ప్రతి వారం ఓటీటీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వస్తుంటాయి. కానీ, వాటిలో ఎక్కువగా ఒక ఫ్రైడే మాత్రం అధికంగా ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. అలా ఇవాళ 20 వరకు ఓటీటీ సినిమాలు ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఏకంగా 7 సినిమాలు తెలుగు భాషలో డిఫరెంట్ జోనర్లతో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ స్పెషల్ తెలుగు ఓటీటీ సినిమాలు ఏంటీ, వాటి ప్లాట్‌ఫ్లామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మాస్ జాతర ఓటీటీ

మాస్ మహారాజా రవితేజ, బ్యూటిఫుల్ శ్రీలీల జోడీగా మరోసారి నటించిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే మాస్ జాతర. హీరో నవీన్ చంద్ర విలన్‌గా చేసిన ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. థియేటర్లలో అంతంత మాత్రంగా మాస్ జాతర టాక్ తెచ్చుకుంది.
నేడు నెట్‌ఫ్లిక్స్‌లో మాస్ జాతర ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం వంటి నాలుగు భాషల్లో మాస్ జాతర ఓటీటీ రిలీజ్ అయింది.
ఆర్యన్ ఓటీటీ
తమిళంలో సైకో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఆర్యన్. విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్‌డీబీలో పదికి 7 రేటింగ్ అందుకున్న ఆర్యన్ మూవీకి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు.
మాస్ జాతర సినిమా లాగే ఆర్యన్ కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఇవాళ (నవంబర్ 28) డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో ఆర్యన్ ఓటీటీ రిలీజ్ అయింది.
ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ
బ్యూటిపుల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన మలయాళ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ది పెట్ డిటెక్టివ్. పెంపుడు కుక్క కోసం వెతుక్కుంటూ వెళ్లి మాఫియా చేతికి చిక్కే కథగా తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీలో నేటి నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడలో కూడా మూవీ అందుబాటులో ఉంది.
ప్రేమిస్తున్నా-శశివదనే ఓటీటీ
{{/usCountry}}బ్యూటిపుల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన మలయాళ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ది పెట్ డిటెక్టివ్. పెంపుడు కుక్క కోసం వెతుక్కుంటూ వెళ్లి మాఫియా చేతికి చిక్కే కథగా తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీలో నేటి నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడలో కూడా మూవీ అందుబాటులో ఉంది.
ప్రేమిస్తున్నా-శశివదనే ఓటీటీ
{{/usCountry}}తెలుగులో ఇవాళ రెండు రొమాంటిక్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవే ప్రేమిస్తున్నా, శశి వదనే. బోల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ప్రేమిస్తున్నా ఆహాలో ఓటీటీ రిలీజ్ అయింది. రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన శశివదనే సన్ నెక్ట్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఆన్ పావమ్ పొల్లతతు ఓటీటీ
తమిళంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా ఆన్ పావమ్ పొల్లతతు. మనిషి పాపం తనకే పెద్ద భూతం వంటిది అన్న అర్థం వస్తుంది. ఐఎమ్‌డీబీలో పదికి 7.2 రేటింగ్ సాధించిన ఆన్ పావమ్ పొల్లతతు జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మొత్తంగా 5 భాషల్లో ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.
పాంచ్ మినార్ ఓటీటీ
ఓటీటీలోకి ఇవాళ ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు సినిమా పాంచ్ మినార్. క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, రాశి సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. కేవలం వారం రోజుల్లోనే ఇవాళ పాంచ్ మినార్ ఓటీటీ రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో పాంచ్ మినార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.