2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చేసిన తెలుగు ఎమోషనల్ రొమాంటిక్ కామెడీ- స్పెర్మ్ కౌంట్ సమస్యపై మూవీ- 8.1 రేటింగ్- ఎక్కడ చూడాలంటే?
రెండు ఓటీటీలోకి ఇవాళ తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ కామెడీ డ్రామా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ సినిమాలో పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండే సమస్యపై తెరకెక్కించారు. మరి సంతాన ప్రాప్తిరస్తు ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలైన సమయంలో చర్చకు దారితీసిన తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ కామెడీ డ్రామా ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రావడం విశేషం.

సున్నితమైన అంశం చుట్టూ
సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు సినిమాల్లో సాధారణంగా చర్చకు రాని ‘పురుషుల వంధ్యత్వం’ (Male Infertility) లేదా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం వంటి అతి సున్నితమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
అసలు కథేంటి?
హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో చైతన్య (విక్రాంత్) ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కొంచెం సిగ్గు, మొహమాటస్తుడైన చైతన్య జీవితంలోకి కల్యాణి (చాందిని చౌదరి) ప్రవేశిస్తుంది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది.
కల్యాణి తండ్రి నుంచి కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ చివరకు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే, చైతన్యకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందనే విషయం తెలిసిన తర్వాత కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
ఎమోషన్స్, సోషల్ రియాక్షన్స్
ఈ సినిమా కేవలం మెలో డ్రామాగా సాగకుండా సమాజం ఇలాంటి సమస్యలను ఎలా చూస్తుంది? వ్యక్తిగత అభద్రతాభావాలు ఎలా ఉంటాయి? అంచనాల వల్ల వచ్చే ఒత్తిడి ఏంటి? అనే అంశాలను వాస్తవిక దృక్పథంతో చూపించే ప్రయత్నం చేశారు.
ఎక్కడ చూడవచ్చు?
ప్రస్తుతం సంతాన ప్రాప్తిరస్తు మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)తో పాటు జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే, ఇవాళ (డిసెంబర్ 19) సంతాన ప్రాప్తిరస్తు రెండింట్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
“సంతాన ప్రాప్తిరస్తు అనేది భావోద్వేగాలు, హాస్యం, ఆశల కలయికతో సాగే ఒక హృద్యమైన ఫ్యామిలీ కామెడీ. అస్సలు ఊహించని రీతిలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని జియో హాట్‌స్టార్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
ఒక సున్నితమైన విషయాన్ని కుటుంబ సమేతంగా చూసేలా మలిచిన తీరుపై మూవీకి ప్రశంసలు వచ్చాయి. ఐఎమ్‌డీబీలో పదికి 8.1 రేటింగ్ సాధించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు.
కాగా, సంతాన ప్రాప్తిరస్తు మూవీలో విక్రాంత్, చాందిని చౌదరితోపాటు డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు.
సంతాన ప్రాప్తిరస్తు ఓటీటీ రిలీజ్
సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించినప్పటికీ ఒక సున్నితమైన సామాజిక అంశాన్ని కమర్షియల్ ఫార్మాట్‌లో ధైర్యంగా చెప్పినందుకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు ఓటీటీ రిలీజ్ కావడంతో మరింత మంది ప్రేక్షకులకు ఈ కథ చేరువయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


