...
...
Next Story

Prakash Raj: ధురంధర్ 2ని మెచ్చుకున్న మహేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్లు- అవసరాలంటూ ట్వీట్!

Prakash Raj On Mahesh Babu Allu Arjun Jr NTR Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ హీరోగా చేసిన ధురంధర్ 2 ది రివేంజ్ సినిమాను టాలీవుడ్ అగ్ర హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ప్రశంసించడంపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. కృతజ్ఞత పాశాలు సౌత్‌కి కూడా పాకాయని ట్వీట్ చేశారు.

Published on: Mar 21, 2026, 08:52:21 IST
Advertisement

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

ధురంధర్ 2ని మెచ్చుకున్న మహేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్‌పై ప్రకాష్ రాజ్  సెటైర్లు- అవసరాలంటూ ట్వీట్! (X/@prakashraaj)
ధురంధర్ 2ని మెచ్చుకున్న మహేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్లు- అవసరాలంటూ ట్వీట్! (X/@prakashraaj)

ధురంధర్ 2 సినిమాను పొగిడిన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండలను ఉద్దేశించి ప్రకాష్ చేసిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

బాలీవుడ్ స్టార్లు ట్వీట్ చేశారా

సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ స్పందిస్తూ.. "ధురంధర్ 2 సినిమాను ఇప్పటివరకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మహేశ్ బాబులు మెచ్చుకున్నారు. మరి బాలీవుడ్ స్టార్లు ఎవరైనా ట్వీట్ చేశారా?" అని ప్రశ్నించారు.

ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?

దీనికి ప్రకాష్ రాజ్ బదులిస్తూ.. "కృతజ్ఞత తీర్చుకోవాల్సిన అవసరాలు (Signs of Obligations) ఇప్పుడు దక్షిణాదికి కూడా పాకాయి.. #justasking" అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. అంటే, ఈ హీరోలు కేవలం మొహమాటానికో లేదా ఇతర కారణాల వల్లనో ధురంధర్ 2ని పొగుడుతున్నారనే అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

మరో ట్వీట్‌లో, పాత హిందీ పాట వింటూ ప్రశాంతంగా ఉన్న వీడియోను షేర్ చేస్తూ.. "నేను ధురంధర్‌కు చాలా దూరంగా ఉన్నాను" ప్రకాష్ రాజ్ అని పేర్కొన్నారు.

టాలీవుడ్ హీరోల ప్రశంసలు ఇవే:

జూనియర్ ఎన్టీఆర్: "భారతీయ ప్రేక్షకులకు ఒక తుఫానును పరిచయం చేసిన టీమ్‌కు సెల్యూట్. రణ్‌వీర్ స్క్రీన్‌పై విశ్వరూపం చూపించారు. ఆదిత్య ధర్ తన దార్శనికతతో ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేశారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు ఎంతో లోతుగా ఉన్నాయి. క్లాసిక్ నటుడు అక్షయ్ ఖన్నా వేసిన పునాదిపై ఈ సీక్వెల్ అద్భుతంగా నిలబడింది."

అల్లు అర్జున్: "సినిమా చూశాను.. దేశభక్తిని చాలా స్టైలిష్‌గా చూపించారు. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. నా సోదరుడు రణ్‌వీర్ లాంటి వెర్సటైల్ యాక్టర్ మన దేశంలో ఉండటం గర్వకారణం. ఆదిత్య ధర్ గారు బంతిని స్టేడియం వెలుపలికి కొట్టారు (సిక్సర్ కొట్టారు)."

విజయ్ దేవరకొండ: “రేపటి నుంచి భారతీయ సినిమాలో కొత్త చరిత్ర మొదలవుతుంది. ఆదిత్య ధర్ ఒక జీనియస్. రణ్‌వీర్ బాంబులా పేలారు. భారత్ మాతాకీ జై!”

సినిమా నేపథ్యం

కాగా, మార్చి 19న ధురంధర్ 2 విడుదల అయింది. ఈ చిత్రం కరాచీలోని ల్యారీ నేపథ్యంలో సాగుతుంది. గతంలో జరిగిన పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా గూఢచారి కార్యకలాపాలను ఈ సినిమాలో చూపించారు. రణ్‌వీర్ సింగ్ ఇందులో జస్కీరత్ సింగ్ రంగి, హమ్జా అలీ మజారీ అనే రెండు విభిన్న పార్శ్యాలున్న పాత్రలో నటించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks