...
...
Next Story

Samuthirakani: రికార్డ్ చేస్తున్నారని తెలిసే మాట్లాడాను, అందులో ఏ పశ్చాత్తాపం లేదు- విజయ్, త్రిష వ్యవహారంపై సముద్రఖని

Samuthirakani About Vijay Trisha Video: స్టార్ హీరో, దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం, త్రిషతో కలిసి బహిరంగంగా కనిపించడంపై తాను చేసిన విమర్శలను నటుడు, దర్శకుడు సముద్రఖని సమర్థించుకున్నారు. తన ఆవేదననే వ్యక్తపరిచానని, అందులో తాను తప్పుగా ప్రవర్తించలేదని సముద్రఖని స్పష్టం చేశారు.

Published on: Mar 27, 2026 01:23 PM IST
Advertisement

ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని తన తాజా చిత్రం 'కార్మేని సెల్వం' ప్రమోషన్ల కోసం ఇటీవల హైదరాబాద్ విచ్చేశారు. మార్చి 26న కార్మేని సెల్వం ట్రైలర్ రిలీజ్ చేస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్మేని సెల్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సముద్ర ఖని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

త్రిషతో విజయ్ కలిసి

రికార్డ్ చేస్తున్నారని తెలిసే మాట్లాడాను, అందులో ఏ పశ్చాత్తాం లేదు- విజయ్, త్రిష వ్యవహారంపై సముద్రఖని
రికార్డ్ చేస్తున్నారని తెలిసే మాట్లాడాను, అందులో ఏ పశ్చాత్తాం లేదు- విజయ్, త్రిష వ్యవహారంపై సముద్రఖని

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, హీరోయిన్ త్రిషతో కలిసి ఒక వివాహ వేడుకలో కనిపించడంపై సముద్రఖని గతంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, దీనిపై హైదరాబాద్ ప్రెస్ మీట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సముద్ర ఖని సూటిగా సమాధానమిచ్చారు.

"నా బాధనే పంచుకున్నాను"

విజయ్‌ను విమర్శిస్తూ వైరల్ అయిన ఆ వీడియో గురించి అడగగా, సముద్రఖని ఏమాత్రం తడబడకుండా స్పందించారు. "అవును, నా మనసులోని బాధను పంచుకున్నాను. ఆ సమయంలో నా మనసులోకి ఏది వస్తే అది మాట్లాడాను" అని సముద్రఖని తెలిపారు.

"ఆ మాటలు రికార్డ్ అవుతున్నాయని నాకు తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ వ్యక్తి నేను సంభాషణ మొదట్లో అన్న మాటలను రికార్డ్ చేయలేదు, కేవలం చివర్లో అన్నవి మాత్రమే రికార్డ్ చేశారు. రికార్డ్ చేస్తున్నారని తెలిసినంత మాత్రాన నా మనసులోని మాటను ఆపే వ్యక్తిని కాదు. నేను చెప్పాలనుకున్నది చెప్పేశాక, ఆ వ్యక్తితో 'వీడియో తీశావుగా.. ఇప్పుడు సంతోషమేనా?' అని కూడా అడిగాను" అని సముద్రఖని వివరించారు.

నా ఆవేదనే చెప్పుకున్నా

గత ఫిబ్రవరిలో విజయ్ భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు వార్తలు వచ్చాయి. విజయ్ ఓ హీరోయిన్‌తో సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మార్చి 5న చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు విజయ్, త్రిష ఇద్దరూ ఒకే రకమైన దుస్తులు (Twinning) ధరించి హాజరయ్యారు. దీనిపై అప్పట్లో సముద్రఖనితో పాటు ఆర్. పార్థిబన్ వంటి వారు కూడా విమర్శలు గుప్పించారు.

ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు

"ఇన్ని జరుగుతున్నప్పుడు వాటిని నాలుగు గోడల మధ్య ఉంచుకోవాలి కదా? బయటకు ఎందుకు తీసుకురావడం? ఆయన ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు?" అంటూ సముద్రఖని ఆ వీడియోలో ప్రశ్నించారు.

ఎలాంటి పశ్చాత్తాపం లేదు

తన మాటల పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తాను బాధపడేలా ఏమీ మాట్లాడలేదని సముద్రఖని స్పష్టం చేశారు. కాగా, సముద్రఖని నటించిన 'కార్మేని సెల్వం' ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe