...
...
Next Story

ప్రముఖ హీరోయిన్‌కు ప్రాణహానీ- 10 కోట్లు ఇవ్వాలని గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు- ఆ సింగర్ తర్వాత ఇలా! వాలంటైన్స్ డే రోజునే!

పంజాబీ చిత్ర పరిశ్రమలో మరోసారి గ్యాంగ్‌స్టర్ల కలకలం రేగింది. ఈసారి పంజాబీ ప్రముఖ హీరోయిన్ హిమాన్షీ ఖురానాను టార్గెట్ చేశాడు ఓ గ్యాంగ్‌స్టర్. రూ. 10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని హిమాన్షీ ఖురానాను విదేశీ గ్యాంగ్‌స్టర్ బెదిరించాడు. దీంతో ఆమె మొహాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published on: Feb 15, 2026, 08:24:17 IST
Advertisement

పంజాబీ సినీ పరిశ్రమలో వరుసగా సెలబ్రిటీలకు వస్తున్న బెదిరింపులు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ హీరోయిన్, మోడల్ హిమాన్షీ ఖురానాకు విదేశాల్లో తలదాచుకుంటున్న ఒక గ్యాంగ్‌స్టర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సుమారు 10 కోట్ల రూపాయల ఇవ్వాలంటూ (ఎక్స్‌టార్షన్) సదరు గ్యాంగ్‌స్టర్ డిమాండ్ చేయడంతో హిమాన్షీ మొహాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈమెయిల్ ద్వారా వాయిస్ నోట్

ప్రముఖ హీరోయిన్‌కు ప్రాణహానీ- 10 కోట్లు ఇవ్వాలని గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు- ఆ సింగర్ తర్వాత ఇలా! వాలంటైన్స్ డే రోజునే!
ప్రముఖ హీరోయిన్‌కు ప్రాణహానీ- 10 కోట్లు ఇవ్వాలని గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు- ఆ సింగర్ తర్వాత ఇలా! వాలంటైన్స్ డే రోజునే!

హిమాన్షీ ఖురానా తన వ్యక్తిగత ఈమెయిల్ ఐడీకి వచ్చిన ఒక సందేశం గురించి పోలీసులకు వివరించారు. ఈ ఫిర్యాదుపై మొహాలీ ఇన్వెస్టిగేషన్ ఎస్పీ సౌరవ్ జిందాల్ స్పందించారు.

పది కోట్లు ఇవ్వాలని

"నటి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆమెకు వచ్చిన ఈమెయిల్‌లో ఒక వాయిస్ నోట్ ఉంది. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఒక గ్యాంగ్‌స్టర్ ఆ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. అందులో పది కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమెను బెదిరించారు" అని పేర్కొన్నారు.

పోలీసుల సత్వర చర్యలు

హిమాన్షీ ఖురానా ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శనివారం (ఫిబ్రవరి 14) సోహానా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 308(4) (దోపిడీ/వసూళ్లు), 351(3) (నేరపూరిత బెదిరింపులు) కింద కేసు ఫైల్ చేశారు.

వాలంటైన్స్ డే రోజునే

ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజునే వచ్చిన ఆ బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వాయిస్ నోట్ పంపిన గ్యాంగ్‌స్టర్ ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సైబర్ క్రైమ్ నిపుణుల సహాయంతో ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

పంజాబీ సెలబ్రిటీలే లక్ష్యంగా..

ఇప్పుడు హిమాన్షీ ఖురానాకు కూడా అదే తరహాలో చంపేస్తామని బెదిరింపులు రావడం గమనార్హం. కాగా, హిమాన్షీ ఖురానా 2013లో వచ్చిన 'సద్దా హక్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'నా నా నా..' వంటి సూపర్ హిట్ మ్యూజిక్ వీడియోల్లో నటించారు హిమాన్షీ ఖురానా.

బిగ్ బాస్ రియాలిటీ షోలో

అంతేకాకుండా ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 13లో కంటెస్టెంట్‌గా పాల్గొని దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు బ్యూటిఫుల్ హిమాన్షీ ఖురానా. మరోసారి గ్యాంగ్‌స్టర్ బెదిరింపులతో పంజాబీ సినీ ఇండస్ట్రీలో ఆందోళన కలుగుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe