...
...
Next Story

Serial Actress: వేసుకునే దుస్తులపై వేధింపులు- భర్త, అత్తపై సీరియల్ హీరోయిన్ గృహహింస కేసు- బంగారం లాక్కున్నారంటూ!

Serial Actress Aditi Sharma Domestic Violence Case On Husband: ప్రముఖ బుల్లితెర హీరోయిన్ అదితి శర్మ తన భర్త అభినిత్ కౌశిక్, అత్తమామలపై గృహహింస ఆరోపణలతో ముంబై పోలీసులను ఆశ్రయించారు. పెళ్లయిన కొన్ని రోజులకే తను వేసుకునే దుస్తులు, ఇతర విషాయలపై వేధింపులు మొదలయ్యాయని, తన బంగారం కూడా లాక్కున్నారన్నారు.

Published on: Aug 26, 2026, 16:36:23 IST
Advertisement

Serial Actress Aditi Sharma Domestic Violence Case On Husband: ప్రముఖ బుల్లితెర నటి, 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ఫేమ్ అదితి శర్మ తన వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భర్త అభినిత్ కౌశిక్, అత్త ఊర్మిళ కౌశిక్ (65), ఆడపడుచు కీర్తి కౌశిక్ (29) తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ అదితి శర్మ ముంబైలోని గోరేగావ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కన్నీటి పర్యంతమైన నటి

వేసుకునే దుస్తులపై వేధింపులు- భర్త, అత్తపై సీరియల్ హీరోయిన్ గృహహింస కేసు- బంగారం లాక్కున్నారంటూ!
వేసుకునే దుస్తులపై వేధింపులు- భర్త, అత్తపై సీరియల్ హీరోయిన్ గృహహింస కేసు- బంగారం లాక్కున్నారంటూ!

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జూలై 31న భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అదితి శర్మ తనకు ఎదురైన మానసిక క్షోభ నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పర్సనల్ విషయాలు చెప్పడానికి ఇష్టపడను.. కానీ,

"ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు, నిర్ణయాల నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది" అని బుల్లితెర హీరోయిన్ అదితి శర్మ తెలిపారు. వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పడానికి సాధారణంగా ఇష్టపడనని, పరిస్థితులు చేయిదాటిపోవడంతోనే చట్టపరమైన చర్యలకు వెళ్లాల్సి వచ్చిందని ఆమె వివరించారు.

హింసను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, కుటుంబ మద్దతుతో పాటు ధ్యానం (మెడిటేషన్) చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుందని అదితి శర్మ సూచించారు. కాగా, 2021 జూన్‌లో ఒక ఆన్‌లైన్ నటన శిక్షణ సమయంలో అదితి, అభినిత్ మధ్య పరిచయం ఏర్పడింది.

పెళ్లయిన కొద్దిరోజులకే మొదలైన గొడవలు

ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2024 నవంబర్ 12న ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్దిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. తాను వేసుకునే దుస్తులు, రోజువారీ విషయాలలో భర్త వేధించడం మొదలుపెట్టాడని అదితి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఇంటి ఖర్చులను పంచుకోవడానికి బదులు తననే డబ్బులు అడిగేవాడని ఆమె వాపోయారు.

కాఫీ వివాదం.. భౌతిక దాడికి దారితీసిన ఘటన

గొడవలు పెరిగిన ప్రతిసారీ భర్త అభినిత్ కౌశిక్ తన తల్లి, సోదరిని రంగంలోకి దించేవాడని, వారు సమస్యను సర్దుమణచడానికి బదులు తనను మరింత నిందించారని చెప్పారు. దీనితో పాటు తన బంగారు గొలుసులు, ఉంగరాలు, వజ్రాల ఉంగరం, మంగళసూత్రం, గాజులను కూడా అత్తగారు ఉంచేసుకుని వెనక్కి ఇవ్వడం లేదని ఫిర్యాదులో స్పష్టం చేశారు అదితి శర్మ.

చట్టపరమైన చర్యలు

బాధితురాలి ఫిర్యాదు మేరకు గోరేగావ్ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 (భర్త లేదా బంధువుల క్రూరత్వం), సెక్షన్ 316(2) (నమ్మకద్రోహం), సెక్షన్ 352 (అవమానించడం) కింద కేసులు నమోదు చేశారు.

ప్రస్తుతం అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ అమితా మరాఠే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. 'కాలీరేన్', 'యే జాదూ హై జిన్ కా!', 'రబ్ సే హై దువా' వంటి పాపులర్ సీరియల్స్ ద్వారా టీవీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అదితికి ఎదురైన ఈ పరిస్థితి బుల్లితెర వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe