిక్యతకు భిన్నంగా మహిళల అదుపులోనే ఉండే సామాజిక వ్యవస్థ, అక్కడి అక్రమ వ్యాపారాలను శాసించే మహిళా గ్యాంగ్‌స్టర్ల చుట్టూ ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది.
2. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Least Eligible Bachelor) – వైవా హర్ష మార్క్ కామెడీ (IMDb: 6.4)
కమెడియన్ 'వైవా' హర్ష చెముడు ప్రధాన పాత్రలో దర్శకుడు బాబు దేగల తెరకెక్కించిన రోమాంటిక్ కామెడీ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. రూపురేఖలు, శారీరక అమరిక కారణంతో పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బందిపడే 'తేజ' అనే అమాయక యువకుడి కథ ఇది. హైదరాబాద్‌కు మారిన తర్వాత అతడి జీవితంలో ఎదురైన ప్రేమ అనుభవాలను కామెడీగా ఆవిష్కరించారు. హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో నటించారు.
3. సిగ్మా (Sigma) – డెబ్యూ డైరెక్టర్ జేసన్ సంజయ్ హీస్ట్ థ్రిల్లర్ (IMDb: 4.7)
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి యాక్షన్-కామెడీ హీస్ట్ థ్రిల్లర్ 'సిగ్మా'. అప్పుల్లో కూరుకుపోయిన ఒక లైబ్రేరియన్ తన లైబ్రరీని కాపాడుకోవడానికి డ్రగ్ డీలర్లు, జూదగాళ్ల ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఒక రహస్య నిధి, దాని తాళంచెవి కోసం కరడుగట్టిన నేరస్థులతో అతడి టీమ్ చేసే పోరాటం ప్రేక్షకులకు మంచి హై థ్రిల్‌ని ఇస్తుంది.
4. సబ్-ఇన్స్పెక్టర్ యుగంధర్ (Sub-Inspector Yugandhar) – ఆది సాయికుమార్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ (IMDb: 4.7)
{{/usCountry}}కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి యాక్షన్-కామెడీ హీస్ట్ థ్రిల్లర్ 'సిగ్మా'. అప్పుల్లో కూరుకుపోయిన ఒక లైబ్రేరియన్ తన లైబ్రరీని కాపాడుకోవడానికి డ్రగ్ డీలర్లు, జూదగాళ్ల ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఒక రహస్య నిధి, దాని తాళంచెవి కోసం కరడుగట్టిన నేరస్థులతో అతడి టీమ్ చేసే పోరాటం ప్రేక్షకులకు మంచి హై థ్రిల్‌ని ఇస్తుంది.
4. సబ్-ఇన్స్పెక్టర్ యుగంధర్ (Sub-Inspector Yugandhar) – ఆది సాయికుమార్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ (IMDb: 4.7)
{{/usCountry}}యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన సస్పెన్స్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ 'ఐస్‌ఐ యుగంధర్'. పోలీస్ కస్టడీ నుంచి ఊహించని రీతిలో మాయమైన ఒక శవం, అత్యంత అనుమానాస్పద పరిస్థితుల్లో తిరిగి లభించడంతో అసలు కేసు మొదలవుతుంది. ఎస్ఐ యుగంధర్ ఈ విచిత్రమైన కేసును ఛేదించే క్రమంలో వెలుగు చూసిన సత్యాలేంటి అనేది ఆద్యంతం ఉత్కంఠ రేపుతుంది.
5. డోరతి (Dorothy) – కీర్తి సురేష్ ఫ్రెండ్‌షిప్ అండ్ లవ్ డ్రామా (IMDb: 7.7)
తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ డ్రామాలో కీర్తి సురేష్ తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రాణస్నేహితులైన ఇద్దరు మిత్రుల జీవితంలోకి 'డోరతి' అనే అమ్మాయి ప్రవేశించడంతో వారి సంబంధంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వారి బంధం ఏ మలుపు తిరిగింది అనేది ఈ చిత్రంలో హృదయానికి హత్తుకునేలా చూపించారు.
6. మీతే మే క్యా హై (Meethe Mein Kya Hai) – ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా (IMDb: 6.9)
భార్యను కోల్పోయిన దుఃఖంలో ఉన్న జై అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ నానమ్మ ఇంటి దగ్గర సమావేశమైనప్పుడు జరిగే సరదా, భావోద్వేగ సంఘటనల సమాహారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. జై సోదరి తన పెళ్లి గురించి కుటుంబానికి వెల్లడించే సన్నివేశాలు నవ్వులు పూయిస్తూనే హృదయాన్ని తాకుతాయి.
7. దిల్వాలి దివాళి (Dilwali Diwali) – పంజాబీ ఫ్యామిలీ హంగామా (IMDb: 6.1)
మిహీర్ అహూజా, మనోజ్ పహ్వా, నీలు కోహ్లీ ప్రధాన పాత్రల్లో నటించిన ప్యాకేజ్డ్ ఫ్యామిలీ డ్రామా ఇది. విదేశాల నుంచి సుదీర్ఘ కాలం తర్వాత పంజాబ్‌లోని తన స్వగ్రామానికి తిరిగొచ్చిన అన్ష్ సిక్కా, తన కుటుంబ పునఃకలయిక (ఫ్యామిలీ రీ-యూనియన్) సమయంలో ఎదుర్కొనే ఊహించని వివాదాలు, సరదా ఘట్టాల సమ్మేళనం ఈ చిత్రం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని 7 సినిమాలు
వీకెండ్‌ను ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ గడపాలన్నా, లేదా థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఎంజాయ్ చేయాలన్నా నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ 7 సినిమాలు, సిరీస్‌లు సరిగ్గా సరిపోతాయి. పైగా ఇవన్నీ తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆలస్యం ఎందుకు? మీ అభిరుచికి తగ్గ చిత్రాన్ని ఎంచుకుని ఈ వారాంతాన్ని ఓటీటీలో వినోదంతో నింపేయండి.