Ranabaali Movie Review And Rating In Telugu: టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాలతో విజయ్, రష్మిక అలరించారు. అలాంటి ఈ జంట పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి సినిమా రణబాలి.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా

‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల తర్వాత డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన సినిమానే ఈ రణబాలి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. విజయ్-రష్మిక, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంతో రణబాలిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అలాంటి రణబాలి సినిమా ఇవాళ (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలైంది. బ్రిటిష్ పాలనా కాలంలో సాగే కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో నేటి రణబాలి రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
1876–1878 మధ్యకాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో సంభవించిన భయంకరమైన కరువు, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ ధాన్యపు ఎగుమతి విధానాలు భారతీయ సమాజాన్ని ఎలా దెబ్బతీశాయనే నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) తను పుట్టిన నేలను, గ్రామీణ ప్రజలను బ్రిటిష్ కమిషనర్ సర్ థియోడోర్ హెక్టర్ (ఆర్నాల్డ్ వోస్లూ) అరాచకాల నుంచి కాపాడటానికి పోరాటం ప్రారంభిస్తాడు. భద్ర మల్లన్న దేవత ఆశీస్సులతో, ధాన్యం ఎగుమతులను అడ్డుకుంటూ రణబాలి చేసిన సాయుధ పోరాటమే ఈ సినిమా ముఖ్య కథాంశం.
విశ్లేషణ: ప్లస్, మైనస్లు
దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఎంచుకున్న 1876 కరువు నేపథ్యం, బ్రిటిష్ వారి దోపిడీ విధానాల కాన్సెప్ట్ బాగుంది. సినిమా మొదటి భాగం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. విజయ్-రష్మిక మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్, రెండో భాగం ప్రారంభంలో వచ్చే కేవ్ (గుహ)లోని ఫైట్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయి.
{{/usCountry}}దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఎంచుకున్న 1876 కరువు నేపథ్యం, బ్రిటిష్ వారి దోపిడీ విధానాల కాన్సెప్ట్ బాగుంది. సినిమా మొదటి భాగం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. విజయ్-రష్మిక మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్, రెండో భాగం ప్రారంభంలో వచ్చే కేవ్ (గుహ)లోని ఫైట్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయి.
{{/usCountry}}అయితే గుహ ఫైట్ పూర్తయిన తర్వాత కథనంలో వేగం తగ్గుతుంది. రొటీన్, ఊహించదగ్గ సీన్లతో సెకండాఫ్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ చివరిలో 'కొబలి' పేరుతో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే, కొన్ని చోట్ల మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్ర ఛాయలు కనిపిస్తాయి. స్క్రీన్ ప్లేలో ఇంకాస్త బలం ఉండి ఉంటే 'రణబాలి' రేంజ్ మరోలా ఉండేది.
నటీనటుల ప్రదర్శన
రౌడీ హీరో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో ఒదిగిపోయాడు. కడప యాసను చాలా చక్కగా పలికారు. రష్మిక మందన్నాతో వచ్చే సన్నివేశాలలో ఆయన నటన ఎంతో సహజంగా ఉంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలలో, యాక్షన్ సీన్లలో విజయ్ మెప్పించాడు.
ఇక జయమ్మ పాత్రలో రష్మిక మందన్నా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతి ఎక్స్ప్రెషన్ని ఎంతో పరిణతితో పండించారు. 'ది మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ బ్రిటిష్ కమిషనర్గా తనదైన శైలిలో భయంకరమైన విలనిజాన్ని ప్రదర్శించారు. ఆయన హావాభావాలు, కోపం భయపెడతాయి. ఈశ్వరీ రావు తల్లి పాత్రలో తన అనుభవాన్ని చూపించగా, వినోద్ సాగర్ ఇతర నటీనటులు తమ పరిధి మేర మెప్పించారు.
సాంకేతిక బలం
బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. "ఎందయ్యా సామీ" పాట వినసొంపుగా ఉండి, వెండితెరపై కంటికి హాయిగా అనిపిస్తుంది. జిష్ణు భట్టాచార్జీ, నిరవ్ షా అందించిన సినిమాటోగ్రాఫీ అదిరిపోయింది. పీరియడ్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు.
గుహలో జరిగే ఫైట్ సీన్లో కెమెరా పనితనం మెప్పిస్తుంది. అయితే రెండో భాగంలో ఎడిటింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. దాదాపు 15 నిమిషాల నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. మద్రాస్ పోర్ట్ సన్నివేశాలలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నాణ్యత తగ్గింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా రిచ్గా ఉన్నాయి.
తీర్పు
మొత్తంగా చూస్తే, పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో 'రణబాలి' మంచి ప్రయత్నం. ఆకట్టుకునే ఫస్టాఫ్, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్. కానీ రెండో భాగంలో స్లో నెరేషన్, ఊహించగలిగే సీన్లు కొంతమేర ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే వారు రణబాలిని ఎంచక్కా చూసేయొచ్చు.