...
...
Next Story

Social Media: ట్రోలింగ్ మాత్రమే కాదు, సోషల్ మీడియా పవర్ చూపించిన 4 రియల్ ఇన్సిడెంట్స్- పెద్ది నుంచి 370 బిర్యానీ వరకు!

Peddi To 370 Biryani That Social Media Effect Changes 4 Incidents: నెగిటివిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన సోషల్ మీడియా, గట్టిగా అనుకుంటే ఎంతటి మంచి మార్పునైనా తీసుకురాగలదని తాజాగా నిరూపితమైంది. పెద్ది నుంచి రూ. 370 బిర్యానీ వరకు డిజిటల్ మాధ్యమం సృష్టించిన నాలుగు అద్భుతమైన మార్పుల కథనం ఇది.

Published on: Jun 30, 2026, 13:44:55 IST
Advertisement

Peddi To 370 Biryani That Social Media Effect Changes 4 Incidents: సోషల్ మీడియా అనగానే చాలామందికి ట్రోలింగ్, నెగిటివిటీ, అనవసరపు వివాదాలే గుర్తొస్తాయి. కానీ, డిజిటల్ ప్రపంచాన్ని సరైన పద్ధతిలో, బాధ్యతాయుతంగా వాడుకుంటే సమాజంలో పవర్‌ఫుల్ మార్పులు తీసుకురావచ్చని నెటిజన్లు నిరూపిస్తున్నారు.

లైకులు, కామెంట్లకే పరిమితం కాకుండా

ట్రోలింగ్ మాత్రమే కాదు, సోషల్ మీడియా పవర్ చూపించిన 4 రియల్ ఇన్సిడెంట్స్- పెద్ది నుంచి 370 బిర్యానీ వరకు!
ట్రోలింగ్ మాత్రమే కాదు, సోషల్ మీడియా పవర్ చూపించిన 4 రియల్ ఇన్సిడెంట్స్- పెద్ది నుంచి 370 బిర్యానీ వరకు!

ఇవాళ (జూన్ 30) ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం. ఈ సందర్భంగా.. కేవలం లైకులు, కామెంట్లకే పరిమితం కాకుండా సినిమా కలెక్షన్లను మార్చడం నుంచి.. సెలబ్రిటీల తప్పులను సరిదిద్దేలా చేయడం వరకు భారతీయ పాప్ కల్చర్‌లో సోషల్ మీడియా పవర్ చూపించిన నాలుగు అద్భుతమైన సంఘటనలు ఇవే.

ఫ్లాప్ సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ పీఆర్

దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 'మై వాపస్ ఆవుంగా' సినిమా బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డు సృష్టించింది. థియేటర్లలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఓటీటీలోకి వచ్చాక 'మాస్టర్ పీస్' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సంస్కృతికి నెటిజన్లు ఈ సినిమాతో బ్రేక్ వేశారు.

మొదటి రోజు కేవలం రూ. 1.15 కోట్ల ఓపెనింగ్స్‌తో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. "ఈ సినిమాను థియేటర్లలోనే చూడండి" అంటూ నెటిజన్లు చేసిన క్యాంపెయిన్ వల్ల రెండో శుక్రవారం రూ. 1.90 కోట్లు, మూడో శుక్రవారం ఏకంగా రూ. 2.85 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మౌత్ టాక్ పవర్‌తో ఈ చిత్రం ఇండియాలో ఏకంగా రూ. 47 కోట్లకు పైగా వసూలు చేసి అద్భుతమైన యూ-టర్న్ తీసుకుంది.

మహిళల అశ్లీల చిత్రణపై తిరగబడ్డ నెటిజన్లు

సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయినప్పటికీ, నెటిజన్ల నుంచి వచ్చిన ఒత్తిడికి దర్శకుడు బుచ్చిబాబు సాన బహిరంగ క్షమాపణ చెప్పక తప్పలేదు. అంతటితో ఆగకుండా, అప్పటికే థియేటర్లలో రన్ అవుతున్న సినిమా నుంచి కొన్ని సీన్లను ఎడిట్ చేశారు. జూన్ 17 నుంచి మూడు కొత్త సీన్లతో కూడిన ఆరు నిమిషాల అదనపు ఫుటేజ్‌ను జోడించి, అచ్చియమ్మ పాత్రకు గౌరవం తెచ్చేలా కొత్త వెర్షన్‌ను ప్రదర్శించారు.

'రూ. 370 బిర్యానీ' రచ్చ.. ఉద్యోగం ఊడింది!

ఇటీవల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కుదిపేసిన వివాదం 'రూ. 370 బిర్యానీ' వివాదం. స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో హిమాన్షు జంగ్రా అనే ప్రేక్షకుడు మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. డేటింగ్‌కు వెళ్లినప్పుడు అమ్మాయి కోసం రూ. 370 ఖర్చు పెట్టి బిర్యానీ కొనిపించానని, దానికి ప్రతిఫలంగా ఆమె తనతో శారీరకంగా లొంగిపోవాలని ఆశించానంటూ అతను అసభ్యంగా మాట్లాడాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (NCW) స్పందించి ఇద్దరికీ సమన్లు జారీ చేసింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో కమెడియన్, ఆ ప్రేక్షకుడు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా, మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు హిమాన్షు జంగ్రా తన ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది.

బూతు పాటలకు నెటిజన్ల బ్రేక్

ఈ ఏడాది ఇద్దరు పెద్ద స్టార్ల పాటల్లోని అసభ్యకరమైన సాహిత్యంపై సోషల్ మీడియాలో గట్టి నిరసన వ్యక్తమైంది. మొదట ర్యాపర్ బాద్‌షా పాడిన 'తతీరీ' పాటలోని సాహిత్యంపై నెటిజన్లు మండిపడ్డారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో అతనిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది.

దాంతో బాద్‌షా బహిరంగ క్షమాపణలు చెప్పి, అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆ పాటను తొలగించి కొత్త వెర్షన్‌ను విడుదల చేశాడు. అంతేకాకుండా, పేద కుటుంబాలకు చెందిన 50 మంది బాలికల విద్యకు స్పాన్సర్ చేస్తానని అతని లీగల్ టీమ్ ప్రకటించింది.

యూట్యూబ్ నుంచి అవుట్

ఆ వెంటనే కన్నడ చిత్రం 'కేడీ: ది డెవిల్' హిందీ వెర్షన్ పాట 'సర్కే చునార్ తేరి సర్కే' లోని డబుల్ మీనింగ్ లిరిక్స్‌పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ పాటలో నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. "ఆ హిందీ లిరిక్స్ గురించి నాకు తెలియదు, నా అనుమతి లేకుండానే వాటిని చేర్చారు" అని నోరా స్పష్టం చేసింది. అనంతరం ఆ పాటను యూట్యూబ్ నుంచి పూర్తిగా తొలగించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe