...
...
Next Story

OTT Interesting: ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- అన్నీ తెలుగులోనే- మరికొన్ని గంటల్లో!

OTT Interesting Movies To Watch In Telugu: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఒక్కోటి ఒక్కోరకంగా ఉంది. మరి ఆ టాప్ 6 ఓటీటీ ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Jul 30, 2026, 17:58:30 IST
Advertisement

Top 6 OTT Interesting Movies To Watch In Telugu: థియేటర్లలో కొత్త చిత్రాల సందడి ఎంత ఉన్నప్పటికీ, ఇంటి పట్టునే హాయిగా ఆస్వాదించే ఓటీటీ కంటెంట్‌కు ఉండే క్రేజ్ వేరు. ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా క్రైమ్ థ్రిల్లర్లు, డార్క్ కామెడీలు, స్పోర్ట్స్ డ్రామాలు, ఎమోషనల్ లవ్ స్టోరీలతో ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

టాప్ 6 ఓటీటీ ఇంట్రెస్టింగ్ సినిమాలు

ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- అన్నీ తెలుగులోనే- మరికొన్ని గంటల్లో!
ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- అన్నీ తెలుగులోనే- మరికొన్ని గంటల్లో!

ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అది కూడా మరికొన్ని గంటల్లో అన్నీ తెలుగులోనే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. జూలై 31 అర్థరాత్రి నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ టాప్ 6 ఓటీటీ ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌లో డార్క్ కామెడీతో వినోదం

1. రావు బహదూర్ (Rao Bahadur)

తెలుగులో అరుదుగా వచ్చే సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా కథాంశంతో హీరో సత్యదేవ్ నటించిన 'రావు బహదూర్' తెరకెక్కింది. సమాజంలో హోదా ఉన్న ఒక వ్యక్తి మానసిక సంఘర్షణ, అతడి చుట్టూ తిరిగే విచిత్రమైన పరిస్థితులను వినోదాత్మకంగా, కాస్త డార్క్ హ్యూమర్‌తో దర్శకుడు వెంకటేష్ మహా ఆవిష్కరించారు. కథనంలో వచ్చే అనూహ్య మలుపులు, నటీనటుల విలక్షణ ప్రదర్శన ఈ సినిమాకు ప్రధాన బలం. నెట్‌ఫ్లిక్స్‌లో రావు బహదూర్ ఓటీటీ రిలీజ్ కానుంది.

ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.7/10

ఎందుకు చూడాలి?: వినూత్న కాన్సెప్ట్‌లు, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాలను ఇష్టపడేవారికి 'రావు బహదూర్' కొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా సత్యదేవ్ యాక్టింగ్, విజువల్స్, కెమెరా వర్క్ బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ సినిమా ఇవ్వనుంది.

2. గట్టా కుస్తీ 2 (Gatta Kusthi 2)

ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.3/10

ఎందుకు చూడాలి?: వారాంతంలో కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకోవడానికి, కుస్తీ మైదానంలో సాగే వినోదాన్ని ఆస్వాదించడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. కామెడీ, ఫ్యామిలీ డ్రామా, కుస్తీ యాక్షన్ అన్ని ఎలిమెంట్స్‌తో ఈ మూవీ మంచి ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు.

ఆహాలో మైమరిపించే ప్రేమకథ

3. దీవానా (Deewana)

ఈ తరం యువత భావోద్వేగాలను, ప్రేమలో పడే ఘర్షణలను ప్రతిబింబించే పక్కా తెలుగు రొమాంటిక్ డ్రామా 'దీవానా'. రెండు విభిన్న మనస్తత్వాలు ఉన్న ప్రేమికుల మధ్య సాగే కథ ఇది. ఈశ్వర్ చంద్ సంగీతం, హృదయానికి హత్తుకునే సంభాషణలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆహా ఓటీటీలో దీవానా అందుబాటులోకి రానుంది.

ఐఎమ్‌డీబీ రేటింగ్: 9.2/10

ఎందుకు చూడాలి?: స్వచ్ఛమైన ప్రేమకథలను, ఎమోషనల్ ఫీల్ గుడ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను 'దీవానా' బాగా ఆకట్టుకుంటుంది. హర్షిత్ రెడ్డి తన యాక్టింగ్‌తో మెప్పించాడని రివ్యూలు వచ్చాయి.

జీ5లో సస్పెన్స్ & కోర్ట్‌రూమ్ డ్రామాలు

4. అబ్జెక్షన్ మై లార్డ్ (Objection My Lord)

కోర్టు గదిలో సాగే వాదనలు, న్యాయం కోసం పోరాడే ఒక లాయర్ కథతో రూపొందిన తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్'. ఒక సంక్లిష్టమైన కేసును పరిష్కరించే క్రమంలో ఎదురయ్యే పొలిటికల్, లీగల్ సవాళ్లను సస్పెన్స్ మిళితం చేసి తెరకెక్కించారు. జీ5 ఓటీటీకి అబ్జెక్షన్ మై లార్డ్ నేరుగా స్ట్రీమింగ్ కానుంది.

ఎందుకు చూడాలి?: లీగల్ థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేషన్ డ్రామాలను ఇష్టపడేవారిని ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠకు గురిచేస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

5. బాలన్: ది బాయ్ (Balan: The Boy)

మలయాళంలో ప్రశంసలు పొందిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. తెలుగు డబ్బింగ్‌లో జీ5 వేదికగా జూలై 31న బాలన్ ది బాయ్ ఓటీటీ రిలీజ్ అవుతోంది. ఒక చిన్న పిల్లాడి మానసిక స్థితి, అతడి చుట్టూ జరుగుతున్న వింత నేరాల వెనుక ఉన్న నిజాలను శోధించే కథాంశమిది.

ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.2/10

ఎందుకు చూడాలి?: మలయాళ చిత్రాల్లో ఉండే కథన వైవిధ్యం, పక్కా మేకింగ్ స్టైల్ నచ్చే వారికి ఈ చిత్రం మంచి థ్రిల్ ఇస్తుంది. అలాగే, చిన్న పిల్లాడి, అతని తల్లి చుట్టూ వచ్చే సీన్స్ భయపెడుతూనే థ్రిల్ పంచుతాయి.

6. వంద దేవుళ్లు (Vanda Devullu/Nooru Saami)

తమిళంలో రూపొందిన ఒక ఆత్మీయ సామాజిక కుటుంబ కథా చిత్రం నూరు సామి తెలుగులో 'వంద దేవుళ్లు'గా వస్తోంది. భర్త చనిపోయి పిల్లలు ఉన్న ఒక వితంతువుకు రెండో పెళ్లి చేసే అంశం చుట్టూ ఈ సినిమా సాగే విధానం అందరిని ఆలోచింపజేస్తుంది.

ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.7/10

ఎందుకు చూడాలి?: భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం, తల్లి-కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ వంటి ఎలిమెంట్స్ ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. అలాగే, రెండో పెళ్లి చేసుకునే విజయ్ ఆంటోనీ, స్వాసిక జంట మధ్య కెమెస్ట్రీ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది.

ఒక్కదాంట్లోనే 3

ఇలా మరికొన్ని గంటల్లో అంటే జూలై 31 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న ఈ ఆరు సినిమాలు విభిన్న జోనర్లలో ఒక్కోటి ఒక్కో రకంగా అలరించనుంది. ఈ ఆరింటిలో మూడు ఒక్క జీ5 ఓటీటీలోనే అందుబాటులో ఉండటం విశేషం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe