OTT Psychological Horror Thriller Phobia On 4 Platforms: డిజిటల్ వినోద ప్రపంచంలో క్రైమ్, కామెడీ, యాక్షన్ చిత్రాలకు ఎంత క్రేజ్ ఉందో.. హార్ట్ బీట్ పెంచే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు కూడా అంతే ఆదరణ లభిస్తోంది. థ్రిల్లర్ అభిమానులను ప్రతి సన్నివేశంలోనూ భయపెడుతూ, నరనరాల్లోనూ ఉత్కంఠ రేకెత్తించే సినిమాలు ఓటీటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
లెజెండ్ హీరోయిన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

అలాంటి జాబితాలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది లెజెండ్ హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన మైండ్ బ్లోయింగ్ మూవీ 'ఫోబియా'. భయాన్ని, మానసిక సంఘర్షణను తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం థ్రిల్లర్ ఓటీటీ ప్రేమికులకు ఒక ఊహించని అనుభూతిని ఇస్తుంది.
అసలు కథేంటంటే.. ఆ భయమే పెద్ద శత్రువు!
మహెక్ (రాధికా ఆప్టే) ఒక ప్రతిభావంతమైన ఆర్టిస్ట్. ఒకరోజు రాత్రి పార్టీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న టాక్సీ డ్రైవర్ మహెక్‌పై లైంగిక దాడికి ఒడిగడతాడు. ఈ ఉదంతం తర్వాత మహెక్ మనస్సుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఆ భయంకరమైన మానసిక గాయం (ట్రామా) కారణంగా మహెక్ 'ఎగోరాఫోబియా' (Agoraphobia - నలుగురిలోకి వెళ్లాలన్నా, బయటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలన్నా కలిగే విపరీతమైన భయం) బారిన పడుతుంది. గది దాటి బయటకు రావడానికి కూడా ఆమె వణికిపోతుంది.
భయంకరమైన దృశ్యాలు
స్నేహితురాలి సాయంతో ఈ భయం నుంచి బయటపడటానికి మహెక్ ఒక కొత్త అపార్ట్‌మెంట్‌కు మకాం మారుస్తుంది. ప్రశాంతంగా కోలుకోవాలని భావించిన ఆమెకు అక్కడ మరో పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ ప్లాట్‌లో అంతకుముందు నివసించిన 'జియా' అనే యువతి హఠాత్తుగా మాయమైనట్లు మహెక్‌కు తెలుస్తుంది.
ఆ తర్వాత ఆ గదిలో వింత శబ్దాలు వినపడటం, భయంకరమైన దృశ్యాలు కనిపించడం మొదలవుతాయి. జియా అదృశ్యం వెనుక ఆమె ప్రియుడి హస్తం ఉందనే అనుమానం మహెక్లో బలపడుతుంది. ఒకవైపు కంటికి కనిపించని మానసిక భయం, మరోవైపు ఎదురుగా ఉన్న రహస్య చిక్కుముడులు.. వీటన్నింటినీ దాటుకుని మహెక్ ఎలా బయటపడింది అనేది మిగతా కథ.
రాధికా ఆప్టే నటన.. అభినయానికి ప్రశంసల పంట
{{/usCountry}}ఆ తర్వాత ఆ గదిలో వింత శబ్దాలు వినపడటం, భయంకరమైన దృశ్యాలు కనిపించడం మొదలవుతాయి. జియా అదృశ్యం వెనుక ఆమె ప్రియుడి హస్తం ఉందనే అనుమానం మహెక్లో బలపడుతుంది. ఒకవైపు కంటికి కనిపించని మానసిక భయం, మరోవైపు ఎదురుగా ఉన్న రహస్య చిక్కుముడులు.. వీటన్నింటినీ దాటుకుని మహెక్ ఎలా బయటపడింది అనేది మిగతా కథ.
రాధికా ఆప్టే నటన.. అభినయానికి ప్రశంసల పంట
{{/usCountry}}బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లోనూ వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ఇది. ఎగోరాఫోబియాతో బాధపడే బాధిత యువతిగా ఆమె చూపిన హావభావాలు, నటన ప్రేక్షకుల చేత శభాష్ అనిపిస్తాయి. సినిమా మొత్తం తన భుజస్కంధాలపై మోసి అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుంచి విశేషమైన ప్రశంసలు లభించాయి.
"నేను ఎప్పుడూ సినిమాల విజయం గురించిన ఒత్తిడిని నా మైండ్‌కు తీసుకోను. ఇచ్చిన పాత్రను ఎంత బాధ్యతాయుతంగా చేశాననేదే నాకు ముఖ్యం. నటనకు ప్రశంసలు దక్కితే సంతోషిస్తాను, లేకపోతే నా నటనను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాను" అని రాధికా ఆప్టే పీటీఐతో మాట్లాడిన సందర్భంలో పేర్కొన్నారు.
ఫోబియా ఓటీటీ స్ట్రీమింగ్
దర్శకుడు పవన్ కృపలానీ ఫోబియా చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అభినందనీయం. అరుణ్ సుకుమార్, పూజా లఢా సూర్తిలతో కలిసి ఆయన అందించిన స్క్రీన్‌ప్లే ప్రతి నిమిషం ఉత్కంఠను కొనసాగిస్తుంది. అమృత బాగ్చీ, నివేదితా భట్టాచార్య తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ప్రస్తుతం 'అమెజాన్ ప్రైమ్' (Amazon Prime)లో ఫోబియా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తోపాటు, గూగుల్ ప్లే మూవీస్, యూట్యూబ్, ఆపిల్ టీవీ ప్లస్‌లలో కూడా ఫోబియా ఓటీటీ రిలీజ్ అయింది.
ఓటీటీలో వీకెండ్‌కి బెస్ట్
ఐఎమ్‌డీబీలో (IMDb)లో 6.8 రేటింగ్ ఉన్న ఫోబియా సినిమాకు 100 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా గుర్తింపు వచ్చింది. వీకెండ్‌లో మంచి థ్రిల్లింగ్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఓటీటీలో చూసేందుకు'ఫోబియా' బెస్ట్ ఆప్షన్.