OTT Movies Release This Week: ఐపీఎల్ రసవత్తర హడావిడి ముగిసింది. ఇక ఓటీటీ స్క్రీన్స్ అన్నీ సరికొత్త వినోదంతో కళకళలాడుతున్నాయి. ఈ వారంలో థియేటర్లకు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే కూర్చుని చూసేందుకు ఓటీటీ సంస్థలు క్రేజీ కంటెంట్‌ను లైన్ అప్ చేశాయి. జూన్ మొదటి వారంలో వీకెండ్ వినోదాన్ని పంచేందుకు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ఓటీటీ రిలీజ్ అవనున్న టాప్ 9 సినిమాలపై లుక్కేద్దాం.
మధ్యతరగతి నవ్వుల 'గుల్లాక్ సీజన్ 5' (సోనీ లివ్ - జూన్ 5)

ది వైరల్ ఫీవర్ (TVF) నుంచి వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ డ్రామా 'గుల్లాక్' సరికొత్త సీజన్‌తో మన ముందుకు వస్తోంది. సంతోష్, శాంతి దంపతులతో పాటు వారి ఇద్దరు కొడుకులు అన్నూ, అమన్ లతో కూడిన మిశ్రా కుటుంబం కథే ఈ ఓటీటీ సిరీస్.
మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే చిన్న చిన్న గొడవలు, ఆనందాలు, ఎమోషన్స్‌ను ఈ ఓటీటీ సిరీస్‌లో అద్భుతంగా చూపిస్తారు. మన తెలుగు ఇళ్లలో జరిగే కథలాగే అనిపించే ఈ హిందీ సిరీస్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఆదరణ ఉంది. జూన్ 5 నుంచి సోనీ లివ్‌లో గుల్లాక్ సీజన్ 5 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్ 'బ్రౌన్' (జీ5 - జూన్ 5)
సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే వారి కోసం వస్తోన్న ఓటీటీ వెబ్ సిరీస్ 'బ్రౌన్'. 'డెల్లీ బెల్లీ', 'బ్లాక్‌మెయిల్' వంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన అభినయ్ డియో ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
కోల్‌కతా నగరం నేపథ్యంలో సాగే ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌లో రీటా బ్రౌన్ అనే ఒకప్పటి సమర్థురాలైన పోలీస్ ఆఫీసర్ కథను చూపించనున్నారు. ప్రస్తుతం మద్యానికి బానిసలై, అవమానాలు ఎదుర్కొంటున్న ఆమె ఒక సంక్లిష్టమైన కేసును ఎలా ఛేదించిందనేది ఆసక్తికరంగా ఉండనుంది. జూన్ 5 నుంచి జీ5 ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది.
మల్టీ లెవెల్ మోసాల కథ 'ది పిరమిడ్ స్కీమ్' (ప్రైమ్ వీడియో - జూన్ 5)
రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చు అంటూ నమ్మించే మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM), చైన్ సిస్టమ్ మోసాల నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ది పిరమిడ్ స్కీమ్'. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో సామాన్య ప్రజలు ఎలాంటి ఉచ్చులో చిక్కుకుంటారు, ఆ తర్వాత వారి జీవితాలు ఎలా అతలాకుతలం అవుతాయనే వాస్తవిక అంశాలతో ఈ హిందీ సిరీస్‌ను రూపొందించారు.
{{/usCountry}}రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చు అంటూ నమ్మించే మల్టీ లెవెల్ మార్కెటింగ్ (MLM), చైన్ సిస్టమ్ మోసాల నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ది పిరమిడ్ స్కీమ్'. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో సామాన్య ప్రజలు ఎలాంటి ఉచ్చులో చిక్కుకుంటారు, ఆ తర్వాత వారి జీవితాలు ఎలా అతలాకుతలం అవుతాయనే వాస్తవిక అంశాలతో ఈ హిందీ సిరీస్‌ను రూపొందించారు.
