ఓటీటీలోకి న్యూ తెలుగు కామెడీ మూవీ.. హృదయానికి హత్తుకునేలా సీన్స్ ఉంటాయన్న హీరో.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి న్యూ తెలుగు కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా నవంబర్ 21న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ సినిమాలోని అన్నీ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉంటాయని చెప్పాడు.
తెలుగులో రీసెంట్‌గా వచ్చిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసిన మెమోరీ కార్డ్ పోతే ఆ ఫొటోగ్రాఫర్ ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడో కామెడీగా చిత్రీకరించిన సినిమా ఇది. ఈ సినిమాలో తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటించారు.

పాజిటివ్ రివ్యూస్
నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8.5 రేటింగ్ కూడా సంపాదించుకుంది. అలాంటి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీలోకి వచ్చేయనుంది.
జీ5 ఓటీటీలో
తాజాగా నిన్న (నవంబర్ 21) ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ ప్రీమియర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పాత్రలోని అమాయకత్వం
హీరో తిరువీర్ మాట్లాడుతూ.. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంలో నేను పోషించిన రమేష్ అనే పాత్ర మనం అందరూ మన టౌన్, గ్రామంలో చూసేలానే ఉంటుంది. అతని పాత్రలోని అమాయకత్వం, తప్పు జరిగినప్పుడు పడే ఆందోళన, తప్పుపు సరిదిద్దుకోవటానికి చేసే ప్రయత్నాలు అన్నీ కామెడీగా ఉంటూనే హృదయానికి హత్తుకునేలా ఉంటాయి" అని అన్నాడు.
భిన్నమైన కోణాలు
"అతని పాత్రలోని భిన్న కోణాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అవే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమా జీ5 ఓటీటీలో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కావటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మందికి సినిమా రీచ్ అవుతుంది. రమేష్ పాత్ర, అతని ప్రపంచం మరింత మందిని మెప్పిస్తుంది" అని హీరో తిరువీర్ చెప్పాడు.
రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం
ఇకపోతే ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7పీఎమ్ ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు.
మౌత్ టాక్‌తో కలెక్షన్స్
తొలి ఆట నుంచే ది గ్రేట్ ప్రీ వెడ్డంగ్ షో సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనతో పాటు మంచి మసూళ్లను రాబట్టుకుంది.
బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ కంటెంట్, వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోన్న జీ5లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


