...
...
Next Story

OTT SciFi: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 5700 కోట్ల సైన్స్ ఫిక్షన్ హిట్- 8.2 రేటింగ్, 94 శాతం ఫ్రెష్ కంటెంట్- ఎక్కడంటే?

Project Hail Mary OTT Streaming: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రూ. 5700 కోట్లు రాబట్టిన సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ స్ట్రీమింగ్ కానుంది. 8.2 రేటింగ్ సాధించిన ఈ సినిమాకు 94 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా పేరు తెచ్చుకుంది. ఇలాంటి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 2, 2026, 11:34:35 IST
Advertisement

Project Hail Mary OTT Release: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ ఏడాది బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ హిట్ మూవీ'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (Project Hail Mary) ఎట్టకేలకు ఓటీటీ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన ఈ సినిమాకు 94 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా గుర్తింపు వచ్చింది.

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 5700 కోట్ల సైన్స్ ఫిక్షన్ హిట్- 8.2 రేటింగ్, 94 శాతం ఫ్రెష్ కంటెంట్- ఎక్కడంటే?
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 5700 కోట్ల సైన్స్ ఫిక్షన్ హిట్- 8.2 రేటింగ్, 94 శాతం ఫ్రెష్ కంటెంట్- ఎక్కడంటే?

హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ విజువల్ వండర్ థియేటర్లలో భారీ వసూళ్లు సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో మిస్ అయిన తెలుగు హాలీవుడ్ లవర్స్ కోసం ఈ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీ రిలీజ్ కానుంది.

కథేంటంటే?

భూమిని అంతరించిపోయే ప్రమాదం నుంచి రక్షించే బాధ్యతను ఒక సాధారణ సైన్స్ టీచర్ భుజానికెత్తుకుంటే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. రైలాండ్ గ్రేస్ (ర్యాన్ గోస్లింగ్) అనే సైన్స్ టీచర్ ఒక అంతరిక్ష నౌకలో కళ్లు తెరుస్తాడు. తనకు తాను ఎక్కడున్నాడో, అసలు అక్కడికి ఎలా వచ్చాడో అనే విషయాలు అతనికి గుర్తుండవు.

మెలమెల్లగా జ్ఞాపకాలు తిరిగి వచ్చే కొద్దీ.. సూర్యుడు అంతరించిపోవడానికి కారణమవుతున్న ఒక రహస్యమైన పదార్థం తాలూకు చిక్కుముడిని విప్పడమే తన మిషన్ అని గ్రేస్ తెలుసుకుంటాడు. తనకున్న సైన్స్ పరిజ్ఞానంతో, వినూత్నమైన ఆలోచనలతో భూమిని సర్వనాశనం కాకుండా కాపాడే క్రమంలో అతనికి ఒక వింత గ్రహాంతరవాసి (ఏలియన్) పరిచయమవుతుంది. ఆ అద్భుతమైన స్నేహంతో రైలాండ్ తన మిషన్‌ను ఎలా పూర్తి చేశాడనేదే అసలు కథ.

డైరెక్టర్ కామెంట్స్

ఈ ఏడాది మార్చి 20న థియేటర్లలో విడుదలైన ప్రాజెక్ట్ హెయిల్ మేరీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 683 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 5,700 కోట్లకు పైగా) వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.

ముఖ్యంగా ఐమాక్స్ (IMAX) స్క్రీన్లపై ఈ సినిమా అందించిన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచాయి. ఇందులో 'రాకీ' అనే ఏలియన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల రేసులో కూడా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని అమెజాన్ ఎమ్జీఎమ్ స్టూడియోస్ ధీమా వ్యక్తం చేస్తోంది.

హాలీవుడ్ అగ్ర దర్శకుల కాంబినేషన్

పేరుగాంచిన దర్శకుల ద్వయం ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ ఈ అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ డ్రామాను తెరకెక్కించారు. డ్రూ గొడ్దార్డ్ అందించిన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అమీ పాస్కల్, ర్యాన్ గోస్లింగ్, ఆదిత్య సూద్ వంటి ప్రముఖులు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు.

థియేటర్లలో సరికొత్త విజువల్ వండర్‌ను ఆస్వాదించిన సినీ ప్రియులు, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసేందుకు ఓటీటీలోకి వచ్చేస్తోంది ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. అమెజాన్ ప్రైమ్‌లో జూలై 3 నుంచి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

జూలై 3 అర్థరాత్రి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓటీటీ రిలీజ్ అవనుంది. అంటే, దానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానున్న ప్రాజెక్ట్ హెయిల్ మేరీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks