...
...
Next Story

ఏకంగా 25 ఎకరాల ల్యాండ్ కొన్న యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్- స్టాంప్ డ్యూటీనే 82 లక్షలు- భూమి విలువ ఎన్ని కోట్లు అంటే?

Ranbir Kapoor Buys 25 Acre Land: యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ మహారాష్ట్రలోని పుణె సమీపంలో సుమారు 25 ఎకరాల వ్యవసాయేతర స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ భారీ ల్యాండ్ డీల్‌కు సంబంధించి రూ. 82 లక్షలు స్టాంప్ డ్యూటీకే చెల్లించినట్లు అధికారిక రిజిస్ట్రేషన్ పత్రాల వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Published on: Jul 14, 2026, 11:27:04 IST
Advertisement

Ranbir Kapoor Buys 25 Acre Land: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కేవలం సినిమాలతోనే కాకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ దూసుకుపోతున్నారు. ముంబై వంటి కాంక్రీట్ జంగిల్ దాటి ప్రశాంతమైన వాతావరణంలో లగ్జరీ ఫామ్‌హౌస్‌లు, ఖరీదైన ల్యాండ్స్ కొనుగోలు చేసేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు.

25.7 ఎకరాల భూమి కొనుగోలు

ఏకంగా 25 ఎకరాల ల్యాండ్ కొన్న యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్- స్టాంప్ డ్యూటీనే 82 లక్షలు- భూమి విలువ ఎన్ని కోట్లు అంటే?
ఏకంగా 25 ఎకరాల ల్యాండ్ కొన్న యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్- స్టాంప్ డ్యూటీనే 82 లక్షలు- భూమి విలువ ఎన్ని కోట్లు అంటే?

ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ యానిమల్ హీరో రణ్‌బీర్ తాజాగా పుణెలో ఒక భారీ స్థలాన్ని తన సొంతం చేసుకున్నారు. పుణె జిల్లా ముల్షీ తాలూకా పరిధిలో దాదాపు 25.7 ఎకరాల విస్తీర్ణం గల భూమిని రణ్‌బీర్ కపూర్ కొనుగోలు చేశారు.

రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన అధికారిక పత్రాల ప్రకారం ఈ లావాదేవీ విలువ రూ. 16.42 కోట్లుగా నమోదైంది. పుణెలోని పింప్రి గ్రామంలో పక్కపక్కనే ఉన్న నాలుగు ల్యాండ్ పార్సళ్లను రణ్‌బీర్ కొనుగోలు చేయగా, వీటికి సంబంధించిన విక్రయ ఒప్పందం (Sale Agreement) ఈ ఏడాది ఏప్రిల్ 30న రిజిస్టర్ అయింది.

నాలుగు భాగాలుగా కొనుగోలు.. స్టాంప్ డ్యూటీ ఎంతంటే?

మొత్తం 1,04,000 చదరపు మీటర్ల (సుమారు 25.7 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని రణ్‌బీర్ కపూర్ నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయించుకున్నారు.

మొదటి భాగం (21,400 చ.మీ) రూ. 3.31 కోట్లకు కొనుగోలు చేశారు.

రెండో భాగం (29,900 చ.మీ) రూ. 4.62 కోట్లకు సొంతం చేసుకున్నారు.

మూడో భాగం (43,800 చ.మీ) రూ. 7.07 కోట్ల భారీ ధరకు కొన్నారు.

ఈ భారీ ల్యాండ్ డీల్ కోసం రణ్‌బీర్ కపూర్ ప్రభుత్వానికి రూ. 82.13 లక్షల రూపాయలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి.

అయోధ్యలోనూ కోట్ల విలువైన స్థలం

రణ్‌బీర్ కపూర్ కేవలం పుణెలోనే కాకుండా దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అయోధ్యలోనూ పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది మే నెలలోనే 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ది సరయు' ప్రాజెక్టులో రూ. 3.31 కోట్ల విలువైన స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు.

సరయు నదీ తీరంలో 75 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ లగ్జరీ వెంచర్‌లో 2,134 చదరపు అడుగుల ప్లాట్‌ను రణ్‌బీర్ సొంతం చేసుకున్నారు. పంచతార వెజిటేరియన్ హోటల్, అత్యాధునిక క్లబ్‌హౌస్‌తో పాటు ఎన్నో విలాసవంతమైన సదుపాయాలు ఈ ప్రాజెక్టులో రానున్నాయి.

ముంబై వదిలి బయటి ప్రాంతాలపై సెలబ్రిటీల కన్ను

ముంబై నగరంలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్, కాలుష్యం కారణంగా బాలీవుడ్ స్టార్స్ తమ పెట్టుబడులను పక్క రాష్ట్రాలు లేదా ముంబై వెలుపల ఉన్న ప్రశాంతమైన హిల్ స్టేషన్లకు మళ్లిస్తున్నారు. కేవలం ఫ్లాట్స్, కమర్షియల్ బిల్డింగ్స్ కాకుండా వ్యవసాయ భూములు, ప్లాట్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. ముంబైకి వీకెండ్ గేట్‌వేలుగా ఉన్న అలీబాగ్, లోనావాలా, పుణె, గోవా వంటి ప్రాంతాల్లో ల్యాండ్స్ కొనుగోలు చేస్తున్నారు.

ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్, కృతి సనన్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ల్యాండ్స్ కొనుగోలు చేశారు. ఇటీవల టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన మామ, సీనియర్ నటుడు సునీల్ శెట్టి కలిసి ముంబై సమీపంలో రూ. 9.85 కోట్ల విలువైన స్థలాన్ని కొనుగోలు చేయడం ఈ రియల్ ఎస్టేట్ క్రేజ్‌కు అద్దం పడుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe