ప్రస్తుతం ప్రపంచం మరో యుద్ధం ముంగిట నిలుచుంది. అమెరికా-ఇరాన్ మధ్య రేగిన చిచ్చు మధ్యప్రాచ్యం (Middle East) అంతటా ఉద్రిక్తతలను పెంచింది. ఫిబ్రవరి 28న ఇరాన్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్యతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
ప్రతిచర్యగా దాడి

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్తలు ఈ ఘర్షణను మరింత తీవ్రం చేశాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై దాడులకు దిగడంతో గల్ఫ్ దేశాలన్నీ హై అలర్ట్‌లో ఉన్నాయి.
దుబాయ్‌లో చిక్కుకున్న టాలీవుడ్, బాలీవుడ్ తారలు
యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ నర్గిస్ ఫక్రీ, సోనాల్ చౌహాన్, ఈషా గుప్తా ప్రస్తుతం దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగి వచ్చే మార్గం కోసం వారు ఎదురుచూస్తున్నారు.
ప్రియాంక చోప్రా ఆశాభావం
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలపై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా స్పందించారు. ఇవాళ హోలికా దహనం (మార్చి 3) సందర్భంగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.
చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగు
"ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఇది చాలా కష్టమైన, భారమైన సమయం. కానీ, చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగు మనకు దారి చూపిస్తుంది. చెడుపై మంచి సాధించే విజయానికి ఇది ప్రతీక" అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. యుద్ధం ఆగిపోయి శాంతి చేకూరాలని ప్రియాంక ఆకాంక్షించారు.
రాజమౌళి సినిమాతో ప్రియాంక గ్రాండ్ ఎంట్రీ
ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'ది బ్లఫ్' (The Bluff) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది బ్లఫ్ ఓటీటీ రిలీజ్ అయి మంచి ప్రశంసలు అందుకుంటోంది. అయితే, భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఏమిటంటే.. ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మళ్లీ ఇండియన్ స్క్రీన్‌పై కనిపించడం.
రాజమౌళి దర్శకత్వంలో
దర్శక ధీర ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
{{/usCountry}}దర్శక ధీర ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
{{/usCountry}}తొలి భారతీయ చిత్రంగా
అంటార్కిటికా ఖండంలో షూటింగ్ జరుపుకోనున్న తొలి భారతీయ చిత్రంగా వారణాసి రికార్డు సృష్టించనుంది. ఏప్రిల్ 2027లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇవే కాకుండా హాలీవుడ్ కామెడీ చిత్రం 'జడ్జిమెంట్ డే'లో కూడా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు.