Pradhama Drishtya Kuttakkar OTT Release Telugu: మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని మలుపులతో అలరించే మలయాళ చిత్రాలను ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు.
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్

ఇటీవలే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూళ్లతో ఘన విజయం సాధించిన 'ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్' (Pradhama Drishtya Kuttakkar) ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. కేవలం రూ. 3 నుంచి 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
ఆకట్టుకునే కథాంశం.. పార్వతి తిరువోతు తొలి పోలీస్ పాత్ర
లేడీ ఓరియెంటెడ్ కథలను, విభిన్న పాత్రలను ఎంచుకోవడంలో మలయాళ నటి పార్వతి తిరువోతు శైలి వేరు. ఈ ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ సినిమాలో ఆమె తన కెరీర్‌లోనే మొదటిసారిగా పోలీస్ పాత్ర చేశారు. భర్త ఆకస్మిక మరణం తర్వాత కరుణా నియామకం (Compassionate Appointment) ద్వారా పోలీస్ శాఖలో ఉమెన్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందిన ఒక మహిళ కథే ఈ చిత్రం.
విధుల్లో చేరిన కొద్దిరోజులకే
ఆమె విధుల్లో చేరిన కొద్దిరోజులకే వారి పోలీస్ స్టేషన్‌లో ఓ నేరం జరుగుతుంది. తమకున్న పరిజ్ఞానంతో పోలీసులంతా కలిసి ఆ నేరానికి సంబంధించిన ఆధారాలు కనిపించకుండా చేస్తారు. ఈ కేసును సీనియర్ ఆఫీసర్ విచారిస్తాడు. ఆ తర్వాత ఏమైంది?, ఒకవైపు కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లు, మరోవైపు విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడుల నడుమ ఆ కేసు నుంచి ఆమె ఎలా తప్పించుకుంది? అంశాలను దర్శకుడు షహద్ నీలాంబూర్ అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
ప్రథమ దృష్ట్యా కుట్టక్కార్ ఐఎమ్‌డీబీ రేటింగ్
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. దాంతో ఐఎమ్‌డీబీలో ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ సినిమాకు 7.8 రేటింగ్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో పార్వతి తిరువోతుతోపాటు మాథ్యూ థామస్, విజయరాఘవన్, వినయ్ ఫోర్ట్, సిద్ధార్థ్ భరతన్, ఉన్నిమాయ ప్రసాద్, అజీజ్ నెడుమంగాడ్ కీలక పాత్రల్లో కనిపించారు.
ఉత్కంఠం రేపే ఇన్వెస్టిగేషన్
{{/usCountry}}సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. దాంతో ఐఎమ్‌డీబీలో ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ సినిమాకు 7.8 రేటింగ్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో పార్వతి తిరువోతుతోపాటు మాథ్యూ థామస్, విజయరాఘవన్, వినయ్ ఫోర్ట్, సిద్ధార్థ్ భరతన్, ఉన్నిమాయ ప్రసాద్, అజీజ్ నెడుమంగాడ్ కీలక పాత్రల్లో కనిపించారు.
ఉత్కంఠం రేపే ఇన్వెస్టిగేషన్
{{/usCountry}}11 ఐకాన్స్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ సెల్వా నిర్మించిన ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ సినిమాకు పి.ఎస్. సుబ్రమణియన్, విజేష్ తోట్టింగల్ స్క్రిప్ట్ అందించారు. ముజీబ్ మజీద్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలలో ఉత్కంఠను రెట్టింపు చేయగా, రోబీ రాజ్ ఛాయాగ్రహణం, చమన్ చాకో ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ ఓటీటీ స్ట్రీమింగ్
సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ ఓటీటీలోకి ఇప్పుడు వచ్చేయనుంది. ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix)లో ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ ఓటీటీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
తెలుగులో కూడా ఓటీటీ రిలీజ్
కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో ఓటీటీలో ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ విడుదల అవనుంది. థియేటర్లలో మిస్ అయిన థ్రిల్లర్ సినిమాల అభిమానులు ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.