ఓటీటీలోకి ఈ వారం తెలుగులో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో మూడు ఒకేరోజు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. అలాగే, అవన్నీ ఒక్కోటి ఒక్కో రకమైన జోనర్లలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఫార్మా ఓటీటీ

మలయాళంలో తెరకెక్కి మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫార్మా. మెడికల్ కార్పోరేషన్‌లో జరిగే అవినీతి చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. డిసెంబర్ 19న అంటే రేపు జియో హాట్‌స్టార్‌లో ఫార్మా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో సైతం ఫార్మా ఓటీటీ రిలీజ్ కానుంది.
ఫాల్అవుట్ సీజన్ 2 ఓటీటీ
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్, సర్వైవల్, డార్క్ కామెడీ సిరీస్‌గా తెరకెక్కింది ఫాల్అవుట్. ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఫాల్అవుట్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
నయనం ఓటీటీ
పక్క వారి జీవితంలో నాలుగు నిమిషాలు తెలుసుకునేందుకు ఓ డాక్టర్ చేసే ప్రయోగమే నయనం ఓటీటీ సిరీస్. వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ జంటగా నటించిన ఈ సైకో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేయనుంది. జీ5లో డిసెంబర్ 19 నుంచి తెలుగుతోపాటు ఇతర భాషల్లో నయనం ఓటీటీ ప్రీమియర్ కానుంది.
ప్రేమంటే ఓటీటీ
ఐఎమ్‌డీబీలో 8 రేటింగ్ సాధించుకున్న తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమంటే. ప్రియదర్శి, ఆనంది, యాంకర్ సుమ, వెన్నెల కిశోర్, హైపర్ ఆది నటించిన ప్రేమంటే సినిమా డిసెంబర్ 19 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమా ప్రేమంటే ఓటీటీ రిలీజ్ కానుంది.
దివ్య దృష్టి ఓటీటీ
{{/usCountry}}ఐఎమ్‌డీబీలో 8 రేటింగ్ సాధించుకున్న తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమంటే. ప్రియదర్శి, ఆనంది, యాంకర్ సుమ, వెన్నెల కిశోర్, హైపర్ ఆది నటించిన ప్రేమంటే సినిమా డిసెంబర్ 19 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమా ప్రేమంటే ఓటీటీ రిలీజ్ కానుంది.
దివ్య దృష్టి ఓటీటీ
{{/usCountry}}హారర్, సస్పెన్స్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రం దివ్య దృష్టి. సునీల్, ఇషా చావ్లా, కమల్ కామరాజు లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు కబీర్ లాల్ డైరెక్షన్ చేశారు. అయితే, దివ్య దృష్టి సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కానుంది.
మరికొన్ని గంటల్లో
సన్ నెక్ట్స్‌లో డిసెంబర్ 19 నుంచి తెలుగులో దివ్య దృష్టి ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, రాజు వెడ్స్ రాంబాయి మూవీ తప్పా మిగతా నాలుగు సినిమాలు మరికొన్ని గంటల్లో అంటే డిసెంబర్ 19 అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి వచ్చేయనున్నాయి.