...
...
Next Story

OTT Movies: ఓటీటీలోకి నిన్న థియేటర్లో రిలీజైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డెకాయిట్- 2 ఒకేదాంట్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Love Insurance Kompany And Dacoit OTT Streaming Platform: ఓటీటీలోకి నిన్న (ఏప్రిల్ 10) థియేటర్లలో విడుదల అయిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డెకాయిట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. లవ్ స్టోరీ చుట్టూ సాగే ఈ రెండు సినిమాలు ఒకేదాంట్లో ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అదేంటో లుక్కేద్దాం.

Published on: Apr 11, 2026, 05:57:36 IST
Advertisement

Lik And Dacoit OTT Release Platform: తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. యూత్ మెచ్చే స్టోరీలతో సినిమాలు తీస్తూ రూ. 100 కోట్ల క్లబ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ వంటి వరుస హ్యాట్రిక్ హిట్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎల్ఐకే).

నయనతార భర్త దర్శకత్వం

ఓటీటీలోకి నిన్న థియేటర్లో రిలీజైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డెకాయిట్- 2 ఒకేదాంట్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న థియేటర్లో రిలీజైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డెకాయిట్- 2 ఒకేదాంట్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

ఎల్ఐకే సినిమాకు నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా ప్రదీప్‌తో జోడీ కట్టింది. వీరితోపాటు ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. యోగిబాబు, గౌరీ జీ కిషన్, సీమాన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకాలపై నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్ ఎల్ఐకే సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో మెంచి రెస్పాన్స్ తెచ్చుకున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 2040 ఇయర్‌లో జరిగే టెక్నాలజీ ప్రేమకథగా ఈ సినిమాను రూపొందించారు.

ఏప్రిల్ 10న రిలీజ్

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ఏప్రిల్ 10న అంటే నిన్న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా టెక్నికల్ వర్క్, సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. మంచి ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీగా ఎల్ఐకే పేరు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై క్యూరియాసిటీ నెలకొంది.

హీరో అడివి శేష్‌కు టాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అవడం, మూవీకి కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్ అందించడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.

డెకాయిట్ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహించగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఎల్ఐకే లాగే లవ్ స్టోరీ కథతో వచ్చిన డెకాయిట్ సినిమా కూడా ఏప్రిల్ 10న అంటే నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. లవ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన డెకాయిట్ కథలో కొత్తదనం కనిపించలేదని టాక్ వస్తోంది

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అయితే, థియేట్రికల్ న్యూ రిలీజ్ అయిన నేపథ్యంలో డెకాయిట్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్‌పై ఇంట్రెస్టింగ్ పెరిగింది. డెకాయిట్ ఓటీటీ రైట్స్‌ను కూడా అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఎల్ఐకేతోపాటు డెకాయిట్ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. ఒకే లవ్ స్టోరీ పాయింట్‌తో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe