...
...
Next Story

OTT Crime: ఓటీటీలోకి నేరుగా మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్- కంటైనర్‌లో దొరికే మహిళ, ప్రాణం కోసం పోరాటం- తెలుగులో కూడా!

The Marked Women OTT Streaming In Telugu: ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే క్రైమ్ థ్రిల్లర్ ది మార్క్‌డ్ ఉమెన్ స్ట్రీమింగ్ కానుంది. ఓ కంటైనర్‌లో పోలీసులకు మహిళ దొరకడం, ఆమె చుట్టు అల్లుకున్న చీకటి రహస్యాల నేపథ్యంగా మూవీ తెరకెక్కింది. తెలుగులోనూ రానున్న ది మార్క్‌డ్ ఉమెన్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Jun 1, 2026, 13:17:18 IST
Advertisement

Crime Thriller The Marked Women OTT Release In Telugu: తెలుగు రాష్ట్రాల్లో ఓటీటీ వీక్షకులకు క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలు అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఓటీటీల్లో వచ్చే డిఫరెంట్ భాషల్లోని థ్రిల్లర్ సిరీస్‌లు, సినిమాలకు ఇక్కడి ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు.

మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీలోకి నేరుగా మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్- కంటైనర్‌లో దొరికే మహిళ, ప్రాణం కోసం పోరాటం- తెలుగులో కూడా!
ఓటీటీలోకి నేరుగా మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్- కంటైనర్‌లో దొరికే మహిళ, ప్రాణం కోసం పోరాటం- తెలుగులో కూడా!

'మనీ హైస్ట్' వంటి అంతర్జాతీయ ఓటీటీ సిరీస్‌లను ఆదరించిన ఇండియన్ ప్రేక్షకులను అలరించేందుకు మరో సరికొత్త మైండ్ బ్లోయింగ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ముందుకు వస్తోంది. ఆ సిరీస్ పేరే 'ది మార్క్‌డ్ ఉమెన్' (The Marked Woman). ఇందులో కాండెలా పెన్యా, అనా రుజాస్, పోల్ లోపెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

బార్సిలోనా పోర్టులో వింత కేసు.. అసలు కథ ఏంటి?

ఈ సినిమా కథ మొత్తం ఒక వింత మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. బార్సిలోనా నగరంలోని ఒక రేవు (పోర్ట్) లో ఉన్న కంటైనర్‌లో కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కిన స్థితిలో ఒక అపరిచిత మహిళ (అనా రుజాస్) కనిపిస్తుంది. ఆమెను పోలీసులు కాపాడినప్పటికీ, అసలు తానెవరు? ఆ కంటైనర్‌లోకి ఎలా వచ్చింది? అనే విషయాలను ఆమె గుర్తు తెచ్చుకోలేకపోతుంది. దాంతో ఆమెకు పూర్తిగా గతాన్ని మర్చిపోయే వ్యాధి (అమ్నీషియా) ఉన్నట్లు గుర్తిస్తారు.

ఈ వింత కేసును ఛేదించే బాధ్యతను డిటెక్టివ్ అన్నా రిపోల్ (కాండెలా పెన్యా) చేతుల్లో పెడతారు. ఆఫీసర్ క్విక్ జారేట్ (పోల్ లోపెజ్) సహాయంతో అన్నా రిపోల్ రంగంలోకి దిగుతుంది. ఆ అపరిచిత మహిళ అసలు గుర్తింపు ఏంటి? ఆమె మెదడులో దాగి ఉన్న రహస్యాలు ఎలాంటివి? ఆ తర్వాత ఆమె చుట్టూ జరిగిన సంఘటనలు ఏంటీ? అసలు ఆ మహిళ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ది మార్క్‌డ్ ఉమెన్ ఓటీటీ మూవీని చూడాల్సిందే.

మహిళ చేసే పోరాటాలు

ఈ చిత్రంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భారీ తారాగణం నటిస్తున్నారు. మన దేశంలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన ఓటీటీ సిరీస్ మనీ హైస్ట్ నటుడు లుకా పెరోస్‌తో పాటు మనోలో సోలో, కిరా మిరో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు గేబ్ ఇబానెజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, లారా సెండిమ్ స్క్రీన్‌ప్లే అందించారు.

ఫ్రెంచ్ పబ్లిషర్ పాయింట్స్, స్పానిష్ పబ్లిషర్ అల్ఫాగువారా సంయుక్తంగా ప్రచురించిన రోసా మోంటెరో, ఒలివియర్ ట్రక్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి ది మార్క్‌డ్ ఉమెన్ ఓటీటీలోకి నేరుగా వచ్చేయనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు అధికారిక స్ట్రీమింగ్ తేదీని సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

నెట్‌ఫ్లిక్స్‌లో ది మార్క్‌డ్ ఉమెన్ ఓటీటీ రిలీజ్ కానుంది. జూన్ 5 నుంచి వరల్డ్ వైడ్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ది మార్క్‌డ్ ఉమెన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. కేవలం ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో మాత్రమే కాకుండా తెలుగు, హిందీలో కూడా ది మార్క్‌డ్ ఉమెన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe