Save The Tigers Season 3 Review And Rating: తెలుగు ఓటీటీ ప్రపంచంలో సూపర్ హిట్ సిరీస్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది సేవ్ ది టైగర్స్. ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్స్ బాగా నవ్వించి జియో హాట్‌స్టార్ ఓటీటీలో మోస్ట్ వ్యూయెడ్ కేటగిరీలో టాప్ ప్లేస్ సంపాదించుకున్నాయి.
సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

దీంతో మేకర్స్ ఈ సిరీస్ నుంచి మూడో సీజన్‌ను దింపారు. జియో హాట్‌స్టార్‌లో జూన్ 19 నుంచి అంటే మరికొన్ని గంటల్లో సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవలే సేవ్ ది టైగర్స్ ఓటీటీ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? వెబ్ సిరీస్‌కు హ్యాట్రిక్ దక్కిందా? వంటి విషయాలను నేటి సేవ్ ది టైగర్స్ 3 రివ్యూలో చూద్దాం.
కథ:
గత సీజన్లలాగే ఈసారి కూడా రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ)ల చుట్టూనే కథ తిరుగుతుంది. కాకపోతే ఈసారి వారి సమస్యలు మరింత ముదురుతాయి. రాహుల్ తనకు ఇష్టం లేకపోయినా బెంగళూరు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. అయితే ఆ జాబ్ పోవడంతో మళ్లీ హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతాడు. ఈ నిజాన్ని భార్య మాధురి (పావని గంగిరెడ్డి)కి చెప్పడానికి భయపడి దాచేస్తాడు.
మరోవైపు గంటా రవి ఎమ్మెల్యే టికెట్ కోసం ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని, ఇంట్లో భార్య హైమా (సుజాత) పెట్టే పోరు తట్టుకోలేక ఓ గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతాడు. ఇక మూడో జంట విషయానికి వస్తే.. రేఖ (దేవియాని శర్మ) తన భర్త విక్రమ్ నుంచి విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుతుంది. దీనికి రివర్స్‌గా విక్రమ్ తన భార్య నుంచి భరణం కావాలని డిమాండ్ చేస్తాడు.
గుప్తా ప్రయోగం, రెండు లోకాల కథ
ఇలా ముగ్గురు మిత్రులకు తమ జీవితాలపై విరక్తి చెంది.. అసలు ఈ పెళ్లిళ్ల కాన్సెప్ట్ పెట్టింది ఎవరు? స్వర్గంలో పెళ్లిళ్లు ముడిపడతాయని ఎవరు చెప్పారు? అంటూ దేవుడిపై నానా బూతులు తిడుతూ ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. ఈ గోడంతా స్వర్గంలో ఉన్న ఇంద్రుడు (వెన్నెల కిషోర్) వింటాడు. వెంటనే గుప్తా (గుండు సుదర్శన్)ను పిలిచి, వారి సమస్యకు పరిష్కారం చూపమని ఆదేశిస్తాడు. దీంతో చిత్రగుప్జుడు ఒక వింత ప్రయోగం చేస్తాడు.
{{/usCountry}}ఇలా ముగ్గురు మిత్రులకు తమ జీవితాలపై విరక్తి చెంది.. అసలు ఈ పెళ్లిళ్ల కాన్సెప్ట్ పెట్టింది ఎవరు? స్వర్గంలో పెళ్లిళ్లు ముడిపడతాయని ఎవరు చెప్పారు? అంటూ దేవుడిపై నానా బూతులు తిడుతూ ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. ఈ గోడంతా స్వర్గంలో ఉన్న ఇంద్రుడు (వెన్నెల కిషోర్) వింటాడు. వెంటనే గుప్తా (గుండు సుదర్శన్)ను పిలిచి, వారి సమస్యకు పరిష్కారం చూపమని ఆదేశిస్తాడు. దీంతో చిత్రగుప్జుడు ఒక వింత ప్రయోగం చేస్తాడు.
{{/usCountry}}ఈ మొదటి లోకంలో ఉన్న రవి, విక్రమ్, రాహుల్‌లను.. మరో సమాంతర ప్రపంచం (సెకండ్ వరల్డ్)లో ఉన్న ముగ్గురితో అటుఇటుగా మారుస్తాడు (స్వాపింగ్). రూపాలు ఒక్కటే అయినా గుణాలు వేరైన ఆ రెండో ప్రపంచపు ముగ్గురు ఇక్కడికి వస్తే ఏం జరిగింది? ఇక్కడి వాళ్లు అక్కడికి వెళ్లి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనేదే సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కథ.
విశ్లేషణ:
మొదటి రెండు సీజన్ల తరహాలోనే సేవ్ ది టైగర్స్ 3 కూడా ఆద్యంతం కామెడీతో సాగిపోతుంది. ఈసారి కామెడీకి కాస్తా ఫాంటసీ యాడ్ చేసి మరింత ఇంట్రెస్టింగ్‌గా మలిచారు. మొదటి రెండు సీజన్లు పూర్తిగా నిత్యజీవితంలో జరిగే యథార్థ సంఘటనల ఆధారంగా రియలిస్టిక్‌గా ఉంటే.. మూడో సీజన్‌కు రెండో లోకం అనే ఫాంటసీ ఎలిమెంట్‌ను జోడించారు.
'రెండు వేర్వేరు లోకాలు - క్యారెక్టర్ స్వాపింగ్' అనే పాయింట్ ఈ ఓటీటీ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. ఈ లోకంలో ప్రశాంతత లేదని భావించి వేరే లోకానికి వెళ్లిన ఆ ముగ్గురు ఫ్రెండ్స్‌కు.. మొదట్లో అక్కడ ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ తర్వాతే అక్కడ ఉన్న సమస్యలు భరించలేకపోతారు. మొదటి మూడు ఎపిసోడ్‌లు క్యారెక్టర్ల పరిచయం, ఈ లోకాల మార్పిడితో సరదాగా సాగిపోతాయి.
ఫిక్షనల్ టచ్‌తో పెరిగిన వినోదం
అయితే, రెండు లోకాల్లో ఉన్న ఈ ముగ్గురి క్యారెక్టర్స్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ ఫిక్షనల్ టచ్‌తోనే కామెడీ మరింతగా నవ్విస్తుంది. ఇక్కడ ఉండే గంటా రవికి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటే, రెండో ప్రపంచంలోని రవికి మాత్రం ప్రజలను ఎలా దోచుకోవాలనే దుర్బుద్ధి ఉంటుంది.
ఇలా ప్రతి పాత్రకు ఉన్న మంచి, చెడులను సమానంగా చూపించారు. ఇలా మనలోని నెగెటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మాత్రమే స్వీకరించాలనే ఓ మెసేజ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, క్లైమాక్స్ ఊహించేలాగే ఉంటుంది.
రెండు, మూడు సీన్లు తప్పా
కేవలం నవ్వించడమే కాకుండా మహిళా సాధికారత గురించి చెప్పే సీన్లు, భార్య అంటే భర్తకు బానిస కాదు అని వివరించే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన పరస్పర అవగాహనను చక్కగా ఎలివేట్ చేశారు. ఒక రెండు, మూడు సీన్లు తప్పా కుటుంబం అంతా కలిసి కూర్చుని చూసేలా క్లీన్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు.
సినిమాటోగ్రఫీ బాగుంది. అజయ్ అరసాడ అందించిన బీజీఎమ్ సీన్స్‌కు తగ్గట్లు మెప్పించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేసిన ఈ సిరీస్‌ను దర్శకుడు శ్రీరామ్ ఎరగం హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. విజయ్ నమోజు, డి.ఎస్. గౌతమ్ అందించిన సంభాషణలు పేలాయి.
ఆలోచింపజేసే సీన్లు.. నటీనటుల ప్రదర్శన
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ తమ నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఈ సీజన్‌లో వీరికి రెండు వేర్వేరు గెటప్స్, భిన్నమైన ఎమోషన్స్ చూపించే అవకాశం దక్కడంతో పోటీపడి నటించారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా మరో వేరియేషన్‌తో కామెడీని పండించారు.
వీరికి తోడుగా సుజాత, దేవయాని శర్మ, పావని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక సహాయ పాత్రల్లో కనిపించిన అవినాష్, జబర్దస్త్ రోహిణి, హర్షవర్ధన్ ఎప్పటిలాగే నవ్వించారు. ఇంద్రుడిగా కమెడియన్ వెన్నెల కిషోర్ బాగా సూట్ అయ్యారు. గెస్ట్ అప్పీయరెన్స్ అయిన తనకున్న డైలాగ్స్‌తో నవ్వించారు.
హ్యాట్రిక్ కొట్టిన ఓటీటీ సిరీస్
ఇక రెండు లోకాల్లోనూ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన శ్రీకాంత్ అయ్యంగార్, బిగ్ బాస్ గంగవ్వ తమదైన నటనతో షైన్ అయ్యారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ వీకెండ్‌కు కుటుంబంతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి ‘సేవ్ ది టైగర్స్ 3’ ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్. జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ కానున్న సేవ్ ది టైగర్స్ సీజన్ 3 మరోసారి హ్యాట్రిక్ కొట్టిందని చెప్పుకోవచ్చు.