Actress Amulya Sri Suicide: వెండితెరపై మెరిసిపోవాలని, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ మహానగరంలో అడుగుపెట్టింది ఆ యువతి. తన ప్రతిభతో షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలోనే కామాంధుల కన్ను ఆమెపై పడింది.
మృగాళ్ల వేధింపులు

సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో నివాసముంటున్న షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ.. కొందరు మృగాళ్ల వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సినీ రంగుల ప్రపంచాన్ని నమ్ముకుని వచ్చే యువతులను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు డిజిటల్ దాడులకు తెగబడుతున్నారు. రహస్య కెమెరాలు, స్మార్ట్‌ఫోన్ల సాయంతో వ్యక్తిగత విషయాలను రికార్డ్ చేయడం, ఆపై సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటం లాంటి ఉదంతాలు ఇండస్ట్రీకి వస్తున్న కొత్తవారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ విషయంలోనూ ఇదే తరహా ఘాతుకం జరిగింది.
6 నెలలుగా నరకయాతన.. నగ్న వీడియోలతో బెదిరింపులు
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే కొంతమంది యువకులు అమూల్య శ్రీకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత బాత్‌రూమ్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారు. ఆ నగ్న వీడియోలను చూపిస్తూ గత ఆరు నెలలుగా ఆమెను తీవ్ర మానసిక నరకయాతనకు గురిచేశారు.
తమ కోరిక తీర్చడానికి తమ దగ్గరికి రావాలని, లేదంటే ఈ వీడియోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి కెరీర్‌ను నాశనం చేస్తామంటూ నిందితులు నిరంతరం వేధించారు. ఎదుగుతున్న కెరీర్ ఎక్కడ పాడవుతుందోననే భయంతో, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అమూల్య శ్రీ లోలోపలే కుమిలిపోయింది.
పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
{{/usCountry}}తమ కోరిక తీర్చడానికి తమ దగ్గరికి రావాలని, లేదంటే ఈ వీడియోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి కెరీర్‌ను నాశనం చేస్తామంటూ నిందితులు నిరంతరం వేధించారు. ఎదుగుతున్న కెరీర్ ఎక్కడ పాడవుతుందోననే భయంతో, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అమూల్య శ్రీ లోలోపలే కుమిలిపోయింది.
పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
{{/usCountry}}ఈ వేధింపులు మితిమీరడంతో, నిందితుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ అమూల్య శ్రీ సూసైడ్‌కు ముందే సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. అయితే, బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు సకాలంలో స్పందించలేదని, కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
చట్టం నుంచి సరైన మద్దతు లభించకపోవడం, మరోవైపు నిందితుల వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమూల్య.. పది రోజుల క్రితం తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
"నా కూతురు స్నానం చేసే వీడియోలు తీసి ఆరు నెలలుగా నరకం చూపించారు. పోలీసులకు చెప్తే పట్టించుకోలేదు, నా బిడ్డ ప్రాణం పోయాక కూడా నిందితులను అరెస్ట్ చేయడం లేదు" అని అమూల్య శ్రీ తల్లి కన్నీరుమున్నీరయ్యారు.
న్యాయం కోసం తల్లి, సోదరి రోదన
అమూల్యకు తండ్రి లేకపోవడంతో ఆమె తల్లి, సోదరి ఒంటరిగా మిగిలారు. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు కామాంధుల వేధింపుల వల్ల శవంగా మారడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ప్రధాన నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత తల్లి ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, అమూల్య సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.