...
...
Next Story

OTT Thriller: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్- అందమైన లొకేషన్లు, భయపెట్టే హారర్ సీన్స్- 9.2 రేటింగ్- ఎక్కడంటే?

Peter OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ సస్పెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా పీటర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఏకంగా 9.2 రేటింగ్ ఉన్న ఈ సినిమాలో అందమైన లొకేషన్లతో భయపెట్టే హారర్ సీన్స్ ఉన్నాయి. నమ్మినోళ్లే వెన్నుపోటు పొడిచే కథతో తెరకెక్కిన పీటర్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 5, 2026, 12:45:28 IST
Advertisement

Suspense Thriller Peter OTT Release Today: ప్రతి సినీ ఇండస్ట్రీ నుంచి విభిన్నమైన సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. అలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న వైవిధ్యమైన కథా చిత్రాలు కూడా ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సుకేష్ శెట్టి రచన, దర్శకత్వం

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్- అందమైన లొకేషన్లు, భయపెట్టే హారర్ సీన్స్- 9.2 రేటింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్- అందమైన లొకేషన్లు, భయపెట్టే హారర్ సీన్స్- 9.2 రేటింగ్- ఎక్కడంటే?

ఆ కోవలోకే వస్తుంది లేటెస్ట్ కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ రివేంజ్ క్రైమ్ డ్రామా సినిమా పీటర్ (Peter). సుకేష్ శెట్టి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వృద్ధి స్టూడియోస్ బ్యానర్‌పై రవి హిరేమఠ్, రాకేష్ హెగ్గడే నిర్మించారు. పీటర్ చిత్రం ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలైంది.

తెలుగు వారికి ఇష్టమైన పర్యాటక ప్రాంతం కూర్గ్ (కొడగు) నేపథ్యంలో సాగే ఈ రివేంజ్ క్రైమ్ డ్రామా, క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో పీటర్ తెరకెక్కింది. అంతేకాకుండా అందమైన లొకేషన్లతో అనుభూతి పంచడంతో పాటు భయపెట్టే హారర్ సీన్స్ సైతం పీటర్ మూవీలో ఉన్నాయి.

పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య

పీటర్ సినిమా కథాంశం మొత్తం కర్ణాటకలోని కొడగు జిల్లా చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా మడికేరి, భాగమండల లోని మంచు కురిసే పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య ఈ సస్పెన్స్ డ్రామాను ఆవిష్కరించారు దర్శకుడు.

కథలోకి వెళితే.. జీవితంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఓ చెండే (Chende) వాయిద్యకారుడు పీటర్ (రాజేష్ ధ్రువ) చాలా కాలం తర్వాత తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. అతను ఊరికి వచ్చిన సమయంలోనే అక్కడ ఓ ప్రముఖ దేవాలయ ఉత్సవం జరుగుతూ ఉంటుంది.

మడికేరి మంచులో పాత పగలు

ఈ మూవీలో రాజేష్ ధ్రువ టైటిల్ రోల్ 'పీటర్'గా నటించగా, అతనికి జోడీగా జాన్వి రాయల (రాధ), రవీక్ష శెట్టి (మీరా) కీలక పాత్రల్లో మెరిశారు. శంభు పాత్రలో రామ్ నాదగౌడ్, మేరీ పాత్రలో ప్రతిమా నాయక్, డేవిడ్ పాత్రలో భరత్ తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే వరుణ్ పటేల్, రఘు పాండేశ్వర్, రాధాకృష్ణ కుంబ్లే, దీనా పూజారి, సిద్దు, మను కాసరగోడ్, రక్షిత్ దొడ్డెరా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

'పీటర్' కేవలం ఒక సాదాసీదా రివేంజ్ డ్రామా మాత్రమే కాదు. కూర్గ్ నిగూఢ అందాల మధ్య దాగున్న రహస్యాలను, నేరాలను, మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను విశ్లేషించే ప్రయత్నం చేసింది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులను, సమీక్షకులను ఆకట్టుకుంటూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అందుకే ఐఎమ్‌డీబీలో పీటర్ సినిమా పదికి ఏకంగా 9.2 రేటింగ్ సాధించింది. నమ్మినోళ్లే వెన్నుపోటు పొడిస్తే వంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన పీటర్ ఓటీటీలోకి ఇవాళ శుక్రవారం (జూన్ 5) వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పీటర్ ఓటీటీ రిలీజ్ అయింది.

అయితే, ప్రస్తుతం కేవలం కన్నడ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మాత్రమే అమెజాన్ ప్రైమ్‌లో పీటర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. స్పెన్స్, క్రైమ్, మిస్టరీ, హారర్, రివేంజ్ డ్రామా వంటి థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోని పీటర్ చూసేందుకు మంచి ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks