...
...
Next Story

ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 13 ఇంట్రెస్టింగ్ సినిమాలు- హారర్, క్రైమ్ థ్రిల్లర్, బోల్డ్, కామెడీ జోనర్లలో- ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో కచ్చితంగా చూసేందుకు స్పెషల్‌గా 9 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, క్రైమ్ థ్రిల్లర్, బోల్డ్ రొమాంటిక్, కామెడీ జోనర్లలో ఉన్న ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: Oct 20, 2025, 15:30:10 IST
Advertisement

ఓటీటీలోకి ఈ వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, బోల్డ్ రొమాంటిక్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 13 ఇంట్రెస్టింగ్ సినిమాలు- హారర్, క్రైమ్ థ్రిల్లర్, బోల్డ్, కామెడీ జోనర్లలో- ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 13 ఇంట్రెస్టింగ్ సినిమాలు- హారర్, క్రైమ్ థ్రిల్లర్, బోల్డ్, కామెడీ జోనర్లలో- ఎక్కడ చూడాలంటే?

హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 13

ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్ (తెలుగు డబ్బింగ్ హారర్ సర్వైవల్ మిస్టరీ చిత్రం)- అక్టోబర్ 16

స్ట్రైకింగ్ రెస్క్యూ (తెలుగు డబ్బింగ్ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ)- అక్టోబర్ 16

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

గుడ్ న్యూస్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 17

గ్రేటర్ కాలేష్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 17

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

కల్ప నేస్ట్రా/(అవర్ ఫాల్ట్) (తెలుగు డబ్బింగ్ స్పానిష్ బోల్డ్ రొమాంటిక్ డ్రామా మూవీ) - అక్టోబర్ 16

దక్ష- ది డెడ్‌లీ కాన్సిపిరసీ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 17

టన్నెల్: సన్ ఇన్ ది డార్క్ (తెలుగు డబ్బింగ్ తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 17

ఈటీవీ విన్ ఓటీటీ

ఒక మంచి ప్రేమకథ (తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా)- అక్టోబర్ 16

కిష్కింధపురి (తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)- జీ5 ఓటీటీ- అక్టోబర్ 17

ఆనందలహరి (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- అక్టోబర్ 17

మిరాజ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 19

తెలుగు స్ట్రయిట్ సినిమాలు

ఇలా ఈ వారం (అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 19) వరకు తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో అనుపమ పరమేశ్వరన్-బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి, మంచు లక్ష్మి-మోహన్ బాబు క్రైమ్ థ్రిల్లర్ దక్ష, ఒక మంచి ప్రేమకథ, ఆనందలహరి, రైడర్ మాత్రం నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన స్ట్రయిట్ తెలుగు సినిమాలు.

కచ్చితంగా చూడాల్సినవి 8

ఈ ఐదింటితోపాటు లావణ్య త్రిపాఠి తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్ టన్నెల్, మిరాజ్, ఫైనల్ డెస్టినేషన్, చిన్న పిల్లల కోసం హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్‌ సినిమాలు చూడాల్సినవిధంగా ఉన్నాయి. ఈ 13 ఇంట్రెస్టింగ్ సినిమాల్లో కచ్చితంగా చూడాల్సిన విధంగా 9 సినిమాలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe