Payal Radhakrishna About Marriage Telugu Guy: తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా నిలదొక్కుకుంటున్న మరో కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. ఆహా ఓటీటీ సిరీస్ తరగతి గది దాటితో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాధాకృష్ణ సుహాస్ ప్రసన్నవదనం సినిమాతో హీరోయిన్‌గా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత చౌర్యపాఠం సినిమాతో అలరించిన పాయల్ రాధాకృష్ణ ఇటీవలే పాపం ప్రతాప్ మూవీలో నటనతో మెప్పించింది.
త్రిగుణ్ హీరోగా

ఇప్పుడు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ. ఈ సినిమాలో త్రిగుణ్ హీరోగా చేశాడు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీహెచ్‌వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మాతగా నిర్మించారు.
మే 15 శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించారు. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రెస్ మీట్‌లో తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చేసిన హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడే సెటిల్ అవ్వాలని
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నాకు గుర్తింపు ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తున్నాను. వరుసగా ఇక్కడ సినిమాలు రావడం, తాజాగా ‘పాపం ప్రతాప్’తో విజయం రావడం ఆనందంగా ఉంది. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మే 15న అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
పెళ్లి గురించి స్పందిస్తూ.. "నాకు నిజంగానే తెలుగు అబ్బాయి కావాలి" అని పాయల్ రాధాకృష్ణ అంది. దానికి స్టేజ్ మీద ఉన్న వాళ్లు నవ్వడం, చప్పట్లు కొట్టారు. దాంతో పాయల్ రాధాకృష్ణ కూడా నవ్వింది.
అన్నీ ఇక్కడే ఉన్నాయి
{{/usCountry}}పెళ్లి గురించి స్పందిస్తూ.. "నాకు నిజంగానే తెలుగు అబ్బాయి కావాలి" అని పాయల్ రాధాకృష్ణ అంది. దానికి స్టేజ్ మీద ఉన్న వాళ్లు నవ్వడం, చప్పట్లు కొట్టారు. దాంతో పాయల్ రాధాకృష్ణ కూడా నవ్వింది.
అన్నీ ఇక్కడే ఉన్నాయి
{{/usCountry}}"అంటే నేను నిజంగా పర్సనల్‌గా చెబుతున్నా. నాకు వర్క్ ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది, ఫేస్ వాల్యూ ఇచ్చింది, డబ్బులిచ్చింది, ప్లేస్ ఇచ్చింది అన్నీ హైదరాబాద్.. తెలుగు.. తెలుగు ఆడియెన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి నాకు. లైఫ్‌లో చేసింది అన్ని ఇక్కడే ఉన్నాయి. కాబట్టి నేను హైదరాబాద్‌ను, తెలుగు వాళ్లను విడిచిపెట్టే ఆలోచనే లేదు" అని పాయల్ రాధాకృష్ణ చెప్పింది.
"ఇక మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా గురించి వస్తే.. నా కెరీర్ స్టార్టింగ్‌లోనే ఈ సినిమాకు సైన్ చేశాను. అప్పుడు నా దగ్గర ఏ మూవీ లేదు. ముందు ఏ ప్రాజెక్ట్ చేయలేదు. అయినా ఆడిషన్ లేదు, ఏం లేదు, స్క్రిప్ట్ చెప్పారు, ఫోటోస్ చూశారు. పిలిచి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. థ్యాంక్యూ సో మచ్ సర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు" అని పాయల్ రాధాకృష్ణ తెలిపింది.
3, 4 రోజులుగా వైరల్
ఇలా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని, తెలుగు కోడలిగా సెటిల్ అవ్వాలన్న అర్థంలో పాయల్ రాధాకృష్ణ చేసిన కామెంట్స్ గత 3, 4 రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్స్ పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కన్నడ బ్యూటీలంతా తెలుగింటి కోడళ్లైపోతున్నారు అంటూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండను కన్నడ భామ రష్మిక మందన్నా పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రష్మికలా ఆమె దారిలోనే కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ తెలుగు వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.