...
...
Next Story

Heroine: ముఖానికి 20 కుట్లు, సర్జరీ అయిన ఆరో రోజే సాంగ్ షూటింగ్‌కు హీరోయిన్- తనకే చాలా సిగ్గేసిందన్న సుహాస్ డైరెక్టర్

Director Mathimaran Pugazhendhi About Mahima Nambiar: బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది సుహాస్ తమిళ చిత్రం మండాడి. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో హీరోయిన్ మహిమా నంబియార్‌కు జరిగిన ఘోర ప్రమాదం, ఆమె చూపించిన అంకితభావం గురించి దర్శకుడు మతిమారన్ సంచలన విషయాలు చెప్పారు.

Published on: Sep 25, 2026, 11:00:44 IST
Advertisement

Suhas Director About Heroine Accident And Surgery: తమిళ చిత్రసీమలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం 'మండాడి'. కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి, తెలుగు యంగ్ హీరో సుహాస్, సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చి ఊహించని విజయాన్ని అందుకంది.

షాకింగ్ విషయం చెప్పిన డైరెక్టర్

ముఖానికి 20 కుట్లు, సర్జరీ అయిన ఆరో రోజే సాంగ్ షూటింగ్‌కు హీరోయిన్- తనకే చాలా సిగ్గేసిందన్న సుహాస్ డైరెక్టర్
ముఖానికి 20 కుట్లు, సర్జరీ అయిన ఆరో రోజే సాంగ్ షూటింగ్‌కు హీరోయిన్- తనకే చాలా సిగ్గేసిందన్న సుహాస్ డైరెక్టర్

అయితే, ఈ సినిమా వెనుక మండాడిలో నటించిన హీరోయిన్ మహిమా నంబియార్ చూపించిన అసమాన అంకితభావం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన మండాడి సక్సెస్ మీట్‌లో దర్శకుడు మతిమారన్ నటి మహిమకు సంబంధించిన ఒక షాకింగ్ నిజం బయటపెట్టారు.

ముఖం ఛిద్రమైనా షూటింగ్‌కు హాజరు!

"ఈ సినిమాలో 'ఉసురే నీదాన్ పుల్లా' పాట చిత్రీకరణకు కేవలం ఐదు రోజుల ముందు మహిమా నంబియార్‌ తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ యాక్సిడెంట్‌లో మహిమా ముఖం తీవ్రంగా దెబ్బతిని, ఏకంగా 20కి పైగా కుట్లు పడ్డాయి" అని దర్శకుడు మతిమారన్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే మహిమ తన ముఖం ఫోటోను పంపినట్లు ఆయన తెలిపారు.

నాకే చాలా సిగ్గేసింది

"ఆమె పరిస్థితి చూశాక షూటింగ్‌కు రమ్మని అడగడానికి నాకే చాలా సిగ్గుగా అనిపించింది. కానీ మరో దారి లేకపోవడంతో అడగాల్సి వచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ జరిగిన కేవలం ఆరో రోజే ఆమె సెట్స్‌కి వచ్చి పాట చిత్రీకరణలో పాల్గొన్నారు" అని మతిమారన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విజయకథ వెనుక మహిమ పడ్డ కష్టం, శ్రమ ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు.

పాత్రలోని భారం నన్ను ఏడిపించింది!

కథా బలంతో వచ్చిన మండాడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 111.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి, భారత మార్కెట్‌లో రూ. 81.90 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. సర్దార్ 2, డీసీ వంటి భారీ చిత్రాల వసూళ్లను దాటుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది మండాడి.

హీరోయిన్ మహిమా సినిమాలు

మలయాళంలో కెరీర్ ప్రారంభించి, తమిళంలో 'సాటై', 'కుట్రమ్ 23', 'చంద్రముఖి 2' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన బ్యూటిఫుల్ హీరోయిన్ మహిమా నంబియార్‌కు ఈ సినిమా కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks