మలయాళ చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఇదివరకు పాపులర్ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు, సీనియర్ ప్రొడక్షన్ కంట్రోలర్ కన్నన్ పట్టాంబి (62) ఆదివారం (జనవరి 4) రాత్రి కన్నుమూశారు.
కిడ్నీ సంబంధిత సమస్యలతో

గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కన్నన్ పట్టాంబి కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. జనవరి 4వ తేదీ రాత్రి 11:40 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ కన్నన్ పట్టాంబి తుదిశ్వాస విడిచారు.
ఈ విషాద వార్తను ఆయన సోదరుడు, ప్రముఖ దర్శకుడు మేజర్ రవి ధృవీకరించారు. దీంతో మలయాళ సినీ లోకం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సోదరుడి మృతిపై మేజర్ రవి భావోద్వేగం
తమ కుటుంబంలో జరిగిన ఈ పెద్ద నష్టాన్ని తట్టుకోలేక మేజర్ రవి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. "నా ప్రియతమ సోదరుడు కన్నన్ పట్టాంబి మమ్మల్ని వదిలి స్వర్గస్థుడయ్యాడు. ప్రొడక్షన్ కంట్రోలర్‌గా ఎన్నో సినిమాలకు సేవలు అందించిన ఆయన ఇక లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను" అని మేజర్ రవి ఎమోషనల్ అయ్యారు.
"నేడు (జనవరి 5) సాయంత్రం 4 గంటలకు మా పట్టాంబి నివాసంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఓం శాంతి" అని ఫేస్‌బుక్‌లో మలయాళంలో ఎంతో ఆవేదనతో పోస్ట్ చేశారు డైరెక్టర్ మేజర్ రవి.
'పులిమురుగన్' నుంచి 'కందహార్' వరకు
ఇదిలా ఉంటే, కన్నన్ పట్టాంబి కేవలం నటుడిగానే కాకుండా, సినిమా వెనుక ఉండి నడిపించే ప్రొడక్షన్ కంట్రోలర్‌గా మలయాళ పరిశ్రమలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. భారత సైన్యంలో సేవలు అందించి, ఆ తర్వాత దేశభక్తి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తన సోదరుడు మేజర్ రవితో కలిసి ఆయన ఎన్నో ప్రాజెక్టులలో పనిచేశారు.
{{/usCountry}}ఇదిలా ఉంటే, కన్నన్ పట్టాంబి కేవలం నటుడిగానే కాకుండా, సినిమా వెనుక ఉండి నడిపించే ప్రొడక్షన్ కంట్రోలర్‌గా మలయాళ పరిశ్రమలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. భారత సైన్యంలో సేవలు అందించి, ఆ తర్వాత దేశభక్తి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తన సోదరుడు మేజర్ రవితో కలిసి ఆయన ఎన్నో ప్రాజెక్టులలో పనిచేశారు.
{{/usCountry}}ముఖ్యంగా రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో వచ్చిన 'మిషన్ 90 డేస్' చిత్ర నిర్మాణంలో కన్నన్ పట్టాంబి కీలక పాత్ర పోషించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆయన పనిచేశారు. మలయాళంలో తొలి రూ. 100 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించిన 'పులిమురుగన్' చిత్రానికి కన్నన్ పట్టాంబి అందించిన సహకారం మరువలేనిది.
కన్నన్ పట్టాంబి నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు:
12త్ మ్యాన్ (12th Man)
కురుక్షేత్ర (Kurukshetra)
కందహార్ (అమితాబ్ బచ్చన్, మోహన్‌లాల్ కలయికలో వచ్చిన చిత్రం)
బ్లాక్ (Black)
వెట్టం (Vettam)
కర్మ యోధ (Karam Yodha)
ప్రముఖుల సంతాపం
మొత్తం 23 సినిమాలకు వివిధ బాధ్యతల్లో పనిచేసిన కన్నన్ పట్టాంబి మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక నిబద్ధత కలిగిన సాంకేతిక నిపుణుడిని కోల్పోయామని పలువురు నటులు గుర్తుచేసుకుంటున్నారు.