Top 6 OTT Release Movies Today October 1st: అక్టోబర్ ఆరంభంలోనే ఓటీటీ ప్రియులను అలరించేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో విభిన్న జోనర్లకు చెందిన బెస్ట్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. మరి ఆ టాప్ 6 ఓటీటీ సినిమాలు ఏంటో ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్‌తో సహా తెలుసుకుందాం.
1. సర్దార్ 2 (Sardar 2) - తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
IMDb రేటింగ్: 6.2 / 10
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

తమిళ స్టార్ హీరో కార్తి కథానాయకుడిగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2'. 'డోకు' అనే ప్రమాదకరమైన బయోకెమికల్ ఆయుధాన్ని ప్రయోగించాలనుకునే అంతర్జాతీయ ముఠా కుట్రను అడ్డుకోవడానికి మాజీ అధికారి చంద్రబోస్, ఆయన కుమారుడు విజయ్ ప్రకాష్ చేసే సాహసపేతమైన పోరాటమే ఈ సినిమా.
గతంలో 3,000 మంది ప్రాణాలను బలితీసుకున్న ఒక విషాద ఘటన నేపథ్యంలో రూపొందిన ఈ కథలో.. మాజీ ఏజెంట్లు దాచిన మూడు యాక్సెస్ కీలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు సాగుతాయి. యాక్షన్ థ్రిల్స్‌తో పాటు యాంటీబయాటిక్స్ విపరీత వాడకం వల్ల కలిగే ముప్పుపై ఈ చిత్రం సందేశాన్ని ఇస్తుంది.
2. చుంబక్ సీజన్ 1 పార్ట్ 2 (Chumbak S1 Part 2) - తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్
IMDb రేటింగ్: 6.4 / 10
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
ముంబైలోని 'చుంబక్ కాలనీ' రో-హౌస్ కమ్యూనిటీలోని ఐదు కుటుంబాల మధ్య సాగే సరదా గందరగోళం, రహస్యాలు, అనుబంధాల కలబోతగా ఈ డ్రామా తెరకెక్కింది. మొదటి భాగంలో నిలిచిపోయిన మలుపుల నుంచి ఈ రెండో భాగం కొనసాగుతుంది. పొరుగువారి మధ్య ఉండే స్నేహం, చిన్న చిన్న పొరపాట్లు, కుటుంబ డ్రామాను ఎంతో ఆహ్లాదకరంగా మలిచారు.
3. రోమాంచకం (Romanchakam) - తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
IMDb రేటింగ్: 6.7 / 10
ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
యూత్‌ను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'రోమాంచకం'. సొంతంగా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ సాధించాలనే పట్టుదలతో అన్వేష్ అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒక డేటింగ్ యాప్‌ను రూపొందిస్తాడు. విచిత్రమేమిటంటే.. వేలాది మందికి ప్రేమ దారి చూపే అతడు, తాను ప్రేమించిన అమ్మాయి మనసును మాత్రం గెలుచుకోలేకపోతాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, స్టార్టప్ సంక్షోభంలో పడటంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించారు.
4. దుపహియా సీజన్ 2 (Duphahiya Season 2) - హిందీ
IMDb రేటింగ్: 7.4 / 10
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
{{/usCountry}}యూత్‌ను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'రోమాంచకం'. సొంతంగా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ సాధించాలనే పట్టుదలతో అన్వేష్ అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒక డేటింగ్ యాప్‌ను రూపొందిస్తాడు. విచిత్రమేమిటంటే.. వేలాది మందికి ప్రేమ దారి చూపే అతడు, తాను ప్రేమించిన అమ్మాయి మనసును మాత్రం గెలుచుకోలేకపోతాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, స్టార్టప్ సంక్షోభంలో పడటంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించారు.
4. దుపహియా సీజన్ 2 (Duphahiya Season 2) - హిందీ
IMDb రేటింగ్: 7.4 / 10
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
{{/usCountry}}గ్రామీణ నేపథ్యంతో సాగే కామెడీ ఓటీటీ సిరీస్ 'దుపహియా' రెండో సీజన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. బన్వారీకి చెందిన ఒక భూమిలో మొబైల్ టవర్ ఏర్పాటు చేయాలని చూడటంతో గ్రామంలోని ప్రజలంతా దానికి విచిత్రంగా స్పందిస్తారు. ఊరిలో జరిగే ప్రతీ విపత్తుకు ఆ టవరే కారణమని నిందిస్తారు. మరోవైపు భూగోల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా ఎదగడం, రోష్ని ఎస్ఎస్‌సి పరీక్ష ప్రిపరేషన్, మిథిలేష్ అనుమానం చుట్టూ కథ హంగామాగా సాగుతుంది.
5. ఓ మై డాగ్ (Ohh My Dog) - హిందీ
IMDb రేటింగ్: 8.0 / 10
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో అమిత్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన భావోద్వేగ చిత్రం 'ఓ మై డాగ్'. ఒక చిన్నారి వీధి కుక్కతో ఏర్పరచుకున్న ప్రత్యేకమైన అనుబంధం, ఆ ఆత్మీయ ప్రయాణం వారి జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను ఈ సినిమాలో ఆవిష్కరించారు. జంతువులు, మానవుల మధ్య ఉండే ప్రేమ ఏ విధంగా మనసు గాయాలను మాన్పుతుందో సందేశాత్మకంగా చూపించారు. పవన్ మల్హోత్రా, గీతా అగర్వాల్ శర్మ కూడా ముఖ్య పాత్రల్లో మెరిశారు.
6. ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (East Of Eden) - తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
జాన్ స్టెయిన్‌బెక్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా ఏడు భాగాల సిరీస్‌గా రూపొందిన ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్ 'ఈస్ట్ ఆఫ్ ఈడెన్'. ఫ్లోరెన్స్ ప్యూ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ ట్రాస్క్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. తోబుట్టువుల మధ్య వైరం, వ్యక్తిగత స్వేచ్ఛ, తరతరాలుగా వస్తున్న మానసిక సంఘర్షణల చుట్టూ కథ సాగుతుంది. మైక్ ఫేస్ట్, క్రిస్టోఫర్ అబాట్ కీలక పాత్రలు పోషించారు.
ఒకేదాంట్లో 4, తెలుగులో 4
మంచి కథాంశాలు, అధిక ఐఎమ్‌డీబీ రేటింగ్‌లు ఉన్న ఈ టాప్ 6 చిత్రాలు ప్రస్తుతం ఓటీటీలో వీక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. అయితే, వీటిలో నాలుగు ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, తెలుగు భాషలో కూడా 4 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మీ అభిరుచికి తగ్గట్టు భాషలు, రేటింగ్‌లను బట్టి ఈ చిత్రాలను ఓటీటీలో ఆస్వాదించవచ్చు.