...
...
Next Story

Udaya Bhanu OTT: నా తొలి రోజుల్లో ఆ ఛానెల్ ఎంతో సపోర్ట్ చేసింది, ప్రతి కూతురు చూడాల్సిన ఓటీటీ సిరీస్ ఇది: యాంకర్ ఉదయభాను

Udaya Bhanu About OTT Series D/O Prasad Rao Kanabadutaledhu: టాలీవుడ్ పాపులర్ నటి, యాంకర్ ఉదయ భాను నటించిన లేటెస్ట్ ఓటీటీ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఇటీవల నిర్వహించిన సిరీస్ ప్రివ్యూ ఈవెంట్‌లో ఉదయ భాను ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Updated on: Feb 26, 2026, 15:35:57 IST
Advertisement

బుల్లితెర యాంకర్‌గా సూపర్ క్రేజ్ అందుకున్న ఉదయ భాను వెండితెరపై కూడా తనదైన ముద్ర వేసింది. లీడర్ మూవీలో రాజశేఖర అనే పాటలో నర్తించిన ఉదయ భాను చాలా కాలం గ్యాప్ తర్వాత త్రిబాణధారి బార్బరిక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సిరీస్

నా తొలి రోజుల్లో ఆ ఛానెల్ ఎంతో సపోర్ట్ చేసింది, ప్రతి కూతురు చూడాల్సిన ఓటీటీ సిరీస్ ఇది: యాంకర్ ఉదయభాను
నా తొలి రోజుల్లో ఆ ఛానెల్ ఎంతో సపోర్ట్ చేసింది, ప్రతి కూతురు చూడాల్సిన ఓటీటీ సిరీస్ ఇది: యాంకర్ ఉదయభాను

ఇప్పుడు ఉదయ భాను ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన తెలుగు వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు.

కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ నేపథ్యంలో రీసెంట్‌గా ప్రివ్యూ షో వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఉదయ భాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఓటీటీ రిలీజ్ కోసం

ఉదయ భాను మాట్లాడుతూ .. "డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ రిలీజ్ కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నాను. చాలా వేగంగా ఈ ఓటీటీ సిరీస్ షూటింగ్ పూర్తి చేశాం. నేను ఇందులోని కథకు, కారెక్టర్‌కు ఎంతో కనెక్ట్ అయ్యాను" అని అన్నారు.

"నా తొలి రోజుల్లో జీ తెలుగు ఛానెల్ ఎంతో సపోర్ట్ చేసింది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన జయంత్ గారికి థాంక్స్. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చిన శ్రీరామ్‌ సలహాలు తీసుకుంటూ ఉంటాను. శ్రీరామ్‌తో ఎన్నో ఏళ్ల నుంచి గొప్ప స్నేహబంధం ఉంది" అని ఉదయభాను తెలిపారు.

ఇప్పుడున్న సమాజానికి అవసరం

"రాజీవ్ కనకాల నాకు మంచి మిత్రుడు. వాసంతిక మంచి నటి. ఈ కథను గొప్పగా మలిచిన, తెరకెక్కించిన కృష్ణ గారికి హ్యాట్సాఫ్. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి" అని ఉద భాను కోరారు.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. "డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు చాలా బాగుంటుంది. నా దగ్గర ముందు ఓ లైన్ మాత్రమే ఉండేది. అది జయంత్ గారి దగ్గరకు వెళ్లడంతో పూర్తి కథగా మారింది. అనురాధ మేడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడకు వరకు వచ్చింది" అని చెప్పారు.

"‘రెక్కి’ తరువాత నేను ఈ కథనే రాశాను. ఈ స్టోరీ మొత్తం రాయడానికి నాకు రెండేళ్లు పట్టింది. ఫిబ్రవరి 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి" అని వెల్లడించారు ఓటీటీ సిరీస్ డైరెక్టర్ కృష్ణ పోలూరు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks