Snow Akka Mouneesha Chowdary On Bigg Boss Telugu 10 Entry: సినిమాలో ఒక్క సీన్‌తో తెగ క్రేజ్ తెచ్చుకున్నట్లే సోషల్ మీడియాలో ఒక్క రీల్, ఒక్క డైలాగ్‌తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంటున్నారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్నర్లు, కంటెంట్ క్రియేటర్లు.

అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణే స్నో అక్క. ఒక్క డైలాగ్, ఒక్క రీల్‌తో ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ ట్రెండ్ అయింది ఈ బ్యూటి. ఇంతకీ ఈ స్నో అక్క అసలు పేరు మౌనీషా చౌదరి. ఆమె ఒక మోడల్. ఇంతకుముందు అమెరికాలో నివసించిన మౌనీషా చౌదరి 2016లో మిస్ ఆసియా ఉతాగా కిరీటం దక్కించుకుంది.
మంచుపై వీడియో
మోడలింగ్ తర్వాత కంటెంట్ క్రియేటర్‌గా మారిన మౌనీషా మంచుపై ఓ వీడియో చేసింది. అందులో ఆమె చెప్పిన డైలాగ్, ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అయ్యాయి. కాస్తా ట్రోలింగ్ కూడా జరిగింది. దాంతో మౌనీషా చౌదరి కాస్తా స్నో అక్కగా, ఉతా స్నో అక్కగా పాపులర్ అయింది.
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు ప్రమోషన్స్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది. మంచు విష్ణు కన్నప్ప, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు వంటి సినిమాలతో కొలాబరేషన్స్ చేస్తూ ప్రమోట్ చేస్తోంది. అలాగే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతోంది.
బిగ్ బాస్ తెలుగు 10పై హింట్
అయితే, ఈ స్నో బ్యూటీ బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొనెందుకు అవకాశం వచ్చినట్లు హింట్ ఇచ్చింది. యాంకర్ శివతో జరిగిన ఇంటర్వ్యూలో మౌనీషా చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్, విషయాలు చెప్పుకొచ్చింది.
{{/usCountry}}అయితే, ఈ స్నో బ్యూటీ బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొనెందుకు అవకాశం వచ్చినట్లు హింట్ ఇచ్చింది. యాంకర్ శివతో జరిగిన ఇంటర్వ్యూలో మౌనీషా చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్, విషయాలు చెప్పుకొచ్చింది.
{{/usCountry}}"రీసెంట్‌గా నువ్వు ఇండియాకి రావడానికి కారణం ఇదే.. రియాలిటీ షో.. మాటీవీలో టెలీకాస్ట్ అయ్యే ఆ షోకి వెళ్లబోతున్నారనే" అని యాంకర్ శివ ఇన్‌డైరెక్ట్‌గా అడిగాడు. దానికి "ఈ ట్రిప్ రీజన్ మాత్రం అయితే అది కాదు. జెన్యూన్‌గా అది అయితే కాదు. నెక్ట్స్ ట్రిప్ సెప్టెంబర్, అక్టోబర్‌లో వస్తున్నాను మళ్లీ. అప్పుడు అది అవుతుందో లేదో నాకు తెలియదు" అని మౌనీషా చౌదరి తెలిపింది.
బిగ్ బాస్ 10 తెలుగు స్టార్ట్ డేట్
అయితే, నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 10 తెలుగు షో సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం కానుంది. మౌనీషా చెప్పిన డేట్ కూడా బిగ్ బాస్ టీవీ ప్రీమియర్‌కు మ్యాచ్ అవుతోంది. దీంతో బిగ్ బాస్ తెలుగు 10లోకి మౌనీషా వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అది అవుతుందో లేదో అని మౌనీషా చెప్పడం చూస్తే ఇంకా చర్చలు జరుగుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.
"మీరు యూఎస్ఏలో ఒక పాడ్‌కాస్ట్ ఇచ్చారు. అందులో తెలుగు డైరెక్టర్స్ గురించి మీరు ఒక కంటెంట్ మాట్లాడారు. ఆ ఎక్స్‌పీరియెన్స్ ఏంటీ? అసలు ఎందుకు వాళ్లు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు మళ్లీ వాళ్లు ఫోన్ చేసి సారీలు చెప్పడం లాంటివి ఏమైనా జరిగాయా?" అని యాంకర్ శివ అడిగాడు.
15, 16 ఏళ్లు ఉండొచ్చు
"సారీలు వంటివి ఏముండవు లేండి. బేసికల్లీ ఏమైందంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండే. అందరికీ కూడా ఉంటాయి కదా. అప్పుడు నేను 15 లేదా 16 ఏజ్ అనుకుంటా. ఫేస్‌బుక్‌లో ఒక డైరెక్టర్ మెసేజ్ చేశాడు. జెనరల్‌గా సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను ఎస్, నో కూడా ఫుల్‌గా చెప్పలేకపోయాను. ఆ ఏజ్‌లో ఏం తెలుస్తది చెప్పండి" అని మౌనీషా చౌదరి తెలిపింది.
"మీ కొలతలు ఏంటీ అంటూ బిలో ద బెల్ట్ (బాడీ పార్ట్స్ సైజ్‌ల గురించి అన్న అర్థంలో) మాట్లాడారు. అదే నేను షేర్ చేసుకున్నా ఆ పాడ్‌కాస్ట్‌లో. వాళ్లు అడిగింది ఏంటంటే టాలీవుడ్‌లో ఎందుకు ట్రై చేయలేదు అంటే.. చిన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి అయింది. కొంచెం భయపడ్డాను. ఇంట్లోవాళ్ల సపోర్ట్ కూడా లేదు. అందుకని నేను చేయలేదని చెప్పాను. ఇది ఎప్పుడో అయిందేలేండీ. నేను కూడా అంతగా గుర్తుపెట్టుకోలేదు" అని మౌనీషా వెల్లడించింది.
ఇండస్ట్రీ మారిపోయింది
"అలాంటి సంఘటనే మళ్లీ ఎదురైతే" అని యాంకర్ శివ ప్రశ్నించాడు. అవ్వలేదండి. అదృషవశాత్తు ఇప్పటివరకు అయితే నేను మాట్లాడినవాళ్లు అంతా చాలా గౌరవంగా మాట్లాడారు. ఇండస్ట్రీ కూడా చేంజ్ అయిందనిపించింది. అమ్మాయిలు కూడా ప్రతిదీ బయటకు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు చాలా మందికి అవగాహన వచ్చింది. భయపడట్లేదు ఇప్పుడు" అని స్నో అక్క మౌనీషా చెప్పుకొచ్చింది.