...
...
Next Story

OTT Romantic: ఓటీటీలోకి నేరుగా తెలుగు అమ్మాయి రొమాంటిక్ కామెడీ మూవీ- ఇల్లరికం వచ్చే అల్లుడు- హీరోగా మారిన డైరెక్టర్!

Pyaar Prema Kalyanam OTT Streaming: దర్శకుడు ఇలన్ హీరోగా మారిన సరికొత్త రొమాంటిక్ కామెడీ మూవీ ప్యార్ ప్రేమ కల్యాణం ఓటీటీలోకి నేరుగా వచ్చేయనుంది. ఇల్లరికం వెళ్లే అల్లుడి కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమా ప్యార్ ప్రేమ కల్యాణం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 27, 2026, 21:31:00 IST
Advertisement

Pyaar Prema Kalyanam OTT Release: తమిళ చిత్రసీమలో వైవిధ్యమైన ప్రేమకథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇలన్.. ఇప్పుడు నటుడిగా సరికొత్త అవతారం ఎత్తారు. ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్యార్ ప్రేమా కల్యాణం ఓటీటీలోకి నేరుగా అడుగుపెడుతోంది.

యూత్‌ఫుల్ ఫీల్‌తో

ఓటీటీలోకి నేరుగా తెలుగు అమ్మాయి రొమాంటిక్ కామెడీ మూవీ- ఇల్లరికం వచ్చే అల్లుడు- హీరోగా మారిన డైరెక్టర్!
ఓటీటీలోకి నేరుగా తెలుగు అమ్మాయి రొమాంటిక్ కామెడీ మూవీ- ఇల్లరికం వచ్చే అల్లుడు- హీరోగా మారిన డైరెక్టర్!

2018లో హరీష్ కల్యాణ్, రైజా విల్సన్ జంటగా వచ్చిన 'ప్యార్ ప్రేమ కాదల్' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అదే తరహా యూత్‌ఫుల్ ఫీల్‌తో రూపుదిద్దుకున్న ఈ 'ప్యార్ ప్రేమా కల్యాణం' కథాంశం చాలా భిన్నంగా ఉండనుంది.

ఇల్లరికం అల్లుడి కథ

సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉన్న పవి అనే ఇన్‌ఫ్లూయెన్సర్ అమ్మాయి కథ ఇది. పెళ్లయిన తర్వాత అత్తారింటికి వెళ్లే పాత సాంప్రదాయాన్ని పక్కనపెట్టి, సొంత ఇంట్లోనే ఉంటానని ఆమె పట్టుబడుతుంది. భార్య నిర్ణయానికి కట్టుబడి భర్త (ఇలన్) ఆమె ఇంట్లోనే ఇల్లరికం అల్లుడిగా అడుగుపెడతాడు.

రెండు వేర్వేరు మనస్తత్వాల మధ్య

అత్తవారింట్లో అడుగుపెట్టిన అల్లుడికి ఎదురైన అనుభవాలు, రెండు వేర్వేరు మనస్తత్వాల మధ్య సాగే సంస్కృతుల ఘర్షణ, కుటుంబంలో వచ్చే గందరగోళం నవ్వుల పువ్వులు పూయిస్తాయి. పెళ్లి, దాంపత్య బంధాలపై సమాజం నిర్దేశించిన కట్టుబాట్లను ప్రశ్నిస్తూనే, హృదయానికి హత్తుకునే అంశాలతో ఈ చిత్రాన్ని మలిచారు.

తెలుగు హీరోయిన్ శాన్వి మేఘన

'పుష్పక విమానం', 'పిట్ట కథలు' చిత్రాలతో తెలుగు హీరోయిన్ శాన్వి మేఘన ఇందులో కథానాయికగా నటించింది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, స్టార్ కమెడియన్ యోగి బాబు, ఎంఎస్ భాస్కర్, గీతా కైలాసం, ఇళంగో కుమారవేల్, సెంథిల్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

యువన్ శంకర్ రాజా సంగీతం

"తమిళ సంస్కృతి, కుటుంబ విలువలతో పాటు నేటితరం ఆలోచనలను ప్రతిబింబించేలా ఈ కథను తెరకెక్కించాం. 'మేడ్ ఇన్ కొరియా' అందించిన ఉత్సాహంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని నిర్మించాం" అని నిర్మాత శ్రీనిధి సాగర్ తెలిపారు.

ప్యార్ ప్రేమ కల్యాణం ఓటీటీ స్ట్రీమింగ్

ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్యార్ ప్రేమ కల్యాణం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్ట్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో ప్యార్ ప్రేమ కల్యాణం ఓటీటీ రిలీజ్ అవనుంది. ఏదేమైనా, ఒకట్రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఓటీటీ వీక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'ప్యార్ ప్రేమా కల్యాణం' సినిమా ఏ ఓటీటీలో విడుదలవుతోంది?

ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా నేరుగా స్ట్రీమింగ్‌కు వస్తోంది.

2. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు?

ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఆగస్టు 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.

3. 'ప్యార్ ప్రేమా కల్యాణం' చిత్రంలో హీరో, హీరోయిన్లు ఎవరు?

దర్శకుడు ఇలన్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతుండగా, తెలుగు నటి శాన్వి మేఘన హీరోయిన్‌గా నటించింది.

4. ఈ సినిమాకు సంగీతం ఎవరు అందించారు?

ప్రసిద్ధ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe