ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 31) ఒక్కరోజు సుమారుగా 20 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు భాషలో ఐదు వరకు మూవీస్ ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కాంతార చాప్టర్ 1 ఓటీటీ

కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా పాకి సూపర్ హిట్ అయిన సినిమా కాంతార. ఆ మూవీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన సినిమానే కాంతార చాప్టర్ 1. పీరియాడిక్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 మూవీకి హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి మెయిన్ లీడ్ రోల్ చేశాడు.
రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన కాంతార చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 852 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది రికార్డులు క్రియేట్ చేసింది.
అలాంటి కాంతార చాప్టర్ 1 ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ అయింది. కన్నడతోపాటు తెలుగు, మలయాళం, తమిళం వంటి నాలుగు భాషల్లో కాంతార 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ
తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ తెలుగు ఓటీటీ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. తప్పిపోయిన కూతురు కోసం తండ్రి చేసే అన్వేషణ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది.
జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 ఒరిజినల్ సిరీస్‌గా రూపొందిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది.
జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి
{{/usCountry}}జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 ఒరిజినల్ సిరీస్‌గా రూపొందిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది.
జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి
{{/usCountry}}సీనియర్ హీరో, నటుడు జగపతి బాబు హోస్ట్‌గా మారిన సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా. ప్రతి వారం సరికొత్త ఎపిసోడ్‌తో అలరించి ఈ టాక్ షో ఇవాళ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో జయమ్ము నిశ్చయమ్మురా ఓటీటీ రిలీజ్ అయింది. నేటి ఎపిసోడ్‌కు మ్యూజిక్ రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గెస్టుగా హాజరయ్యారు.
రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ ఓటీటీ
హిందీ భాషలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్. బిహార్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ ఓటీటీ సిరీస్ కూడా జీ5లోనే స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు భాషల్లో రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
కొత్త లోక చాప్టర్ 1 చంద్ర ఓటీటీ
ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన సూపర్ హీరో యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా కొత్త లోక చాప్టర్ 1 చంద్ర. కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ కె గఫూర్ నటించిన కొత్త లోక జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠీ వంటి ఆరు భాషల్లో హాట్‌స్టార్‌లో కొత్త లోక ఓటీటీ రిలీజ్ అయింది.