...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు రూరల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్- 9.4 రేటింగ్- స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ మూవీ

OTT Today Release Telugu: ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన రూరల్ లవ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నీలకంఠ. చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో బ్యూటిపుల్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ ఇచ్చింది. మరి నీలకంఠ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Feb 6, 2026, 15:04:21 IST
Advertisement

ఓటీటీలోకి ప్రతి వారం వచ్చినట్లుగానే ఈ వీక్ కూడా ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ సినిమాలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఇవాళ (ఫిబ్రవరి 6) ఒక్కరోజే సుమారు 19 సినిమాల వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఓ తెలుగు సినిమా చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు రూరల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్- 9.4 రేటింగ్- స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ మూవీ
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు రూరల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్- 9.4 రేటింగ్- స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ మూవీ

ఆ మూవీ పేరే నీలకంఠ. టాలీవుడ్ రూరల్ లవ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన నీలకంఠ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా చేశాడు. ఈ సినిమాతోనే మహేంద్రన్ హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమాతో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా రీ ఎంట్రీ ఇచ్చింది.

స్పెషల్ సాంగ్‌తో స్నేహ ఉల్లాల్

నీలకంఠ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌తో స్నేహ ఉల్లాల్ అలరించింది. ఇక నీలకంఠ చిత్రంలో మహేంద్రన్‌కు జోడీగా యష్ణ ముతులూరి హీరోయిన్‌గా చేసింది. హీరోహీరోయిన్లతోపాటు రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను, సత్య ప్రకాష్, భరత్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

నిందితులను బహిష్కరిస్తారు

నీలకంఠం సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణుగోపాల్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఒక యూనిక్ పాయింట్‌తో తెరకెక్కింది. సాధారణంగా తెలుగు సినిమాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఆ ఊరి పెద్ద నిందితులను బహిష్కరిస్తారు.

శిక్షతో హీరోకు తిప్పలు

ఇదే ఏడాది జనవరి 2న థియేటర్లలో నీలకంఠం సినిమా విడుదలైంది. మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ పరంగా పెద్దగా ఆశించిన స్థాయిలో నీలకంఠ ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి ఏకంగా 9.4 రేటింగ్ దక్కించుకుని నీలకంఠం సినిమా సత్తా చాటింది.

నీలకంఠ ఓటీటీ రిలీజ్

ఇలాంటి నీలకంఠం ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఒకటైన సన్ నెక్ట్స్‌లో నీలకంఠ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం వంటి రెండు భాషల్లో ఇవాళ నీలకంఠ ఓటీటీ రిలీజ్ అయింది.

సన్ నెక్ట్స్ ఓటీటీలో

అంటే, థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు 2 నెలలకు నీలకంఠ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో చూడని వారు నీలకంఠను సన్ నెక్ట్స్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks