...
...
Next Story

Randeep Hooda: షూటింగ్ నుంచి అయ్యే లీకులన్నీ కావాలని చేసేవే- హీరో రణదీప్ హుడా కామెంట్స్- మరోలా బాధపడిన ఓటీటీ డైరెక్టర్

Randeep Hooda On Shooting Set Leaks: సినిమా సెట్స్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ కావడం వెనుక పెద్ద 'పీఆర్' స్టంట్ ఉందంటూ హీరో రణదీప్ హుడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఓటీటీ సిరీస్ ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ షాకింగ్ విషయాలను పంచుకున్నారు.

Published on: May 14, 2026, 14:50:43 IST
Advertisement

Randeep Hooda On Shooting Set Leaks: ఒక సినిమాను తెరకెక్కించడానికి దర్శకులు, నిర్మాతలు ఏళ్ల తరబడి కష్టపడతారు. నటీనటుల లుక్స్ నుంచి లొకేషన్ల వరకు ప్రతిదీ రహస్యంగా ఉంచాలని భావిస్తారు. కానీ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే సెట్స్ నుంచి ఫోటోలు బయటకు వచ్చేస్తున్నాయి.

ఓటీటీ సిరీస్‌కు కూడా

షూటింగ్ నుంచి అయ్యే లీకులన్నీ కావాలని చేసేవే- హీరో రణదీప్ హుడా కామెంట్స్- మరోలా బాధపడిన ఓటీటీ డైరెక్టర్
షూటింగ్ నుంచి అయ్యే లీకులన్నీ కావాలని చేసేవే- హీరో రణదీప్ హుడా కామెంట్స్- మరోలా బాధపడిన ఓటీటీ డైరెక్టర్

రణ్‌బీర్ కపూర్ 'రామాయణ' నుంచి షారుఖ్ ఖాన్ 'కింగ్' వరకు దాదాపు అన్ని భారీ ప్రాజెక్ట్ సినిమాలు ఈ లీకుల బెడదను ఎదుర్కొన్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో రణదీప్ హుడా నటించిన ఓటీటీ సిరీస్'ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2' కూడా ఇదే సమస్యను చవిచూసింది.

అయితే, ఈ లీకులపై రణదీప్ హుడా స్పందిస్తూ విభిన్నమైన వాదనను వినిపించారు. "షూటింగ్ సెట్స్ నుంచి సీన్లు లీక్ అవడం చాలా విషాదకరం. కానీ వాటిలో లీకులన్నీ ప్రమాదవశాత్తు జరుగుతాయని నేను అనుకోను. వీటిలో చాలా వరకు కావాలని చేసేవే. ఇదొక గొప్ప పీఆర్ (PR) ఎత్తుగడ అని నా అనుమానం" అని రణదీప్ హుడా పేర్కొన్నారు.

దర్శకుడి ఆవేదన.. సృజనాత్మకతకు గొడ్డలిపెట్టు

సినిమాపై హైప్ పెంచడానికి లేదా వార్తల్లో నిలవడానికి చిత్ర బృందాలే కొన్నిసార్లు ఇలాంటి పనులు చేస్తాయని రణదీప్ హుడా అభిప్రాయపడ్డారు. రణదీప్ వ్యాఖ్యలు అలా ఉంటే, ఈ ఓటీటీ సిరీస్ దర్శకుడు నీరజ్ పాఠక్ మాత్రం మరోలా స్పందించారు. తన లాంటి క్రియేటర్లకు లీకులు అనేవి ఒక శాపం లాంటివని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటీటీ డైరెక్టర్ నీరజ్

రణదీప్ హుడా గతంలో 'స్వాతంత్ర్య వీర సావర్కర్' కోసం తన శరీరాకృతిని ఎంతగా మార్చుకున్నారో అందరికీ తెలిసిందే. అలాగే ఈ ప్రాజెక్టు కోసం కూడా ఆయన ఎంతో శ్రమించారు. ఇలాంటి కష్టాన్ని ఒక చిన్న లీక్ వీడియో పాడుచేయడం నిజంగా దురదృష్టకరమని దర్శకుడు పేర్కొన్నారు. ఈ లీకుల వెనుక కొందరు వ్యక్తులు డబ్బు సంపాదిస్తున్నారని, ఇది మేకర్స్‌కి పెద్ద సవాల్‌గా మారిందని ఆయన వెల్లడించారు.

తమిళ, తెలుగు పరిశ్రమలోనూ ఇదే పరిస్థితి

కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్‌లోనూ ఈ బెడద తీవ్రంగా ఉంది. రాజమౌళి లాంటి దర్శకులు సెట్స్‌లోకి మొబైల్ ఫోన్లు కూడా అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ, ఏదో ఒక రూపంలో లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇటీవల 'పుష్ప 2', 'గేమ్ ఛేంజర్' వంటి సినిమాలకు సంబంధించిన సీన్లు లీక్ కావడం ఫ్యాన్స్‌ను సైతం నిరాశకు గురిచేసింది.

మరింత పవర్‌ఫుల్‌గా 'ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2'

మొదటి సీజన్ ఘనవిజయం సాధించిన మూడేళ్ల తర్వాత, ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2 ఓటీటీ సిరీస్ మరింత డార్క్ కథాంశంతో వస్తోంది. 1990ల నాటి ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో, గ్యాంగ్‌స్టర్లు, అక్రమ ఆయుధ వ్యాపారుల వేటలో సూపర్ కాప్ అవినాష్ మిశ్రా సాహసాలను ఈ వెబ్ సిరీస్‌లో చూడొచ్చు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

రెండో సీజన్‌లో అవినాష్ కుమారుడు ఒక హత్య కేసులో చిక్కుకోవడం, దాని వల్ల వ్యవస్థే అతడిని మోసం చేయడం వంటి ఉత్కంఠభరిత అంశాలు ఉన్నాయి. రణదీప్ హుడాతో పాటు ఊర్వశి రౌటేలా, అమిత్ సియాల్, అభీమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మే 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks