...
...
Next Story

OTT: 18.5 కోట్ల మంది చూసిన సూపర్ హిట్ సిరీస్- ఓటీటీలోకి సీజన్ 3- ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూసే దుష్టశక్తి!

The Lord Of The Rings: Rings Of Power Season 3 OTT Streaming Date: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఫాంటసీ ఎపిక్ 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' మూడో సీజన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి ఈ సూపర్ హిట్ సిరీస్ 3వ సీజన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసుకుందాం.

Published on: May 12, 2026, 13:50:39 IST
Advertisement

The Lord Of The Rings: Rings Of Power Season 3 OTT Release Date: ఫాంటసీ ప్రపంచం 'మిడిల్ ఎర్త్' మళ్లీ అలరించడానికి సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్ 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' మూడో సీజన్ రిలీజ్ డేట్‌ను అమెజాన్ ఎంజీఎం (Amazon MGM) స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.

ది రింగ్స్ ఆఫ్ పవర్ ఓటీటీ స్ట్రీమింగ్

18.5 కోట్ల మంది చూసిన సూపర్ హిట్ సిరీస్- ఓటీటీలోకి సీజన్ 3- ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూసే దుష్టశక్తి! (Instagram)
18.5 కోట్ల మంది చూసిన సూపర్ హిట్ సిరీస్- ఓటీటీలోకి సీజన్ 3- ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూసే దుష్టశక్తి! (Instagram)

నవంబర్ 11, 2026 అమెజాన్ ప్రైమ్‌లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. వరల్డ్ వైడ్‌గా ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సిరీస్‌ను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్. కేవలం ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రమే కాకుండా, ఈ సిరీస్ సాధించిన అద్భుతమైన గణాంకాలను కూడా సంస్థ వెల్లడించింది.

18.5 కోట్ల మంది వీక్షకులు.. సరికొత్త రికార్డు!

అమెజాన్ ప్రైమ్ వీడియో చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఓటీటీ సిరీస్‌లలో ఒకటిగా 'రింగ్స్ ఆఫ్ పవర్' నిలిచింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల మందికి పైగా వీక్షకులు ఈ సిరీస్‌ను చూశారని అమెజాన్ వెల్లడించింది. మొదటి సీజన్ లాంచింగ్ అయిన 91 రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూయర్ షిప్ సాధించగా, రెండో సీజన్ కూడా టాప్-5లో నిలిచింది.

ముఖ్యంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటున్న వారిలో మెజారిటీ ప్రజలు ఈ సిరీస్ కోసమే సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారని సంస్థ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. "ప్రారంభం నుంచి ఈ సిరీస్ ఒక భారీ స్థాయి విజువల్ వండర్‌గా నిలిచింది. మిడిల్ ఎర్త్ ప్రయాణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ఆదరణ చూస్తుంటే, మూడో సీజన్ పట్ల వారి అంచనాలు మరింత పెరుగుతున్నాయని అర్థమవుతోంది" అని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ గ్లోబల్ టెలివిజన్ హెడ్ పీటర్ ఫ్రైడ్లాండర్ పేర్కొన్నారు.

ఎల్వ్స్ - సౌరాన్ మధ్య మహా యుద్ధం

దుష్టశక్తి సౌరాన్ తన గుప్పిట్లోకి ప్రపంచాన్ని తెచ్చుకోవడానికి 'వన్ రింగ్' (One Ring)ను ఎలా తయారు చేశాడు? ఆ ఉంగరం కోసం రాజ్యాల మధ్య జరిగిన సంఘర్షణలేంటి? అన్నది ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

హాలీవుడ్ స్థాయి విజువల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో సాగే ఈ ఫాంటసీ కథ తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. 'బాహుబలి' వంటి భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్‌ను ఇష్టపడే మన ప్రేక్షకులకు ఈ ఓటీటీ సిరీస్ ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

సీజన్ 4పై ముందస్తు ప్రకటన

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌తో పాటే మేకర్స్ మరో తీపి కబురు అందించారు. ఈ సిరీస్‌ను నాలుగో సీజన్ కోసం కూడా రెన్యూవల్ చేస్తున్నట్లు ప్రకటించారు.

జేడీ పేన్, పాట్రిక్ మెక్కే షో రన్నర్లుగా వ్యవహరిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును మల్టీ-సీజన్ ఎపిక్‌గా ఐదు సీజన్ల వరకు పొడిగించే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. నవంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న ఈ ఓటీటీ సిరీస్ 3వ సీజన్‌లో రాజ్యాల పతనం, కొత్త కూటముల ఏర్పాటు వంటి అంశాలు ఉత్కంఠ రేపనున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'ది రింగ్స్ ఆఫ్ పవర్' సీజన్ 3 విడుదల తేదీ ఎప్పుడు?

ఈ సిరీస్ మూడో సీజన్ నవంబర్ 11, 2026న విడుదల కానుంది.

2. ఈ సిరీస్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుంది?

'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

3. మూడో సీజన్ కథ దేని గురించి ఉంటుంది?

సౌరాన్ శక్తిమంతమైన 'వన్ రింగ్'ను తయారు చేయడం, ఎల్వ్స్ వర్సెస్ సౌరాన్ మధ్య జరిగే మహా యుద్ధం చుట్టూ ఈ సీజన్ కథ సాగుతుంది.

4. ఈ సిరీస్‌కు తదుపరి సీజన్లు ఉన్నాయా?

అవును, మేకర్స్ ఇప్పటికే సీజన్ 4ను అధికారికంగా ఖరారు చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe