Shahrukh Khan Manager Pooja Dadlani Buys Luxury Flats: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వెనుక ఉండి ఆయన అన్ని విషయాలు చూసుకునే వ్యక్తి మేనేజర్ పూజా దద్లానీ అని అందరికీ తెలిసిందే. కేవలం షారుఖ్ వృత్తిపరమైన బాధ్యతలే కాకుండా, ఆయన బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, పబ్లిక్ అప్పీరెన్స్‌లను పర్యవేక్షించే పూజా, ఇప్పుడు తన రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో వార్తల్లో నిలిచారు. ముంబైలో సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాంద్రా ఏరియాలో పూజా భారీ డీల్ కుదుర్చుకున్నారు.
బాంద్రాలో మూడు ఫ్లాట్లు.. ఆరు కార్ పార్కింగ్‌లు

ముంబైలోని కార్టర్ రోడ్‌లో ఉన్న 'వరుణ్' అనే భవనంలో పూజా దద్లానీ, ఆమె భర్త హితేష్ ప్రకాష్ గుర్నాని, తండ్రి మోహన్ సియోరామ్ దద్లానీ కలిసి ఈ మూడు అపార్ట్‌మెంట్లను కొన్నారు. ప్రస్తుతం ఈ భవనం పునరాభివృద్ధి (Redevelopment) దశలో ఉంది. 'క్రీ మ్యాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన పత్రాల ప్రకారం, ఈ మూడు ఫ్లాట్ల మొత్తం విలువ రూ.38.21 కోట్లు.
ఈ అపార్ట్‌మెంట్లు భవనంలోని పై అంతస్తుల్లో ఉండటం విశేషం. ప్రతి ఫ్లాట్ దాదాపు 1,511 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. దీనికి అదనంగా 81 చదరపు అడుగుల బాల్కనీ కూడా ఉంది. అంటే మొత్తం మూడు ఫ్లాట్లు కలిపి 4,776 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ లగ్జరీ ఫ్లాట్లతో పాటు ఆరు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఈ డీల్‌లో భాగమే.
కోట్లలో స్టాంప్ డ్యూటీ.. 2028లో పొసెషన్
ఈ భారీ లావాదేవీకి సంబంధించి ఏప్రిల్ 21, 2026న రిజిస్ట్రేషన్ పనులు ముగిశాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం పూజా కుటుంబం రూ.2.16 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ.90,000 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించింది.
ప్రస్తుతం నిర్మాణం సాగుతున్న ఈ భవనం 2028 డిసెంబర్ నాటికి వినియోగదారుల చేతికి వచ్చే అవకాశం ఉంది. ట్రైక్షా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ (శ్రీ లోటస్ డెవలపర్స్ అనుబంధ సంస్థ) నుంచి వీటిని కొనుగోలు చేశారు పూజా దద్లానీ అండ్ ఫ్యామిలీ.
సెలబ్రిటీ మేనేజర్ల జాబితాలో పూజా టాప్
{{/usCountry}}ప్రస్తుతం నిర్మాణం సాగుతున్న ఈ భవనం 2028 డిసెంబర్ నాటికి వినియోగదారుల చేతికి వచ్చే అవకాశం ఉంది. ట్రైక్షా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ (శ్రీ లోటస్ డెవలపర్స్ అనుబంధ సంస్థ) నుంచి వీటిని కొనుగోలు చేశారు పూజా దద్లానీ అండ్ ఫ్యామిలీ.
సెలబ్రిటీ మేనేజర్ల జాబితాలో పూజా టాప్
{{/usCountry}}భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే సెలబ్రిటీ మేనేజర్లలో పూజా దద్లానీ ఒకరు. 2023లో ఆమె ముంబైలో మరో విలాసవంతమైన ఇంటిని రీనోవేట్ చేయించుకున్నారు. ఆ ఇంటి ఇంటీరియర్ డిజైన్‌ను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం. పూజా దద్లానీ కేవలం మేనేజర్‌గానే కాకుండా ఖాన్ కుటుంబంలో ఒక సభ్యురాలిగా కలిసిపోయారు.
షారుఖ్ 'మన్నత్' అప్‌డేట్స్
మరోవైపు షారుఖ్ ఖాన్ కూడా తన నివాసం 'మన్నత్'కు సంబంధించిన అనుబంధ భవనం (Annexe) పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కాలంలో ఆయన ఖార్ ప్రాంతంలోని పాలి హిల్ ఏరియాలో రెండు లగ్జరీ డ్యూప్లెక్స్ ఇళ్లను నెలకు రూ.24 లక్షల పైచిలుకు అద్దెకు తీసుకున్నారు. దాదాపు మూడేళ్ల కాలానికి రూ.8.67 కోట్ల ఒప్పందంతో ఈ ఇళ్లను కిరాయికి తీసుకున్నట్లు సమాచారం.