OTT Telugu Releases Today: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఓటీటీ కంటెంట్‌కు బానిసలవుతున్నారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల తిరగకముందే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు కూడా డిజిటల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జూన్ 5వ తేదీన

దీనికి తోడు నేరుగా ఓటీటీ రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్‌లు, సినిమాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ జూన్ 5వ తేదీన (శుక్రవారం) ఒక్కరోజే ఏకంగా 10 తెలుగు ఇంట్రెస్టింగ్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. మరి ఆ ఓటీటీ తెలుగు సినిమాలు, వాటి జోనర్లు ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విభిన్న రుచులు
ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) జూన్ 5న మూడు విభిన్న చిత్రాలను తెలుగు డబ్బింగ్‌తో తీసుకొచ్చింది. అందులో మొదటిది "29". ఇది తమిళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం. యువతకు బాగా కనెక్ట్ అయ్యే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక అమెరికన్ కల్చర్ ఇష్టపడే వారి కోసం "ఆఫీస్ రొమాన్స్" అనే హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. కొరియన్ డ్రామాలకు (K-Dramas) మనదేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే నెట్‌ఫ్లిక్స్ "టీచ్ యూ ఏ లెసన్" అనే కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్‌ను తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
జీ5లో యాక్షన్ ధమాకా
జీ5 (ZEE5) ఓటీటీలో నేటి శుక్రవారం రెండు భారీ డబ్బింగ్ సినిమాలను విడుదల చేసింది. మలయాళంలో సూపర్ హిట్టయిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ "పేట్రియాట్" తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుందని ఆశించవచ్చు.
{{/usCountry}}జీ5 (ZEE5) ఓటీటీలో నేటి శుక్రవారం రెండు భారీ డబ్బింగ్ సినిమాలను విడుదల చేసింది. మలయాళంలో సూపర్ హిట్టయిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ "పేట్రియాట్" తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇస్తుందని ఆశించవచ్చు.
{{/usCountry}}అలాగే, కన్నడ ఇండస్ట్రీ నుంచి పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా "కేడీ ది డెవిల్" కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ధ్రువ్ సర్జా, సంజయ్ దత్, నోరా ఫతేహి, శిల్పా శెట్టి యాక్టర్స్ నటించిన ఈ సినిమా వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
సన్ నెక్ట్స్‌లో పీరియాడిక్ డ్రామా
కన్నడలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా "ది రైజ్ ఆఫ్ అశోక" తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను సన్ నెక్ట్స్ (Sun NXT) విడుదల చేసింది. దీనితో పాటు, యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన మాస్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ "మెకానిక్ రాకీ" కూడా సన్ నెక్ట్స్‌లో జూన్ 5 నుంచి అందుబాటులో ఉంటోంది.
హాట్‌స్టార్‌లో ధురంధర్ 2
జియో హాట్‌స్టార్ (Jio Hotstar) స్పై యాక్షన్ థ్రిల్లర్ అభిమానుల కోసం "ధురంధర్ 2: ది రివేంజ్" అనే హిందీ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్‌తో తీసుకొచ్చేసింది. మొదటి భాగంతోపాటు ఈ సీక్వెల్ కూడా భారీ విజయం అందుకుంది. సుమారు రూ. 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది ధురంధర్ 2.
సోనీ లివ్ ఓటీటీలో
ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాపులర్ ఓటీటీ సిరీస్ "గుల్లాక్" (Gullak) సీజన్ 5. మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సంఘటనలు, ఎమోషన్స్‌తో సాగే ఈ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా సిరీస్ సోనీ లివ్ (Sony LIV)లో తెలుగు డబ్బింగ్‌తో జూన్ 5 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
'ఆహా'లో బోల్డ్ థ్రిల్లర్
పక్కా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) ఈ వారం ఒక ఆసక్తికరమైన స్ట్రయిట్ తెలుగు సినిమాతో వచ్చేసింది. "అగ్లీ స్టోరీ" అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం సైకలాజికల్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందింది. ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన నందు, అవికా గోర్ మూవీ అగ్లీ స్టోరీ ఆహా ఓటీటీలో ఇవాళ రిలీజ్ అయింది.
| సినిమా/సిరీస్ పేరు | ఓటీటీ ప్లాట్‌ఫామ్ | జోనర్ | ఓటీటీ రిలీజ్ డేట్ |
|---|---|---|---|
| 29 (మూవీ) | నెట్‌ఫ్లిక్స్ | తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం | జూన్ 5 |
| ఆఫీస్ రొమాన్స్ | నెట్‌ఫ్లిక్స్ | తెలుగు డబ్బింగ్ అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ | జూన్ 5 |
| టీచ్ యూ ఏ లెసన్ | నెట్‌ఫ్లిక్స్ | తెలుగు డబ్బింగ్ కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ | జూన్ 5 |
| అగ్లీ స్టోరీ | ఆహా | తెలుగు సైకలాజికల్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ | జూన్ 5 |
| పేట్రియాట్ | జీ5 | తెలుగు డబ్బింగ్ మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ | జూన్ 5 |
| కేడీ ది డెవిల్ | జీ5 | తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా | జూన్ 5 |
| ది రైజ్ ఆఫ్ అశోక | సన్ నెక్ట్స్ | తెలుగు డబ్బింగ్ కన్నడ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా | జూన్ 5 |
| మెకానిక్ రాకీ | సన్ నెక్ట్స్ | తెలుగు యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ | జూన్ 5 |
| ధురంధర్ 2: ది రివేంజ్ | జియో హాట్‌స్టార్ | తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం | జూన్ 5 |
| గుల్లాక్ సీజన్ 5 | సోనీ లివ్ | తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ | జూన్ 5 |
ఇలా తొమ్మిది డబ్బింగ్, ఒకటి స్ట్రయిట్ తెలుగు సినిమాలతో శుక్రవారం ఓటీటీ ఫెస్టివల్‌గా మారింది. రొమాన్స్, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని జోనర్ల సినిమాలు తెలుగులో ఓటీటీలో సందడి చేస్తున్నాయి.