సినిమాలో ఐదుగురు హీరోయిన్లు- కానీ, టీజర్‌లో ఒక్కరు లేరు- మహిళా దర్శకురాలైన ఏంటీ పురుష అహంకారం- టాక్సిక్‌పై రియాక్షన్స్!
‘కేజీఎఫ్’ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఉన్నా ఈ సినిమాలోని టీజర్‌లో ఒక్కరిని కూడా చూపించకపోవడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దీని వెనుక చిత్ర యూనిట్ మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా లెవల్‌లో ఈ ఏడాది సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic) ఒకటి. శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదలైన టాక్సిక్ సినిమా టీజర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది.

వయోలెంట్ యాక్షన్
రాకీ భాయ్ యశ్ మరోసారి తన వయోలెంట్ యాక్షన్ అవతార్‌తో శత్రువుల అరాచకాన్ని ఊచకోత కోస్తూ కనిపించారు. యశ్ ఇంటెన్స్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతుంటే, మరోవైపు నెటిజన్లు మాత్రం ఒక కీలక విషయాన్ని ప్రశ్నిస్తున్నారు.
హీరోయిన్ల ఆచూకీ ఏదీ? నెటిజన్ల ఫైర్
అయితే, టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ వంటి బిగ్గెస్ట్ హీరోయిన్స్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ. టాక్సిక్ టీజర్‌లో మాత్రం వీరిలో ఏ ఒక్కరు కూడా కనిపించకపోవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.
ఎందుకీ వివక్ష
"సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు, కానీ, టీజర్‌లో ఒక్కరినీ చూపించలేదు.. ఎందుకీ వివక్ష?" అని ఒక యూజర్ ప్రశ్నించగా, మరొకరు మరింత ఘాటుగా స్పందించారు. "టాక్సిక్ సినిమాను ఒక మహిళా దర్శకురాలు (గీతూ మోహన్ దాస్) తెరకెక్కిస్తున్నారు. అయినా టీజర్‌లో కేవలం పురుష అహంకారాన్ని (Toxic Masculinity) మాత్రమే హైలైట్ చేశారు తప్ప, మహిళా నటీమణులకు ప్రాధాన్యత ఇవ్వలేదు" అని అసహనం వ్యక్తం చేశారు.
మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
అయితే, అభిమానులు మాత్రం చిత్ర యూనిట్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. యష్ గడ్డం లేకుండా క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించడం పెద్ద సర్‌ప్రైజ్ అని, ఇది సినిమాపై అంచనాలను పెంచిందని వారు చెబుతున్నారు. హీరోయిన్లను చూపించకపోవడం వెనుక ఒక ‘తెలివైన వ్యూహం’ ఉందని సినీ వర్గాల టాక్.
హైప్ క్రియేట్ చేసేందుకే
"అందరినీ ఒకేసారి చూపించి సస్పెన్స్ వీడకుండా, సినిమాపై చర్చ జరిగేలా చేయడమే మేకర్స్ ప్లాన్. వచ్చే కొన్ని వారాల్లో ఒక్కొక్క నటి పాత్రకు సంబంధించిన చిన్న చిన్న హింట్స్ ఇస్తూ హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మార్చి 19న వెండితెరపై వారి పాత్రలు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలన్నదే దర్శక నిర్మాతల ఉద్దేశం" అని విశ్లేషకులు భావిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం
ఇకపోతే కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న టాక్సిక్ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సరిగ్గా అదే రోజున రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ కూడా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ‘టాక్సిక్’ తలపడటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


