Tavvai OTT Release: భారతీయ సినీ రంగంలో పురాణాలు, మిస్టరీ, హారర్ అంశాల కలయికతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాంతార, విరూపాక్ష, ముంజ్యా వంటి సినిమాలు ఈ తరహా విభిన్నమైన కంటెంట్‌తోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.
తవ్వై ఓటీటీ స్ట్రీమింగ్

సరిగ్గా ఇదే బాటలో సరికొత్త మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ 'తవ్వై' (Tavvai) ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేరుగా ఓటీటీలోకి వచ్చిన తవ్వై సినిమా 1800 కాలం నాటి శాపం, దేవుడు వర్సెస్ దుష్టశక్తి అన్నట్లుగా సాగుతుంది. తవ్వై అంటే హిందీలో దరిద్ర దేవత, దౌర్భాగ్య దేవి అనే అర్థాలు వస్తాయని సమాచారం.
తరాల నాటి నగల శాపం.. ఆకట్టుకునే కథాంశం
తవ్వై సినిమా కథ 1800ల కాలంలో మొదలవుతుంది. ఆ కాలంలో ఒక పాలకుడు చేసిన క్రూరమైన పనులు, దురాశ వల్ల ఒక శక్తివంతమైన శాపం పుడుతుంది. ఆ శాపం కాలంతో పాటు కరిగిపోకుండా, న్యాయం జరగని ఒక పగలా మారి ఒక కుటుంబానికి చుట్టుకుంటుంది. తరాలు మారుతున్నా ఆ కుటుంబ వెన్నంటే సాగుతుంది.
అయితే, ఆ కుటుంబానికి వారసత్వంగా వస్తున్న నగలలో ఆ శాపం ఉంటుంది. ఆ నగలు ఎవరైనా వేసుకుంటే ఆ శాపం ప్రభావితం అవుతుంది. ప్రస్తుత కాలంలో ప్రమేంద్ర (భూషణ్ ప్రధాన్) ఈ శాపాన్ని మోస్తుంటాడు. తన చుట్టూ జరుగుతున్న అతీత శక్తుల కదలికలతో పాటు, తను చేయని తప్పులకు తన జీవితం ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకునే క్రమంలో సాగే మిస్టరీనే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
"పురాణాలు, హారర్ అంశాల కలయిక ఎప్పుడూ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతుంది, ఈ ఫార్ములా డిజిటల్ ఆడియన్స్‌కు పక్కాగా కనెక్ట్ అవుతుంది" అని చిత్ర యూనిట్ పేర్కొంది.
ప్రముఖ నటీనటుల కలయిక
{{/usCountry}}"పురాణాలు, హారర్ అంశాల కలయిక ఎప్పుడూ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతుంది, ఈ ఫార్ములా డిజిటల్ ఆడియన్స్‌కు పక్కాగా కనెక్ట్ అవుతుంది" అని చిత్ర యూనిట్ పేర్కొంది.
ప్రముఖ నటీనటుల కలయిక
{{/usCountry}}ఈ చిత్రంలో సీనియర్ నటుడు మనోజ్ జోషి (అవధేష్), భూషణ్ ప్రధాన్ (ప్రమేంద్ర), తృప్తి సాహు (దక్షత), అర్పిత రంకా (యతేంద్ర) ప్రధాన పాత్రలు పోషించారు. నీతూ పాండే, సురేందర్ శర్మ, కీర్తికా గుప్తా, స్పందన పల్లి, తరణ్ అర్రేజా, నైమేష్ నవీన్ కీలక పాత్రల్లో కనిపించారు.
నిర్భయ్ జారివాలా, జయేష్ వృషీరాజ్ సంయుక్తంగా తవ్వై చిత్రానికి దర్శకత్వం వహించారు. రమేష్ అర్రేజా ఈ అద్భుతమైన కథను అందించారు. కల్పేష్ వాఘాసియా, అనికేత్ జసాని, దేవ్ గాంధీ ఈ చిత్రాన్ని నిర్మించారు. జయేష్ వృషీరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా, అవిరల్ కుమార్, అర్జిత్ శ్రీవాస్తవ సంగీతాన్ని సమకూర్చారు. దినేష్ గురామ్ ఎడిటర్‌గా వ్యవహరించారు.
రెండేళ్ల నిరీక్షణకు తెర.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్
తవ్వై సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్ రెండేళ్ల క్రితమే యూట్యూబ్‌లో విడుదలై సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. థియేటర్లలో విడుదల కావాల్సిన తవ్వై చిత్రం ఎట్టకేలకు నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జియో హాట్‌స్టార్ సంస్థ తవ్వై ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
జూన్ 29, 2026 నుంచి అంటే నిన్నటి నుంచి జియో హాట్‌స్టార్‌లో తవ్వై ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి అయితే, హిందీ భాషలో మాత్రమే తవ్వై ఓటీటీ రిలీజ్ అయింది. మిస్టరీ, సస్పెన్స్, హారర్ సినిమాలను ఇష్టపడే వారికి జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'తవ్వై' ఒక మంచి వీకెండ్ వాచ్‌గా నిలుస్తుంది.