...
...
Next Story

Serial: 36 గంటలు నాన్‌స్టాప్ షూటింగ్, 40 నిమిషాలు మాత్రమే నిద్ర.. తన సీరియల్ కష్టాలు చెప్పిన హీరోయిన్ ప్రియాంక చౌదరి

Priyanka Chahar Choudhary On 36 Hours Shooting: బుల్లితెర హీరోయిన్ ప్రియాంక చౌదరి తన సూపర్ హిట్ సీరియల్ వెనుక ఉన్న ఆసక్తికర నిజాలను బయటపెట్టింది. మొదట ఈ రోల్‌ను తిరస్కరించాలని భావించినట్లు చెప్పిన ఆమె, ఆపై రోజుకు 36 గంటల పాటు నిద్రలేకుండా షూటింగ్‌లో పాల్గొన్న క్షణాలను గుర్తుచేసుకుంది.

Published on: Jul 25, 2026, 10:05:39 IST
Advertisement

Priyanka Chahar Choudhary On 36 Hours Shooting: హిందీ బుల్లితెరపైనే కాకుండా మన తెలుగు నాట కూడా విశేష ఆదరణ పొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సీరియల్ 'నాగిన్'. తెలుగులో నాగినిగా సూపర్ హిట్ అయింది. లేడి ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ నిర్మాణంలో వచ్చిన 'నాగిన్ 7' సీజన్ ఇటీవలే విజయవంతంగా పూర్తయింది.

కొరియోగ్రాఫర్ యూట్యూబ్ వ్లాగ్‌లో

36 గంటలు నాన్‌స్టాప్ షూటింగ్, 40 నిమిషాలు మాత్రమే నిద్ర.. తన సీరియల్ కష్టాలు చెప్పిన హీరోయిన్ ప్రియాంక చౌదరి
36 గంటలు నాన్‌స్టాప్ షూటింగ్, 40 నిమిషాలు మాత్రమే నిద్ర.. తన సీరియల్ కష్టాలు చెప్పిన హీరోయిన్ ప్రియాంక చౌదరి

ఈ సిరీస్‌లో నాగిన్‌గా కనిపించి నటనతో ఆకట్టుకున్న ప్రముఖ నటి, సీరియల్ హీరోయిన్ ప్రియాంక చాహర్ చౌదరి, తాజాగా బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు సంచలన విషయాలను పంచుకుంది.

హిందీ బిగ్ బాస్ షో ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక, నాగిన్ 7 ఆఫర్‌ను తొలినాళ్లలో తిరస్కరించాలని భావించినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. సహజమైన నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలనే ఉద్దేశంతో ఈ సూపర్ నేచురల్ డ్రామాకు మొదట దూరంగా ఉండాలనుకున్నట్లు వెల్లడించింది.

బిగ్ బాస్ హౌస్‌లోనే ఎక్తా కపూర్ స్కెచ్!

ప్రియాంకకు నాగిన్ ఆఫర్ ఎలా వచ్చిందో వివరిస్తూ.. "బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే ఎక్తా మేడమ్ నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. ఓటీటీ షో నుంచి ఎలిమినేట్ కాకుండా నన్ను కాపాడాలని ఇతర దర్శకులకు ప్రత్యేకంగా చెప్పారు. హౌస్ నుంచి బయటకు వచ్చే ముందు నన్ను కౌగిలించుకుని, 'త్వరలోనే నీకు ఫోన్ చేస్తా' అని నా చెవిలో చెప్పారు. అది నాగిన్ పాత్ర కోసమే అని నాకు అప్పుడే అర్థమైంది" అని ప్రియాంక గుర్తుచేసుకుంది.

నాగిన్ 7తో పాటు 'బ్యాటిల్‌గ్రౌండ్' అనే రియాలిటీ షోకు మెంటార్‌గా వ్యవహరించడం వల్ల తన షూటింగ్ షెడ్యూల్ ఎంత దారుణంగా మారిందో ప్రియాంక చౌదరి వివరించింది. నాగిన్ కోసం నెలలో 26 రోజులు రోజుకు 12 గంటలు పనిచేసేదాన్ని అని చెప్పింది.

"రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు బ్యాటిల్‌గ్రౌండ్ షూటింగ్ జరిగేది. ఇంటికి వచ్చి త్వరత్వరగా స్నానం చేసి, ఉదయం 9 గంటలకల్లా నాగిన్ సెట్‌కు చేరుకునేదాన్ని. మళ్లీ రాత్రి 9 గంటల వరకు నాగిన్ షూటింగ్ ఉండేది. ఇలా దాదాపు 36 గంటల పాటు నిరంతరాయంగా పనిచేశాను. పగలు నిద్రపోవడం అలవాటు లేకపోవడంతో కేవలం 40 నిమిషాల కునుకుతోనే రోజులు గడిపాను" అని ప్రియాంక చౌదరి తన కష్టాన్ని పంచుకుంది.

'ఉడారియాన్' నుంచి 'నాగిన్ 7' వరకు సుదీర్ఘ ప్రయాణం

ప్రియాంక చాహర్ చౌదరి 'ఉడారియాన్' సీరియల్‌లో తేజో సంధు పాత్రతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ 16 సీజన్‌లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. టైటిల్ గెలవకపోయినా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సైతం ఆమెను 'రియల్ విన్నర్' అని ప్రశంసించారు.

ఆ క్రేజ్‌తోనే ఎక్తా కపూర్ నాగిన్ 7లో ప్రియాంక చౌదరికి ప్రధాన పాత్రను అందించారు. ప్రస్తుతం నాగిన్ 7 ముగియడంతో ప్రియాంక తన తదుపరి ప్రాజెక్టును త్వరలోనే ప్రకటించనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe