The Paradise OTT: నేచురల్ స్టార్ నాని, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ ఓటీటీ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.
ది ప్యారడైజ్ కలెక్షన్లు

నాని హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా ఈ చిత్రం కలెక్షన్లలో అదరగొడుతోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. నాని కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ఈ ఫిల్మ్ దూసుకుపోతోంది. ఈ వారాంతంతో ఈ చిత్రం థియేటర్లలో మూడో వారంలోకి అడుగుపెడుతోంది.
నాని మాస్ యాక్టింగ్
భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ మిక్స్‌డ్ టాక్ రావడంతో ది ప్యారడైజ్ బాక్సాఫీస్ రన్ కొద్దిగా మందగించింది. అయినప్పటికీ నాని మాస్ యాక్టింగ్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో కనిపించారు.
అలాగే రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
ది ప్యారడైజ్ ఓటీటీ
ది ప్యారడైజ్ మూవీ థియేటర్లలో ఇంకా రన్ అవుతుండగానే ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (OTT Release) పై సోషల్ మీడియాలో ఒక క్రేజీ బజ్ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అక్టోబర్ 23, 2026 నుంచి 'ది ప్యారడైజ్' స్ట్రీమింగ్ కానుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
{{/usCountry}}ది ప్యారడైజ్ మూవీ థియేటర్లలో ఇంకా రన్ అవుతుండగానే ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (OTT Release) పై సోషల్ మీడియాలో ఒక క్రేజీ బజ్ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అక్టోబర్ 23, 2026 నుంచి 'ది ప్యారడైజ్' స్ట్రీమింగ్ కానుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
{{/usCountry}}అయితే దీనిపై మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో, హిందీలో కూడా మల్టీ లాంగ్వేజ్ ఓటీటీ రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ క్రేజీ యాక్షన్ డ్రామాను ఓటీటీలో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.