{{/usCountry}}మన సమాజంలో తరచూ చూసే ఇలాంటి మోసాల వెనుక అసలు నిజాలను ఈ ఓటీటీ సిరీస్ ద్వారా చూపించనున్నారు. జూన్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది పిరమిడ్ స్కీమ్ ఓటీటీ రిలీజ్ కానుంది.
'టైటాన్' బ్రాండ్ సక్సెస్ జర్నీ 'మేడ్ ఇన్ ఇండియా' (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ - జూన్ 3)
భారతదేశంలో ప్రతీ ఒక్కరికీ సుపరిచితమైన ప్రముఖ వాచ్, జ్యువెలరీ బ్రాండ్ 'టైటాన్' (Titan). వినయ్ కామత్ రాసిన ప్రసిద్ధ పుస్తకం ఆధారంగా ఈ బ్రాండ్ ఎలా పుట్టింది, దేశంలోనే అత్యంత విజయవంతమైన బ్రాండ్‌గా ఎలా ఎదిగిందనే స్ఫూర్తిదాయకమైన కథాంశంతో 'మేడ్ ఇన్ ఇండియా' అనే ఓటీటీ సిరీస్ వస్తోంది. జూన్ 3 నుంచి అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఉచితంగా ఈ హిందీ సిరీస్‌ను చూడవచ్చు.
కొరియన్ యాక్షన్ డ్రామా 'టీచ్ యూ ఎ లెసన్' (నెట్‌ఫ్లిక్స్ - జూన్ 5)
తెలుగు ప్రేక్షకులలో కొరియన్ డ్రామాలకు (K-Dramas) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విద్యాసంస్థల్లో జరిగే ర్యాగింగ్, గొడవలు, హింసను అరికట్టేందుకు ఒక సరికొత్త మార్గాన్ని అన్వేషించే కథతో ఈ సౌత్ కొరియన్ యాక్షన్ స్కూల్ డ్రామా రూపొందింది. కిమ్ ము-యెల్, లీ సుంగ్-మిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
హాలీవుడ్ ప్రియుల కోసం 3 క్రేజీ సిరీస్‌లు
ఇంగ్లీష్ కంటెంట్‌ను ఇష్టపడే వారి కోసం ఈ వారం మూడు అదిరిపోయే సిరీస్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.
క్లార్క్‌సన్స్ ఫార్మ్ సీజన్ 5 (అమెజాన్ ప్రైమ్ - జూన్ 3): జెరెమీ క్లార్క్‌సన్ తన అనారోగ్య సమస్యల తర్వాత వ్యవసాయంలో స్థిరపడాలని చూస్తుంటే ఎదురయ్యే ప్రభుత్వ నిబంధనలు, వింత సమస్యల చుట్టూ తిరిగే డాక్యు-సిరీస్ ఇది.
ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషినా సీజన్ 4 (అమెజాన్ ప్రైమ్ - జూన్ 3): క్రోమా కాన్‌క్లేవ్ పతనం తర్వాత విడిపోయిన హీరోలు, ఒక ప్రమాదకరమైన మంత్రగాళ్ల ముఠా నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి మళ్లీ ఎలా ఒకటయ్యారనే యానిమేటెడ్ ఫాంటసీ సిరీస్ ఇది.
కేప్ ఫియర్ (యాపిల్ టీవీ + - జూన్ 4): 'ది ఎగ్జిక్యూషనర్స్' నవల ఆధారంగా తెరకెక్కిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మినీ ఓటీటీ సిరీస్ ఇది. సస్పెన్స్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.
ఒక్కరోజే 4 సినిమాలు
వీటితోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 4న ఓటీటీ రిలీజ్ అయ్యే క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మా బెహెన్‌తో కలిపి ఈ వారం (జూన్ 1 నుంచి 7 వరకు) 9 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో ఒక్క జూన్ 5 నాడు ఏకంగా 4 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి.