తమిళ స్టార్ హీరో ధనుష్, హిందీ ముద్దుగుమ్మ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా చిత్రం తేరే ఇష్క్ మే. లవ్ సినిమాలకు పెట్టింది పేరు అయిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదల అయింది.
స్ట్రాంగ్ ఓపెనింగ్స్

ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా తేరే ఇష్క్ మే మంచి రివ్యూలను అందుకుంటోంది. హాలీడే కాకున్నా తొలి రోజు శుక్రవారం స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది ఈ మూవీ. విడుదలైన రెండవ రోజున ఈ చిత్రం అలాగే దూకుడు కొనసాగించిందా? ఇప్పటి వరకు తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను వివరంగా చూద్దాం.
సొంత సినీ ఇండస్ట్రీలోనే తక్కువ
తేరే ఇష్క్ మే సినిమాకు ఇండియాలో తొలి రోజున రూ. 16 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో హిందీ నుంచి రూ. 15.25 కోట్ల కలెక్షన్స్ ఉంటే తమిళం ద్వారా కేవలం 75 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే ధనుష్ సొంత సినీ ఇండస్ట్రీ నుంచే అతి తక్కువగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
తేరే ఇష్క్ మే కలెక్షన్స్ డే 2
ఇక రెండో రోజు అయిన శనివారం (నవంబర్ 29) తేరే ఇష్క్ మే సినిమాకు భారతదేశంలో రూ. 17 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే, మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజున మరింతగా తేరే మేరే ఇష్క్ కలెక్షన్స్ పెరిగాయి. ఇక రెండు రోజుల్లో ఇండియాలో తేరే మేరే ఇష్క్ సినిమాకు రూ. 33 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
ఎమర్జెన్సీ లైఫ్‌టైమ్ కలెక్షన్స్ అవుట్
అయితే, తేరే మేరే ఇష్క్ రెండు రోజుల కలెక్షన్స్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ప్రతిష్టాత్మక చిత్రం ఎమర్జెన్సీ లైఫ్‌టైమ్ కలెక్షన్స్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఎమర్జెన్సీ మూవీకి ఓవరాల్‌గా ఇండియాలో రూ. 23.75 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ మూవీ జీవితకాలపు వసూళ్లను ధనుష్, కృతి సనన్ చిత్రం 2 రోజుల్లో దాటేసింది.
పూజా హెగ్డే మూవీనే టార్గెట్
{{/usCountry}}అయితే, తేరే మేరే ఇష్క్ రెండు రోజుల కలెక్షన్స్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ప్రతిష్టాత్మక చిత్రం ఎమర్జెన్సీ లైఫ్‌టైమ్ కలెక్షన్స్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఎమర్జెన్సీ మూవీకి ఓవరాల్‌గా ఇండియాలో రూ. 23.75 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ మూవీ జీవితకాలపు వసూళ్లను ధనుష్, కృతి సనన్ చిత్రం 2 రోజుల్లో దాటేసింది.
పూజా హెగ్డే మూవీనే టార్గెట్
{{/usCountry}}ఇక ఇప్పుడు షాహిద్ కపూర్, పూజా హెగ్డేల యాక్షన్ థ్రిల్లర్ సినిమా దేవా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను బీట్ చేసే పనిలో పడింది తేరే మేరే ఇష్క్. దేవా సినిమాకు ఇండియాలో ఓవరాల్‌గా రూ. 55.8 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ఈ టార్గెట్‌ను కూడా తేరే ఇష్క్ మే చేధించేలా కనిపిస్తోంది.