Rayavalasa Ringudu Ringudu Song Trending On YouTube: తెలుగు చిత్రసీమలో గ్రామీణ నేపథ్యంలో వచ్చే వాస్తవిక కథలకు ఈమధ్య ఆదరణ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై ప్రతిభావంతులు తెరకెక్కించిన చిత్రం ‘రాయవలస’.
యూట్యూబ్లో చార్ట్ బస్టర్గా సాంగ్

రేసన్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీ కృష్ణ జె నిర్మాణంలో, ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి రాయవలస సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, రాయవలస సినిమా.. ప్రమోషన్ల విషయంలో రచ్చ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ‘రింగుడు రింగుడు’ పాట యూట్యూబ్లో చార్ట్ బస్టర్గా నిలిచి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఆకట్టుకుంటున్న 'రింగుడు రింగుడు' జానపద బాణీ
అర్జున్ బాల అందించిన స్వరాలు, జానపద శైలిలో సాగే సాహిత్యం 'రింగుడు రింగుడు' పాటకు ప్రాణం పోశాయి. పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ రాసిన ఈ పాటను ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తీక్ జయంతి ఎంతో ఉత్సాహంగా ఆలపించారు.
అమెరికా నుంచి టాలీవుడ్కు.. కొత్త ప్రతిభకు పెద్దపీట
ఈ పాటను రాసి పాడిన వాళ్లలో హీరో కార్తీక్ జయంతి కూడా ఒకరు. రింగుడు రింగుడు పాట విడుదలైన కొద్ది సమయానికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ రాయలవస చిత్రం ద్వారా కార్తీక్ జయంతి హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. డైరెక్టర్ రాధిక జయంతి కుమారుడే హీరో కార్తీక్ జయంతి.
రేసన్ రికార్డ్స్ పేరుతో మ్యూజిక్ ఛానెల్
అమెరికా నుంచి వచ్చి టాలీవుడ్లో సొంతంగా నిలదొక్కుకోవడంతో పాటు సంగీతాన్ని, నూతన కళాకారులను ప్రోత్సహించేందుకు 'రేసన్ రికార్డ్స్' పేరుతో సొంత మ్యూజిక్ ఛానల్ను కూడా ప్రారంభించారు వీరు. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి చేతుల మీదుగా ఈ ఛానల్ ప్రారంభమైంది.
{{/usCountry}}అమెరికా నుంచి వచ్చి టాలీవుడ్లో సొంతంగా నిలదొక్కుకోవడంతో పాటు సంగీతాన్ని, నూతన కళాకారులను ప్రోత్సహించేందుకు 'రేసన్ రికార్డ్స్' పేరుతో సొంత మ్యూజిక్ ఛానల్ను కూడా ప్రారంభించారు వీరు. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి చేతుల మీదుగా ఈ ఛానల్ ప్రారంభమైంది.
{{/usCountry}}రాణి పాత్రలో హీరోయిన్ శ్రీషా
గ్రామీణ జీవితం, యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన రాయవలస చిత్రాన్ని నటీనటులు, సాంకేతిక నిపుణుల అంకితభావంతో ఒకే ఒక్క షెడ్యూల్లో పూర్తి చేయడం విశేషం. అలాగే, రాయవలస సినిమాలో హీరోయిన్ శ్రీషా నులు 'రాణి' అనే కీలక పాత్ర పోషించారు.
సహజసిద్ధమైన నటనతో
"తెరపై ఈ పాత్ర ఇచ్చే అనుభూతి ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది" రాణి పాత్ర గురించి గొప్పగా తెలిపింది రాయవలస సినిమా యూనిట్. శ్రీషా తన సహజ సిద్ధమైన నటనతో రాణి పాత్రకు జీవం పోశారని చెప్పుకొచ్చారు.
ఇతర నటీనటులు
అలాగే, సీనియర్ నటీనటులు అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధరావు, కంచరపాలెం రాజు వంటి దిగ్గజాలు ఇందులో కీలక పాత్రల్లో మెరవనున్నారు. వి.ఆర్.కె. నాయుడు (కిట్టు) కెమెరా పనితనం, గ్యారీ బి.హెచ్. ఎడిటింగ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
త్వరలోనే థియేటర్లలో విడుదల
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ రాయవలస సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే రాయవలస సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.