పండుగలు సినిమాలకు చాలా అనువుగా ఉంటాయి. హాలీడేస్ కారణంగా ఎక్కువగా ఆడియెన్స్ చూసేందుకు వీలుంటుందను ఈ పండుగలను టార్గెట్ చేసుకుని సినిమాలను విడుదల చేస్తుంటారు. అలా అక్టోబర్ నెలలో రెండు అతి పెద్ద పండుగలైన దసరా, దీపావళి వచ్చాయి.
అక్టోబర్ నెలలో

అలాగే, అక్టోబర్ నెలలో ప్రతివారం సరికొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. దసరా, దీపావళితోపాటు అక్టోబర్ మంత్ మొత్తంలో తెలుగ స్ట్రయిట్ నుంచి డబ్బింగ్ సినిమాల దాకా రిలీజ్ అయిన సినిమాల్లో ఏది హిట్ అయింది, మరేది ఫట్ అయిందో తెలుసుకుందాం.
అక్టోబర్ మొదటి వారంలో అంటే దసరా సందర్భంగా పవన్ కల్యాణ్ ఓజీ రిలీజ్ కావడంతో మిగతా సినిమాల సందడి లేకుండాపోయింది. కానీ, ధనుష్ ఇడ్లీ కొట్టు, కాంతార చాప్టర్ 1 వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఓజీ పర్వాలేదనిపించుకుంది. ఇడ్లీ కొట్టి ఫ్లాప్ కాగా కాంతార 2 మాత్రం బాక్సాఫీస్ దుమ్ముదులిపింది.
రెండో వారం చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శశివదనే, కానిస్టేబుల్, అరి సినిమాలు ఉన్నాయి. శశివదనే అంతంత మాత్రంగానే పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ నటించిన కానిస్టేబుల్ అసలు విడుదల అయిన విషయమే తెలియకుండా వెళ్లిపోయింది.
అరి సినిమాకు మంచి టాక్
ఇక సరికొత్త మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వచ్చిన అరి మాత్రం బాగానే ఆకట్టుకుంది. వీ జయశంకర్ దర్శకత్వం వహించిన అరి సినిమా అరిషడ్వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మంచి థ్రిల్లర్‌గా ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేసింది. విడుదలైన పది రోజుల తర్వాత కూడా థియేటర్లలో అరి మూవీని ఆడియెన్స్ చూడటాన్ని డైరెక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అక్టోబర్ రెండో వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో అరి మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఇక మూడో వారంలో దీపావళి సందర్బంగా నాలుగు సినిమాలు మిత్ర మండలి, తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ పోటీ పడ్డాయి. వీటిలో ముందుగా విడుదలైన మిత్ర మండలి పెద్దగా నవ్వించలేకపోయింది. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా డిఫరెంట్ కాన్సెప్ట్ అని పేరు తెచ్చుకున్న యావరేజ్‌గా నిలిచింది.
{{/usCountry}}అక్టోబర్ రెండో వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో అరి మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఇక మూడో వారంలో దీపావళి సందర్బంగా నాలుగు సినిమాలు మిత్ర మండలి, తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ పోటీ పడ్డాయి. వీటిలో ముందుగా విడుదలైన మిత్ర మండలి పెద్దగా నవ్వించలేకపోయింది. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా డిఫరెంట్ కాన్సెప్ట్ అని పేరు తెచ్చుకున్న యావరేజ్‌గా నిలిచింది.
{{/usCountry}}ఇక ప్రదీప్ రంగనాథన్, మమితా బైజుల డ్యూడ్ సినిమాకు మొదటి నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ రావడం, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోయింది. దీంతోపాటు కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ సినిమా కూడా బాగానే ఆడింది. మొదటి వారం మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ రెండో వారం నుంచి కలెక్షన్లలో ఊపందుకుంది.
డ్యూడ్ హవా
ఇక నాలుగో వారంలో డబ్బింగ్ మూవీ బైసన్, ధర్మవరం వంటి సినిమాలు వచ్చాయి. ఇవి రిలీజ్ అయిన కూడా డ్యూడ్, కె ర్యాంప్ సినిమాల హవానే సాగింది. అయితే, మధ్యలో రష్మిక మందన్నా హారర్ కామెడీ చిత్రం థామా వచ్చిన పెద్దగా మెప్పించకలేకపోయింది.
ఇక చివరిలో అక్టోబర్ 31న రాజమౌళి బాహుబలి ది ఎపిక్, రవితేజ మాస్ జాతర, కర్మణ్యే వాధికారస్తే సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కర్మణ్యే వాధికారస్తే ఊసు లేకుండా పోతే బాహుబలి ది ఎపిక్ హవానే కొనసాగింది. సినిమాకు మిశ్రమ రెస్పాన్స్ వస్తున్పప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ కలెక్షన్సే ఎక్కువగా ఉంటున్నాయి.
ఇక రవితేజ, శ్రీలీల చేసిన రెండో సినిమా మాస్ జాతరకు నెగెటివ్ టాక్ రావడం, కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అక్టోబర్‌లో రిలీజ్ అయిన ఇన్ని సినిమాల్లో దసరాకు రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1, దీపావళికి విడుదలైన డ్యూడ్ వంటి డబ్బింగ్ సినిమాలే భారీ విజయాన్ని అందుకున్నాయి. ఓజీ, కె ర్యాంప్ మోస్తరు సక్సెస్ సాధించాయి.