Upasana Konidela Celebrates Ram Charan Peddi Success: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరెకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. భారీ అంచనాల మధ్య జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన పెద్ది బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది.
పెద్ది రివ్యూలు అలా

నెగెటివ్ అండ్ పాజిటివ్‌లతో మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా రామ్ చరణ్ స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'పెద్ది' చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.
అభిమానుల మధ్య మెగా కోడలి సందడి
సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించిన నేపథ్యంలో, రామ్ చరణ్ భార్య, ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల అభిమానులతో కలిసి ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గులాబీ రంగు కుర్తాలో
ఈ వీడియోలో ఉపాసన చాలా సింపుల్‌గా గులాబీ రంగు కుర్తాలో కనిపిస్తూ, అభిమానుల కోలాహలం మధ్య ఒక భారీ కేక్‌ను కట్ చేశారు. ఆ కేక్ పై 'పెద్ది బ్లాక్‌బస్టర్' (Peddi Blockbuster) అనే పోస్టర్‌తో పాటు, ఐదు నక్షత్రాలు (5 Stars) ఉన్నాయి. ఇది సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌కు నిదర్శనంగా నిలిచింది.
కేక్ కట్ చేసిన అనంతరం, ఉపాసన అక్కడ ఉన్న అభిమానులతో ముచ్చటించారు. అక్కడికి వచ్చిన చిన్న పిల్లలకు ఉపాసన కొణిదెల స్వయంగా కేక్ తినిపించారు. ఈ క్రమంలో అభిమానులు భారీగా బాణసంచా కాలుస్తూ, ఈలలు, గోలలతో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఉపాసన చొరవను మెగా అభిమానులు నెట్టింట తెగ పొగిడేస్తున్నారు.
థియేటర్‌లో పేపర్లు చల్లిన ఉపాసన
ఉపాసన 'పెద్ది' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు రోజు, హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో అభిమానులతో కలిసి ఉపాసన సినిమా చూశారు. ఆ సమయంలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, ఇతర మాస్ సీన్స్‌కు అభిమానులు థియేటర్‌లో కాగితాలు చల్లుతూ రచ్చ చేశారు.
{{/usCountry}}ఉపాసన 'పెద్ది' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు రోజు, హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో అభిమానులతో కలిసి ఉపాసన సినిమా చూశారు. ఆ సమయంలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, ఇతర మాస్ సీన్స్‌కు అభిమానులు థియేటర్‌లో కాగితాలు చల్లుతూ రచ్చ చేశారు.
{{/usCountry}}ఉపాసన కూడా వారితో కలిసి ఉత్సాహంగా ఈలలు వేస్తూ, కింద పడిన కాగితాలను చేతిలోకి తీసుకుని పైకి చల్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. భర్త సినిమా విజయాన్ని అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మెగా అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.
'పెద్ది' బాక్సాఫీస్ లెక్కలివే!
కలెక్షన్ల విషయానికి వస్తే, 'పెద్ది' చిత్రం ఈ ఏడాదిలోనే అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ చిత్రం కేవలం భారతదేశంలోనే తొలిరోజు రూ.69 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో కూడా చరణ్ మేనియా స్పష్టంగా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చూస్తే, తొలిరోజే పెద్ది సినిమా సుమారు రూ.112.49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబ్టటినట్లు సమాచారం.
సినిమా గురించి..
బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ విజయనగరం జిల్లాకు చెందిన ఆట కూలీగా కనిపించాడు. నిర్లక్ష్యానికి గురైన తన గ్రామానికి క్రికెట్ ద్వారా గుర్తింపు, గౌరవం తీసుకురావాలనే లక్ష్యంతో సాగే ఒక యువకుడి కథ ఇది.
పెద్ది చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమర్పించాయి.